For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతి క్రీడలో పాల్గొనడానికి ముందు ఆ పని కచ్చితంగా చేయాల్సిందేనా?

|

పెళ్లి చేసుకున్న ప్రతి జంట లేదా రిలేషన్ షిప్ లో ఉండే కపుల్స్ లో కొందరు ఫోర్ ప్లే కు ఉన్న ప్రాధాన్యతను ఏ మాత్రం పట్టించుకోకుండా నేరుగా భాగస్వామిపై దూకేస్తారు. ఇంకా కొంతమంది కచ్చితంగా ఫోర్ ప్లేని కచ్చితంగా ఫాలో అవుతారు.

మరికొందరు అయితే కేవలం తమ భాగస్వామి కోసమే దీన్ని ఒక ముఖ్యమైన పనిలాగా భావిస్తారు. అయితే కలయికలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శృంగారం తెలుసుకోవడం అనేది అత్యంత అవసరం. ఎందుకంటే దీని గురించి చాలా మందికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు.

శృంగారంలో పాల్గొనే సమయంలో చాలా మంది ఆడవారు సిగ్గుతోనో లేదా భయంతోనో ముడుచుకుని పోతూ ఉంటారు. అయితే మీరు మీ పార్ట్ నర్ మిమ్మల్ని ఎప్పుడైతే పూర్తిగా తాకనిస్తారో అప్పుడే మీరు లైంగిక ఆనందం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.

ఫోర్ ప్లే కూడా శృంగారం లాగానే.. దీని గురించి పూర్తిగా చెప్పాలంటే కలయికలో పాల్గొనడం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇందులో ఆస్వాదించొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఫోర్ ప్లేకి చాలా ప్రాముఖ్యత ఉందని, దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శృంగారం మరియు ఫోర్ ప్లే గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...నాకు మరిదిపై మోజు పెరుగుతోంది... నా భర్తపై ఆసక్తి తగ్గుతోంది.. నేనేం చేయాలి...

ఫ్యాంటసీలు ఉండటం..

ఫ్యాంటసీలు ఉండటం..

పడకగదిలో ఉండే ప్రతి ఒక్క జంటకూ శృంగారం విషయంలో ఏవేవో ఫ్యాంటసీలు ఉండటం అనేది అత్యంత సహజం. ఉదాహరణకు కొందరికి శృంగారంలో పాల్గొనే సమయంలో ఆ విషయాల గురించి మాట్లాడితే బాగా ఇష్టం. ఇంకొందరికి కొన్ని ప్రత్యేకమైన యాంగిల్స్ లో పాల్గొనాలంటే ఇష్టం. అలా మీకు కూడా ఏమైనా ఫ్యాంటసీలు ఉంటే మీ పార్ట్ నర్ తో ఎలాంటి మోహమాటం లేకుండా ముచ్చటించండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, మీరిద్దరూ అంతులేని ఆనందాన్ని ఆస్వాదించొచ్చు.

గట్టిగా కౌగిలించుకోవడం..

గట్టిగా కౌగిలించుకోవడం..

శృంగారంలో పాల్గొనడానికి ముందు చాలా మంది తమ భాగస్వామి తమను గట్టిగా కౌగిలించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే మీరు మీ భాగస్వామిని దగ్గరగా లాక్కొని గట్టిగా కౌగిలించుకోవడం వంటివి చేయండి. మీ భాగస్వామి నడుము చుట్టూ మీ చేతులను వేసి బిగి కౌగిలిలో కాస్త ఎక్కువ సమయం వారిని బంధించేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీ భాగస్వామి పొందుతున్న ఆనందాన్ని చూడండి. ఇవన్నీ ఫోర్ ప్లేలో చాలా ముఖ్యమని గుర్తించాలి.

సున్నిత భాగాలను..

సున్నిత భాగాలను..

కలయికలో పాల్గొనడానికి ముందు మీరు ఫోర్ ప్లే ప్రారంభించిన తర్వాత, మీ భాగస్వామి యొక్క సున్నిత భాగాలను తాకడం వంటివి మరచిపోవద్దు. ముఖ్యంగా చెవులు, మెడ వెనుక కిస్ చేయడం. చెవుల వద్ద కిస్ పెట్టేటప్పుడు మీరు చేసిన లేదా చేయాలనుకున్న రొమాంటిక్ పనుల గురించి చిన్నగా ఊసులు చెప్పడం వంటివి చేయొచ్చు. ఇవి మీ భాగస్వామిలో కోరికను మరింత రగిలించడమే కాదు.. కలయిక పట్ల మీకు ఎంత ఆసక్తి ఉందో వారికి తెలియజేస్తాయి.

వామ్మో! ఎనిమిదేళ్ల కాపురం తర్వాత ఆమె అతడని తేలింది..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...వామ్మో! ఎనిమిదేళ్ల కాపురం తర్వాత ఆమె అతడని తేలింది..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...

స్వార్థంతో కూడుకున్నది..

స్వార్థంతో కూడుకున్నది..

శృంగారం అనే అంశం ఎక్కువగా స్వార్థంతో కూడుకున్న విషయం. అది ఒక ప్రత్యేకమైన కళ అని చెప్పొచ్చు. కానీ ఫోర్ ప్లే మాత్రం అలా కాదు. అందులో మీ భాగస్వామిని ఆ కార్యం పట్ల ఇష్టపడేందుకు, మీరు వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది. అంతేకాదు మీ ఫోకస్ అంతా మీ భాగస్వామిపైనే ఉంటుందని భావిస్తారు. అప్పుడు మీ ఇద్దరి కోరికలు తీరుతాయి.

భావప్రాప్తిని మించిన ఆనందం..

భావప్రాప్తిని మించిన ఆనందం..

ఫోర్ ప్లేలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు నోరూ, నాలుకా, చేతి వేళ్లు చేసే మ్యాజిక్ తో భావప్రాప్తిని మించిన ఆనందాన్ని దశల వారీగా మీ శరీరం అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేం. అయితే ఇదంతా నేరుగా కలయికలో పాల్గొంటే మాత్రం ఇదంతా సాధ్యపడదు. గర్భం వస్తుందేమో అన్న భయం కూడా ఇందులో ఉండదు.

ఎవరికీ ఇబ్బంది ఉండదు..

ఎవరికీ ఇబ్బంది ఉండదు..

శృంగారంలో పాల్గొన్నప్పుడు కొన్నిసార్లు ఆడవారికి, మరికొన్నిసార్లు మగవారికి కొన్ని సున్నితమైన భాగాల్లో బాగా నొప్పిగా ఉంటుంది. అయితే కలయికలో కాకుండా, ఫోర్ ప్లేలో కేవలం ఆనందం.. సుఖం.. సంతోషం మాత్రమే ఉంటాయి. ఇది చాలా స్మూత్ గా జరిగిపోతుంది. దీని వల్ల ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!

ధైర్యాన్ని ఇస్తుంది..

ధైర్యాన్ని ఇస్తుంది..

శృంగారంలో పాల్గొనడానికి ముందు కొన్నిసార్లు మన సైజు ఆ కార్యానికి సెట్ అవుతుందో లేదో అని కొందరు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు అభద్రతా భావానికి లోనవుతుంటారు. అయితే ఫోర్ ప్లేలో పాల్గొనే వారికి ఇలాంటి సమ్యలేమీ ఉండవు. ఇందులో కేవలం మీ ఆలోచనా విధానం ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. అంతేకాదు ఇది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది.

శృంగారం ఎప్పుడంటే..

శృంగారం ఎప్పుడంటే..

శృంగారానికి ముందు చాలా మందికి ఎన్నో రకాల అనుమానాలు, అపొహలు ఉంటాయి. అయితే ఇలాంటివాటిని ఒక్కదెబ్బతో పోగొట్టే ఏకైక ఆయుధం ఫోర్ ప్లే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇది భాగస్వాములిద్దరినీ ఏ విధమైన ఇబ్బందీ పెట్టదు. అంతేకాదు దీని వల్ల ఒత్తిడి తగ్గి.. కలయికలో పాల్గొనేందుకు మీ ఇద్దరికీ ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని పెంచుతుంది. ఇది మీ రతి కార్యానికి శుభప్రదమైన అడుగు అని చెప్పొచ్చు. అందుకే కలయికలో పాల్గొనడానికి ముందు కచ్చితంగా ఫోర్ ప్లే చేస్తే ఎంతో బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫోర్ ప్లే మనసుకు, శరీరానికి ఇచ్చే ఆనందంతో పాటు శృంగారంలో పాల్గొనేందుకు మాంచి మూడ్ తెప్పిస్తుంది. చూశారు కదా.. ఫోర్ ప్లే, శృంగారంలో ఏది బెటరో.. మీరు కూడా కలయికలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లేను ట్రై చెయ్యండి...

మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి. మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి.. షేర్ చేయండి...

English summary

Experts Tips : Foreplay or Sex, which one is better?

Here we talking about expert tips : foreplay or sex, which one is better? Read on