For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ : వీడియో కాల్ లో వివాహం జరిపించారు... మరి కాపురమెక్కడ చేస్తారో...

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మూల చూసినా కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. కరోనా దెబ్బకు ఎన్నో దేశాలు అతలాకుతలం అయిపోయాయి. మన దేశంలో కూడా కోవిద్-19(కరోనా వైరస్) చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు అనేక మందికి పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుంటున్నారు.

Image Curtosy

వివాహాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కుటుంబం వారు మొత్తం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదనుకున్నారో ఏమో... వీడియో కాలింగ్ లో వివాహానికి వధూవరులిద్దరినీ ఒప్పించేశారు. ఈ సంగతి తెలిసిన వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ విషయం విన్న చాలా మంది వివాహాన్ని అయితే వీడియో కాలింగులో జరిపించారు సరే. మరి కాపురం ఎలా జరిపిస్తారు అని చర్చించుకుంటున్నారు. అయితే వీరు వీడియో కాలింగులో వివాహానికి ఎందుకు ఒప్పుకున్నారు? కేవలం మంచి ముహుర్తం అన్న కారణంగానే ఈ పెళ్లి జరిపించారా? లేదా ఇంకా ఏదైనా కారణాలున్నాయా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మారిషస్ నుండే..

మారిషస్ నుండే..

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు చెందిన వాసి ఖాన్ కుమారుడి పేరు తౌసిఫ్ ఖాన్. నిగోహిలోని మొహల్లా ఈస్ట్ లో నివాసముండే ఇతనికి నాసిమ్ ఖాన్ కుమార్తె పర్వీన్ తో మార్చి 19వ తేదీ వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికొడుకు అయిన తౌసిఫ్ ఖాన్ సివిల్ ఇంజనీర్ గా మారిషస్ లో పని చేస్తుండేవాడు.

ఇంజనీర్ వివాహం..

ఇంజనీర్ వివాహం..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఇంజనీర్ కు ఇటీవలే వివాహం నిశ్చయం అయ్యింది. అయితే తాను మారిషస్ లో ఉండిపోవడం వల్ల అనుకున్న ముహుర్తానికి భారతదేశానికి చేరుకోలేకపోయాడు..

ఎంతో ఉత్సాహంగా...

ఎంతో ఉత్సాహంగా...

అయితే ఈ ఇంజనీర్ వివాహానికి కరోనా వైరస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదనే చెప్పొచ్చు. విదేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయినా... మన దేశంలో జనతా కర్ఫ్యూ ఉన్నా.. ప్రభుత్వం ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినా వీరి వివాహం ఎంతో ఉత్సాహంగా జరిగింది.

అక్కడున్న వారందరికీ..

అక్కడున్న వారందరికీ..

కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో అనే అనుమానంతో, రెండు కుటుంబాల వారు వరుడు లేకపోయినప్పటికీ అన్ని ఆచారాలతో వివాహం జరిపించాలని నిర్ణయిచుకున్నారు. పెళ్లి ముహుర్తానికి వరుడు లేకపోయినా.. వధువు ఇంటికి చేరుకుంది. అప్పటికే చాలా మంది బంధువులు అక్కడికి వచ్చారు. అప్పుడు వారందరికీ వరుడు లేడని తెలిసింది. అయితే వరుడి సోదరుడు, ఇతర బంధువులు వివాహ పనులు, ఆచారాలన్నీ పూర్తి చేశారు.

నిఖా పఠనం..

నిఖా పఠనం..

అప్పుడే వరుడికి వీడియో కాల్ చేశారు. అందులో కాజీ నిఖా యొక్క పఠనం చేశారు. ఆయన రచనలను పూర్తి చేసిన అనంతరం పెళ్లి కుమారుడైన తౌసిఫ్ ఖాన్ నిఖా సాక్ష్యుల ఎదుట పర్వీన్ తో వివాహం తనకు ఇష్టమేనని చెప్పాడు. తన జీవితాన్ని తనతో కలిసి జీవిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయినప్పటికీ, తర్వాత వారిని అభినందించారు.

వీడియో కాలింగులో

వీడియో కాలింగులో

ఈ ఇంజనీర్ తన వివాహం టెక్నాలజీని బాగా వాడుకున్నాడు. వీడియో కాలింగులో వివాహ తంతునంత ముగించేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఆచారాలను అమ్మాయి మరియు అబ్బాయి ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు. వీరి నిఖా వేడుకను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త తెగ వైరల్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా.. వీరు వివాహం అయితే వీడియో కాలింగులో జరిపించేశారు సరే.. మరి కాపురం ఎక్కడ చేయిస్తారో అని కామెంట్లు చేస్తున్నారు.

English summary

corona effect : Groom could not come from mauritus in marriage in up nikha process completed on video call

Here we talking about groom could not come from mauritus in marriage in up nikha process completed on video call. Take a look
Story first published: Monday, March 23, 2020, 17:32 [IST]