ట్రంప్ తో కాకుండా పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ ఎంత మందితో సంబంధాలున్నాయి? ఎంత మంది భర్తలు?

Written By:
Subscribe to Boldsky

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్.. ( ఈమె అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్‌)

సంబంధించిన కథనాలు రోజొకొక్కటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ప్రస్తుతం ఇదే హాట్ టాఫిక్. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ స్టెఫానీ క్లిఫర్డ్‌ మధ్య గత కొద్ది కాలం నుంచి కొనసాగుతున్న వివాదం అందరికి తెలిసిందే.

వారిద్దరి మధ్య ఒక ఒప్పందం

వారిద్దరి మధ్య ఒక ఒప్పందం

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వారిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగిందని, భారీ మొత్తాన్ని పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ కు చెల్లించారనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. ఈ మేరకు పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో ఒప్పందం చేసుకోవడం.. ఆమె సైలెంట్ గా ఉండడం జరిగిందట.

లక్షా ముప్పై వేల డాలర్లతో ఒప్పందం

లక్షా ముప్పై వేల డాలర్లతో ఒప్పందం

ఇది దీనిపై ఏకంగా ట్రంప్‌ వ్యక్తిగత అటార్నీ మైకేల్‌ కోహెన్‌ ఆ మధ్య అవును.. పోర్న్‌స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్‌ లక్షా ముప్పై వేల డాలర్లతో ఒప్పందం చేసుకున్నాడని చెప్పాడు.

న్యాయబద్ధమైంది

న్యాయబద్ధమైంది

చాలాకాలం గోప్యంగా ఉన్న ఈ విషయం ప్రపంచానికి అలా తెలిసిపోయింది. అయితే స్టోర్మీతో ట్రంప్ చేసుకున్న ఒప్పందం న్యాయబద్ధమైంది అని కూడా కోహెన్‌ తాజాగా చెప్పిన విషయం తెలిసిందే. అసలు స్టోర్మీ డేనియల్స్ ఎవరు?

లూసియానాలో

లూసియానాలో

స్టోర్మీ డేనియల్స్ లూసియానాలో పుట్టి పెరిగారు. ఈమె అసలు పేరు స్టెఫానీ గ్రెగోరి క్లిఫోర్డ్. స్టోర్మీ డేనియల్స్ తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల వయస్సున్నప్పుడే విడాకులు తీసుకున్నారు.

ఇళ్లు గడవని స్థితి

ఇళ్లు గడవని స్థితి

స్టోర్మీ డేనియల్స్ ఆమె తల్లి దగ్గరే ఉండేది. బాల్యంలో చాలా కష్టాలు పడింది. అస్సలు ఇళ్లు గడవని స్థితిలో స్టోర్మీ డేనియల్స్ ఉండేది. కనీసం ఇంటికి విద్యుత్తు కనెక్షన్ కూడా లేని రోజుల్ని తన చిన్నతనంలో గడిపింది స్టోర్మీ డేనియల్స్.

ఆమె జీవితం మారిపోయింది

ఆమె జీవితం మారిపోయింది

స్టోర్మీ డేనియల్స్ కు యుక్త వయస్సు రాగానే పోర్న్ మూవీలలో నటించడం మొదలుపెట్టింది. పోర్న్ ద్వారా ఆమె జీవితం మారిపోయింది. అంత వరకు ఇబ్బందుల్లో ఉన్న స్టోర్మీ డేనియల్స్ తర్వాత ఆర్థికంగా కాస్త ఎదిగింది.

వికెడ్ పిక్చర్స్

వికెడ్ పిక్చర్స్

2002లో స్టోర్మీ డేనియల్స్ దశ తిరిగింది. కాలిఫోర్నియా స్టూడియో తీసిన శృంగార చలన చిత్రమైన వికెడ్ పిక్చర్స్ లో ఈమె లీడ్ పాత్ర పోషించారు. దాంతో పోర్న్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టోర్మీ డేనియల్స్.

అవార్డులు కూడా వచ్చాయి

అవార్డులు కూడా వచ్చాయి

ఇక అడల్ట్ మూవీస్ లలో నటించినందుకు ఈ భామకు చాలా వరకు అవార్డులు కూడా వచ్చాయి. "ది 40-ఇయర్-ఓల్డ్ వర్జిన్," "నాక్డ్ అప్," "ఫైండింగ్ బ్లిస్" వంటి వాటిలో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది .స్టోర్మీ డేనియల్స్. 2007 లో ఆమె కూడా మెరూన్ 5 మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది.

అడల్ట్ మూవీ హీరో

అడల్ట్ మూవీ హీరో

ఇక స్టోర్మీ డేనియల్స్ ప్రస్తుత భర్త కూడా అడల్ట్ మూవీలలో నటిస్తారు. ఆయన కూడా పోర్న్ స్టార్. ఆయన పేరు. బ్రెండన్ మిల్లెర్. బ్రెండన్ మిల్లెర్ తో వివాహం జరగకముందే స్టోర్మీ డేనియల్స్ కు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు.

మంచి తల్లిని

మంచి తల్లిని

స్టోర్మీ డేనియల్స్ తన బాయ్ ఫ్రెండ్ ద్వారా ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది. 2012 లో ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడించారు. తాను మంచి పోర్న్ స్టార్ నే కాదు.. మంచి తల్లిని అని కూడా స్టోర్మీ డేనియల్స్ అప్పట్లో చెప్పారు.

రెండుసార్లు వివాహం

రెండుసార్లు వివాహం

డేనియల్స్ రెండుసార్లు వివాహం చేసుకుంది. విడాకులు తీసుకుంది. మొదటి భర్త ఆమెతో పాటు పోర్న్ లో నటించేవాడు. అతని పేరు పాట్ మైనే. అతనితో 2003-2005 వరకు గడిపింది. తర్వాత మైక్ మోజ్ తో 2007-2009 వరకు గడిపింది. వీరిద్దరూ కాకుండా మాజీ బాయ్ ఫ్రెండ్ గ్లెన్డన్ క్రెయిన్ తో ఒక కూతురిని కనింది.

మెలానియా డెలవరీకి ముందు

మెలానియా డెలవరీకి ముందు

ఇక ట్రంప్ భార్య మెలానియా డెలవరీకి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో ఎఫైర్‌ పెట్టుకుందట స్టోర్మీ డేనియల్స్. చాలా తక్కువ కాలం వీరిబంధం కొనసాగిందట. తన కూతురు ఇవాంక మాదిరిగా ఉంటావని స్టోర్మీ డేనియల్స్ ను భలే పొగిడేవాట ట్రంప్. ఈ విషయాలన్ని స్టోర్మీ డేనియల్స్ చెప్పిందంటారు కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

శారీరక సంబంధం

శారీరక సంబంధం

పోర్న్‌ స్టార్‌ స్టెఫానీ క్లిఫార్డ్‌ అలియాస్ స్టోర్మీ డేనియల్స్ తాను ఏడాది పాటు ట్రంప్ తో సన్నిహితంగా ఉన్నానని కూడా చెప్పింది. అయితే తమ మధ్య శారీరక సంబంధం లేదంది గతంలో.

ట్రంప్ తో స్టెఫానీ క్లిఫార్డ్‌ కు సంబంధం

ట్రంప్ తో స్టెఫానీ క్లిఫార్డ్‌ కు సంబంధం

అయితే డేనియల్స్ సన్నిహిత మిత్రుడు కెయిత్‌ మున్యాన్‌ కూడా ట్రంప్ తో స్టెఫానీ క్లిఫార్డ్‌ అలియాస్ స్టోర్మీ డేనియల్స్ సంబంధం ఉందని చెప్పాడు. తమ అక్రమ సంబంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టొద్దని చేసుకున్న ఒప్పందంలో మున్యాన్‌కు కూడా భాగస్వామ్యం ఉందట.

మొత్తం నలుగురు

మొత్తం నలుగురు

డేనియల్స్ తో పాటు మొత్తం నలుగురు వ్యక్తులు మున్యాన్‌, డానియెల్‌ మేనేజర్‌ గినా రోడ్రిగ్వెజ్‌, డానియెల్‌ మాజీ భర్త మైక్‌ మోస్నీ, మరో పోర్న్‌స్టార్‌ జెస్సికాకు ఇందులో భాగస్వామ్యం ఉందట.

చాలాసార్లు ట్రంప్ ఫోన్ చేసేవాడట

చాలాసార్లు ట్రంప్ ఫోన్ చేసేవాడట

కెయిత్‌ మున్యాన్‌ చెప్పిన ప్రకారం.. ట్రంప్‌ చాలాసార్లు డేనియల్స్ కు ఫోన్ చేసేవాడట. అప్పుడు వారిద్దరూ హెడ్‌సెట్‌లోని చెరో స్పీకర్‌ చెవిలో పెట్టుకొని వినే వారట. ట్రంప్‌ తనతో సన్నిహితంగా ఉండమని డేనియల్స్ ను కోరేవాడట. మొదట ఇష్టం లేదని చెప్పిన డేనియల్స్ చివరకు ట్రంప్ కు దగ్గర అయ్యిందట.

తిరిగి ఇచ్చి వేస్తా

తిరిగి ఇచ్చి వేస్తా

ఇక ట్రంప్‌ తనకిచ్చిన 1,30,000 అమెరికన్‌ డాలర్ల సొమ్మును తిరిగి ఇచ్చివేయాలనుకుంటున్నట్లు క్లిఫోర్డ్‌ కూడా చెప్పింది. మొదట ట్రంప్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన వ్యక్తిగత సలహాదారు మైకెల్‌ కోహెన్‌ ఖండించినా చివరకు అంగీకరించాడు.

బహిరంగంగా చెప్పొచ్చు

బహిరంగంగా చెప్పొచ్చు

ఇక ఒప్పందం రద్దయితే క్లిఫోర్డ్‌ తనకు ట్రంప్ కు మధ్య ఉన్న అనుబంధం గురించి బహిరంగంగా మాట్లాడడానికి వీలుంటుంది. ఒక వేళ వారిద్దరి మధ్య సెక్స్ జరిగి ఉంటే ఆ వీడియోలు కూడా బయటపెట్టొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.

Image Credit (All Photos)

English summary

stephanie dlifford aka stormy daniels affairs biography

stephanie dlifford aka stormy daniels affairs biography..Meet 'Stormy Daniels' - the porn star whom Trump's lawyer allegedly paid to keep quiet about a sexual affair
Story first published: Saturday, March 17, 2018, 9:30 [IST]