Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
త్వరలో బుల్లి విరాట్ లేదా చిన్ని అనుష్క రాబోతున్నారు.. స్వయంగా చెప్పిన విరుష్క జంట..!
విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ తమ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో ఓ శుభవార్తను పంచుకున్నారు.
టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల భామ అనుష్కశర్మ ఆగస్టు 27వ తేదీన అభిమానులందరికీ ఓ శుభవార్త చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారే స్వయంగా వెల్లడించారు.'ఇప్పటి నుండి మేం ముగ్గురు కాబోతున్నాం.. 2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు తాను త్వరలో తండ్రి కాబోతున్నాను' అని కోహ్లీ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
అంతేకాదు అనుష్కశర్మ గర్భంతో ఉన్న ఫొటోని కూడా షేర్ చేశాడు. 2017, డిసెంబరు 11వ తేదీన పెళ్లి చేసుకున్న విరుష్క జంట అతి త్వరలో తమకు కొత్త బిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
మరోవైపు మరో క్రికెట్ హార్దిక్ పాండ్యకు ఇటీవలే మగపిల్లాడు జన్మించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ కూడా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు...

జనవరిలో డెలివరీ..
ప్రెగ్నెన్సీతో ఉన్న అనుష్కశర్మ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విరాట్ కోహ్లీ... జనవరి తను డెలివరీ జరగనున్నట్లు ప్రకటించేశాడు. అంటే కరోనా లాక్ డౌన్ సమయంలోనే అంటే మే నెల నుండి విరుష్క జోడి ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచినట్లు తెలుస్తోంది.

పెద్దఎత్తున ట్రోల్స్..
అంతకుముందు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్ పాండ్య.. కేవలం ఐదు నెలల్లోనే మే 31వ తేదీనే తన భార్య గర్భవతి అని ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటపై పెద్దఎత్తున ట్రోల్స్ నడిచాయి.

సైలెంటుగానే విరుష్క..
తాము ఇంకా ఎన్ని రోజులు శుభవార్త కోసం ఎదురుచూడాలని, కోహ్లీ అభిమానులు అడిగినప్పటికీ, విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ మాత్రం సమాధానమివ్వకుండా సైలెంటుగానే ఉండిపోయారు.

ఇటీవలే క్వారంటైన్ పూర్తి..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్ లో ఆడేందుకు ప్రస్తుతం యూఏఈకి వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారమే ఆరు రోజుల క్వారంటైన్ ని పూర్తి చేసుకున్నాడు. గురువారం నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టనుండగా.. ఈసారి ఆర్ సీబికి టైటిల్ ఎలాగైనా అందించాలనే పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.

జనవరి చివరి వారంలో..
సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10వ తేదీ వరకూ జరిగే ఐపీఎల్ టోర్నమెంటులో యూఏఈ నుండి అలాగే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. జనవరి చివరి వారంలో మళ్లీ స్వదేశానికి తిరిగి రానుంది.

డెలివరీ టైములో..
ఈ లెక్కన అనుష్కశర్మ డెలివరీ టైములో విరాట్ కోహ్లీ ఆసీస్ టూరులో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు అప్పట్లో టీమిండియా మాజీ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ కూడా తమ భార్యలు డెలివరీ సమయంలో ఆస్ట్రేలియా టూర్ లోనే ఉండటం గమనార్హం.

శుభాకాంక్షల వెల్లువ..
ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ ఎట్టకేలకు త్వరలో తండ్రి కాబోతున్న టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు..



Click it and Unblock the Notifications

