Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఏ అబ్బాయి అయినా అమ్మాయితో అలాగే గడపాలనుకుంటాడు, అది తప్పుకాదు, కానీ.. #mystory200
ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి ప్రేమలు లేవు. ఒక అమ్మాయిని లవర్ గా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటామో అలాగే అదే అమ్మాయి భార్యగా వస్తే కూడా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి. #mystory200
ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి అబ్బాయి అమ్మాయిని ప్రాణంగా చూసుకుంటా అని చెబుతాడు. నా భర్త కూడా అలాగే మేమిద్దరం లవ్ లో ఉన్నప్పుడు నాకు ఎన్ని కథలు చెప్పాడో ! బంగారం నిన్ను చాలా బాగా చూసుకుంటాను... నువ్వు ఏమి బాధపడకు అంటూ ఏవేవో కథలు చెప్పాడు. ఇక పెళ్లి అయిన తర్వాత అస్సలు పట్టించుకోవడం లేదు.

మీరే మా ప్రాణం అన్నట్లుగా ప్రేమిస్తారు
పెళ్లికి ముందు నా భర్తలాగానే అందరూ అబ్బాయిలు అమ్మాయిలను చాలా గాఢంగా... మీరే మా ప్రాణం అన్నట్లుగా ప్రేమిస్తారు. ఇక మా ఆయన అయితే నిన్ను దక్కించుకునేందకు నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటే ఏవేవో మాటలు చెప్పాడు. అప్పుడు ఆ మాటలు విని ఇలాంటి ఆయన్ని వదులకుంటే నేను నష్టపోవాల్సి వస్తుందనుకున్నాను.

ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించేవారు
నాతో ప్రేమాయణం నడిపే సమయంలో మా ఆయన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించేవారు. నువ్వు తప్ప ఇంకెవ్వరినీ నా భార్యగా ఊహించుకోలేనంటూ ఏవేవో కథలు చెప్పాడు. అవన్నీ నమ్మాను. నేను కూడా అతన్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదని భావించాను. మొత్తానికి మేమిద్దరం అనుకున్నట్లే మొదట పెద్దలను ఎదురించి, తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.

సంసారం స్వర్గంలా ఉంటుందనుకున్నాను
పెళ్లి అయిన దగ్గరి నుంచి మా సంసారం అంతా స్వర్గంలా ఉంటుందనుకున్నాను. అయితే కొన్ని రోజులకే మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఎంత పటిష్టమైనవో తేలిపోయింది. మా జీవితం హరివిల్లులుగా విరుస్తుందని అనుకున్నాం. కానీ మా ఇద్దరి మధ్య రోజూ కొట్లాటలే. రోజూ గొడవలే.

అమ్మాయితో అలా గడపాలని కోరుకుంటారు
మా ఆయనకు నా మీద ఉన్నది నిజమైనా ప్రేమనా? లేకుంటే కేవలం శారీరక ఆకర్షణననా? అనేది నాకు కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది. మా ఆయనకు నాపై శారీరక ఆకర్షణ ఏర్పడటం అనేది సహజం అని నాకు తెలుసు. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే అమ్మాయితో అలా గడపాలని కోరుకుంటాడు కాబట్టి.

ఏవేవో ఊసులు
అయితే మా వివాహానికి ముందు మేమిద్దరం కలుసుకున్నప్పడు ఇద్దరం ఒకరినొకరం పొగుడుకుంటూ ఏవేవో ఊసులు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. ఇద్దరం సరదాగా గడిపేవాళ్లం. కానీ పెళ్లయిన తర్వాత మేమిద్దరం ఒకే ఇంటిలో కలిసి బతుకుతున్నా కూడా మా మధ్య అలాంటి ప్రేమలు ఏవీ కనిపించవు.

లైంగిక జీవితంపై కూడా ప్రభావం
చిన్నచిన్న విషయాలకే మేమిద్దరం రోజూ తగదా పడుతుంటాం. ఈ తగదాలు మా వైవాహిక జీవితంపైనే కాదు మా లైంగిక జీవితంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచం మొత్తం నాశనమైపోయినా కూడా మన ప్రేమ మాత్రం అంతరించదని ఏవేవో కబుర్లు చెప్పిన మా ఆయన ఇప్పుడు మాత్రం చీటికిమాటికి తగాద పడుతుంటాడు.

నేను అలిగితే.. చిట్టీ.. బంగారం అంటూ
ఇప్పుడు మా ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదు. మేమిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మాట తను నన్ను అంటే తర్వాత మళ్లీ క్షమాపణ చెప్పేవాడు. నేను అలిగితే.. చిట్టీ.. బంగారం అంటూ అడుక్కునేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అంతా రివర్స్. భార్యాభర్తల మధ్య ప్రేమ అన్నది చచ్చే వరకు ఉండాలి. కట్టె కాలే వరకు ఇద్దరికీ ఒకరంటే ఒకరికీ చచ్చేంత ప్రేమ ఉండాలి.

దీన్ని ఎలా చూసుకున్నా పడి ఉంటుందిలే
కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి ప్రేమలు లేవు.
ఒక అమ్మాయిని లవర్ గా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటామో అలాగే అదే అమ్మాయి భార్యగా వస్తే కూడా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి. అంతేకానీ పెళ్లయ్యాక దీన్ని ఎలా చూసుకున్నా పడి ఉంటుందిలే అనుకోకూడదు.

మానసికంగా వేధిస్తున్నారు
నమ్మి వచ్చిన అమ్మాయికి ఇలా నమ్మకం ద్రోహం చేయకూడదు. నా భర్తే కాదు.. సమాజంలో చాలా మంది అబ్బాయిలు వారిని నమ్మి వచ్చిన అమ్మాయిలను ఇలాగే మానసికంగా వేధిస్తున్నారు. కేవలం పడక సుఖం కోసమే ఉపయోగించుకోవొద్దు. అప్పడప్పుడు తనను ప్రేమగా పలకరించి ప్రేమను కూడా కురిపించడం మగాళ్లు నేర్చుకోవాలి. ఇప్పటికీ మా ఆయనంటే నాకు చాలా ప్రేమ కానీ ఆయన చేసే పనులు చూస్తే నాకు తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరచబుద్ది కాదు.



Click it and Unblock the Notifications