Just In
Don't Miss
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Movies
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పెళ్లికి ముందే మీ భాగస్వామి గురించి అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలేంటో తెలుసా..
ప్రస్తుతం మన దేశంలో ఏ మతం వారు అయినా.. ఏ కులం అయినా ఇప్పటికీ పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు వివాహం సమాజంలో దీన్ని ఒక పెద్ద ఆచారంగా పరిగణిస్తారు. పెళ్లి అంటే ఏడు అడుగులు.. నాలుగు అక్షింతలు.. పెద్దల దీవెనలు.. అప్పగింతలు.. ఇవి మాత్రమే కాదు. ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. తాంబూలం దగ్గర నుంచి పెళ్లి పీటల మీద వధువు మెడలో వరుడు తాళి కట్టే వరకు అనేక తంతులు జరపాల్సి ఉంటుంది. కట్నాలు, కానుకలు, వంటా వార్పు వగైరా ఎన్నో ఉంటాయి.
అయితే ఇవన్నీ ఒకప్పుడు. పెళ్లి చేసుకోవాలని ఎవరైనా నిర్ణయించుకుంటే ఇద్దరు వ్యక్తులు తమ గురించి ఒకరినొకరు ముందుగా పూర్తిగా తెలుసుకోవాలి. వారి అలవాట్లు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకోవాలి. ఇవన్నీ ఇద్దరికి ఇష్టమైతే అప్పుడే వివాహం చేసుకునేందుకు సిద్ధం కావచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఎలాంటి వివాదం ఉండదు. ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే భాగస్వామిని ఎలాంటి ప్రశ్నలు అడగాలని కింద ఉన్న జాబితాను చూసి మీరే తెలుసుకోండి.. వీటి వల్ల మీ వివాహానికి సంబంధించి మీరు ఒక కచ్చితమైన, స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి గురించి ప్రాథమికంగా తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

పెళ్లి గురించి మీపై ఒత్తిడి ఉందా?
ప్రస్తుత సమాజంలో పెళ్లి గురంచి చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కొంతమంది వయసు పైబడుతున్న కారణంగా లేదా ఇతర కారణాల వల్ల అబ్బాయి లేదా అమ్మాయిపై వివాహం గురించి ఒత్తిడి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో జీవితకాలం ప్రయాణించగలరా అని అడగండి. అలాగే ఈ వివాహానికి మీపై ఎలాంటి ఒత్తిడి లేదు కదా అని కూడా అడగండి. లేదా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే మీరు వివాహం చేసుకుంటున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకోండి.

పెళ్లి తర్వాత ఉద్యోగం చేయొచ్చా?
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేయొచ్చా? ఎందుకంటే మీ భవిష్యత్ ప్రణాళికల కోసం అని చెప్పండి. మీరు మీ పెళ్లి తర్వాత ఇంటిని పూర్తిగా చూసుకోవాలనుకుంటున్నారా? లేదా మీరు మీ ఉద్యోాగాన్ని కొనసాగించాలనుకుంటున్నారా? అలాగే మీరు చేసుకునే భాగస్వామ్యులు మీ ఉద్యోగం విషయంలో అనుకూలంగా ఉన్నారా? మీ కెరీర్ గురించి మీకు భరోసా ఇస్తున్నారా? పెళ్లి తర్వాత వారు మీకు పూర్తిగా కో ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ముఖ్యమైన ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి. దీని వల్ల వివాహం తర్వాత ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు.

కలయిక గురించి మీ అభిప్రాయం ఏమిటి?
వివాహానికి ముందే ఈ ఇలాంటి విషయాలు కచ్చితంగా అడగాలి. ఈరోజుల్లో పెళ్లి అంటే ముఖ్యమైన సంఘటన ఇదే. ఎందుకంటే ఇంతకుముందు కలయిక గురించి రహస్యంగా ఉంచేవారు. దానిపై మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు శారీరక సంబంధాల గురించి నేరుగా అడుగుతున్నారు. పెళ్లికి ముందే శృంగారం గురించి భాగస్వాముల అభిప్రాయాలను అడుగుతున్నారు. కాబట్టి మీరు శారీరక సంబంధాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? అనే ప్రశ్నలను తప్పకుండా అడగాలి.

విభిన్న విషయాలపై మీరేమంటారు?
మీరు ఒక వ్యక్తితో కలిసి జీవితాంతం ప్రయాణించాలనుకుంటే వారి గురించి విభిన్న విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ భాగస్వామి గురించి వివాహానికి ముందే ఎంత సమాచారాన్ని సేకరిస్తే అది అంతలా మీకు పెళ్లి తర్వాత ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీ భాగస్వామి అలవాట్లు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకోవాలి. మీరు సెలవు రోజుల్లో ఎలా గడపడానికి ఇష్టపడతారు. మీరు తిరగడానికి ఇష్టపడతారా? మీరు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు? ఇలాంటి చిన్న ప్రశ్నల ద్వారా వచ్చే సమాధానాలను బట్టి మీరు వివాహ బంధాన్ని కలుపుకోవచ్చా లేదా అనేందుకు బాగా తోడ్పడతాయి.

కుటుంబ నియంత్రణ గురించి మీ అభిప్రాయం?
మీరు మీకు కాబోయే భాగస్వామితో పై ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నలు చాలా చాలా ముఖ్యం. మీ భాగస్వామి వివాహం తర్వాత వారు వృత్తిపై దృష్టి పెట్టాలనుకుంటున్నారా, ఒకరికొకరు సమయం ఇవ్వాలనుకుంటున్నారా? పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు మీ భాగస్వామిని తెలుసుకోవాలి. వివాహం తర్వాత చాలా మంది హనీమూన్ వెళ్లాలని కోరుకుంటారు.
ఇలాంటి వివరాలన్నీ ప్రశ్నలన్నింటిని అడిగి, అందుకు మీకు కాబోయే భాగస్వామి ఇచ్చే సమాధానాల్ని బట్టి వివాహం గురించి మీరు ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి.
పెళ్లికి సంబంధించిన ఈ ప్రశ్నలు మీకు మీకు నచ్చినట్లయితే బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.