Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట.
భారతీయ మహిళలు అవిశ్వాసం గురించి ఓపెన్ మైండ్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రొమాంటిక్ విషయంలో తమ నిజ జీవిత వ్యవహారానికి ఇబ్బంది కలిగించని వ్యక్తులతో కొత్త ప్రేమకథను ప్రారంభిస్తారట.
మన భారతదేశంలో కళ్యాణం వంటి కమనీయమైన ఘట్టం ముగించుకుని... కలకాలం కలిసి జీవించేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే అలాంటి వివాహ వ్యవస్థలో ప్రస్తుతం విపరీతమైన మార్పులొచ్చేశాయి. కలకాలం కలిసి ఉండటానికి బదులు.. బయటి సంబంధాలను కోరుకుంటున్నారు భారతీయులు.

'పొరుగింటి పుల్లకూర రుచి' అన్న చందాన వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత తమ భాగస్వామిని మోసం చేయడంలో మహిళలు ముందజలో ఉండటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలపై గ్లీడెన్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో 55 శాతం మంది మహిళలు భర్తలకు నమ్మకద్రోహం చేసి.. ఇతర సంబంధాలను కోరుకున్నారట.

పెళ్లి అయిన వారిలో చాలా మంది మహిళలు ఒక్కసారైనా తమకు భర్తలను మోసం చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మహిళలు ఇంకా ఎలాంటి విషయాలో వెల్లడించారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు...

ఉద్రేకంలో నిర్ణయాలు..
చాలా మంది మహిళలు ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకుంటున్నారట. వారు తమ భాగస్వామిని మోసం చేసే ముందు దాని గురించి అస్సలు ఆలోచించరట. కేవలం దాని గురించి మాత్రమే కాదు.. తమ పరిస్థితి గురించి కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా అలాంటి సంబంధాలపై అడుగులు వేస్తారట.

ఇద్దరితో ప్రేమలో..
మరో సర్వేలో 48 శాతం మంది ప్రజలు ఒకేసారి ఇద్దరితో ప్రేమలో ఉంటున్నారట. 46 శాతం మంది ప్రేమలో ఉండి కూడా మోసానికి పాల్పడుతున్నారట. మరో ట్విస్ట్ ఏంటంటే తమ భాగస్వామికి ఇతరులతో సంబంధం ఉందని తెలిసినప్పటికీ ఏడు శాతం మంది క్షమించి వదిలేస్తున్నారట.

వివాహేతర సంబంధాలు
ముందుగానే వివాహేతర సంబంధాలు గొడవలైనప్పటికీ.. 69 శాతం మంది రాజీ పడిపోయి.. గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసేసుకుంటున్నారట.

25 నుండి 50 ఏళ్ల వయసు వారు...
ఈ సర్వేలో 25 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారట. వివాహితులు ఎక్కువగా వివాహేతర సంబంధాలకు ఆకర్షితులు అవుతున్నారని ఈ సర్వే సంస్థ బాంబు పేల్చింది. అందులోనూ ఎక్కువగా మహిళలే ఉండటం గమనార్హం.

సిటీలలో..
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూనే, చెన్నై, కోల్ కత్తా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా సాగుతున్నాయట. ఈ నగరాల్లో జీవించే వారు తమ జీవిత భాగస్వాములను చాలా సులభంగా మోసం చేస్తున్నారట.

అతి తక్కువగా విడాకులు..
2017లో భారతదేశానికి చేరుకున్న గ్లీడెన్ సంస్థ ఇప్పటివరకు మన దేశంలో సుమారు ఎనిమిది లక్షల మంది సభ్యులను చేర్చుకుని సర్వే చేపట్టింది. అయితే మన దేశంలో కేవలం ఒక శాతం మంది ప్రజలు మాత్రమే విడాకులు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతి తక్కువ అని వివరించింది. మన దేశంలో ప్రతి 1000 మంది జంటలలో 13 మంది మాత్రమే విడిపోయారట.

90 శాతం వివాహాలు..
భారతదేశంలో ఇప్పటికీ కుటుంబాలే వివాహ నిర్ణయాలను తీసుకుంటున్నాయట. 5 నుండి 10 శాతం మంది జంటలు మాత్రమే ప్రేమ వివాహం చేసుకుంటున్నారట.

ఓపెన్ మైండెడ్...
భారతీయ మహిళలు అవిశ్వాసం గురించి ఓపెన్ మైండ్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రొమాంటిక్ విషయంలో తమ నిజ జీవిత వ్యవహారానికి ఇబ్బంది కలిగించని వ్యక్తులతో కొత్త ప్రేమకథను ప్రారంభిస్తారట. వారితో పూర్తిగా అలాంటి అనుభవాలను పొందుతారట.

మహిళల గోప్యత..
తమ సంస్థ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో మహిళా సభ్యులను ఆకర్షిస్తోందని, ఇది వారికి సెక్యూరీటీ, విచక్షణ మరియు భాగస్వాముల ఎంపికను వారికి సులభం చేస్తుందని గ్లీడెన్ మార్కెటింగ్ డైరెక్టర్ సోలీన్ పైలెట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications
