For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కులాంతర కళ్యాణం చేసుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయని తెలుసా...!

కులాంతర వివాహం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు మరియు ప్రతికూలతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఒకప్పుడు ఏ కులంలో పుట్టిన వారు ఆ కులం వారినే వివాహం చేసుకునే వారు. అది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని నమ్మేవాళ్లు. అయితే ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి.

Intercaste marriage benefits and problems in telugu

ఈ నేపథ్యంలోనే కులాంతర వివాహాలు.. ఇతర మతస్తులతో కలిసి వివాహాలకు కొందరు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని ఇప్పటి యువత ఎక్కువగా నమ్ముతున్నారు.

Intercaste marriage benefits and problems in telugu

ప్రేమ వివాహం ద్వారా మన గురించి వారు.. వారి గురించి మనం పూర్తిగా తెలుసుకుని జీవితాన్ని హాయిగా కొనసాగించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు కులం, మతం ఏ మాత్రం అడ్డు కాదని.. పాత కాలపు సంప్రదాయాలు పక్కనబెట్టేస్తున్నారు.

Intercaste marriage benefits and problems in telugu
ప్రేమ పెళ్లిళ్లలో తమ భాగస్వామిలో ఏయే లోపాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవచ్చని.. వాటి వల్ల మనం ఎలా సర్దుకుపోవాలో తెలుస్తుందని కొందరు జంటలు చెబుతున్నారు. అందుకే ప్రేమ వివాహం.. అందులోనూ కులాంతర వివాహం ఇంకా బాగుంటుందని చెబుతున్నారు. అంతేకాదు కులాంతర వివాహం చేసుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. అందుకు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రేమ పెళ్లితో..

ప్రేమ పెళ్లితో..

ఒక వ్యక్తితో కలిసి జీవించాలనుకునే ఇద్దరు వ్యక్తులు మాత్రమే తీసుకునే నిర్ణయానికి వారధి లాంటి పెళ్లి అనే బంధం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయమే అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ప్రేమ కారణంగా.. తమ జీవితంలో కొన్ని కష్టసుఖాలను ఇద్దరూ కలిసి పాలు పంచుకుంటున్నారు. మరి, జీవితాన్ని పంచుకునే విషయంలో ఇంకొకరి నిర్ణయంతో ఎలాంటి అవసరమూ ఉండదు.

ఎంతో శ్రమిస్తున్నారు..

ఎంతో శ్రమిస్తున్నారు..

ఈ తరం యువత ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం హాయిగా గడిపేందుకు ఎంతో పోరాడుతున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులతో ఇతర కుటుంబసభ్యులతో సరదాగా పోట్లాడుకుంటూ బాగానే శ్రమిస్తున్నారు. అయితే ఎప్పుడైతే మూడు ముళ్లు పడే సమయం వచ్చిందో.. మనసనులో ఏదో తెలియని ఎమోషన్. ఏదో సాధించామన్న సంతోషం. జీవితంలో ఒక దశ నుండి మరో దశలోకి అడుగుపెట్టిన్టటు భావిస్తున్నారు. ఇలాంటి మధురమైన క్షణం తమ జీవితంలో మళ్లీ మళ్లీ రాదని ఫీలవుతున్నారు.

తెలుసుకోవాల్సినవి ఎన్నో..

తెలుసుకోవాల్సినవి ఎన్నో..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. జీవితాన్ని ప్రారంభిస్తే.. ఆ తర్వాత తన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ గా లేదా ప్రేమికుడి/ప్రేమికురాలిగా ఉన్నప్పుడు అన్ని విషయాలను అందరూ షేర్ చేసుకోరు. ఏవైనా కొన్ని రహస్యాలను దాచిపెడతారు. అయితే పెళ్లి తర్వాత అన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి రహస్యాలు ఉండకపోవచ్చు.

చిన్నిచిన్న గొడవలు..

చిన్నిచిన్న గొడవలు..

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనే కాదు.. ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కూడా భాగస్వామితో అప్పుడప్పుడు సరదాగా చిన్ని చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ముందు అవి టీ కప్పులో తుఫానులా మారిపోతాయి. అంతేకాదు తమ కుటుంబసభ్యులతో కలిసిపోయేందుకు తమ భాగస్వాములు ఎంతగానో సహకరిస్తారు.

పరిణితి చెందిన వారైతే..

పరిణితి చెందిన వారైతే..

అయితే పరిణితి చెందిన పెద్దలైతే.. వారు ఏరికోరి ఎంపిక సంబంధమైనా... ప్రేమ వివాహమైనా.. కులాంతర వివాహమైనా అందుకు స్వాగతిస్తారు. అంతేకాదు అందరి సమక్షంలో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత ఏదైనా సమస్య వస్తే.. వారు పరిష్కరించేందుకు ముందుకొస్తారు. పెళ్లి తర్వాత పద్ధతులు, సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాల గురించి వారే అన్ని వివరంగా తెలియజేస్తారు.

ఎల్లవేళలా ప్రోత్సాహం..

ఎల్లవేళలా ప్రోత్సాహం..

ప్రేమ పెళ్లి లేదా కులాంతర వివాహం చేసుకుంటే.. మనకున్న లక్ష్యాలు, భవిష్యత్తు గురించి ఉన్న నిర్దిష్టమైన అభిప్రాయాలు భాగస్వామికి బాగా తెలుస్తాయి. అందుకే మనం చేసే పనిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని.. ప్రోత్సహిస్తూనే ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎలాంటి బాధ్యత అయినా.. సమస్య అయినా కలిసే షేర్ చేసుకుంటాం..

అద్భుతంగా ఉంటుంది..

అద్భుతంగా ఉంటుంది..

ప్రేమ పెళ్లిళ్లలో అప్పుడప్పుడు కొట్లాడుకున్నప్పటికీ.. గతంలో చేసిన పొరపాట్ల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడినప్పటికీ ఈ బంధం అంతే ప్రేమగా కొనసాగుతుంది. ఇలా ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవితం పంచుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

ప్రభుత్వాల ప్రోత్సాహాకాలు..

ప్రభుత్వాల ప్రోత్సాహాకాలు..

కులాంతర వివాహాలు చేసుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగానే ప్రోత్సాహాకాలు ఇస్తున్నాయి. దీంతో ఇలా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వమైతే అదనంగా 50 వేల రూపాయలను ఇవనున్నట్లు ప్రకటించింది. కేంద్రం కూడా దాదాపు రూ.2.50 లక్షలు ఇస్తోంది.

పెద్దల కుదర్చిన పెళ్లిలో..

పెద్దల కుదర్చిన పెళ్లిలో..

తల్లిదండ్రులు లేదా కుటుంబసభ్యులు కుదిర్చిన పెళ్లి విషయంలో కెరీర్, ఆశయాలు, ఆలోచనలు, విద్య తదితర విషయాలన్నింటిలో తమకు తగిన భాగస్వామి దొరుకుతారా? ఒకవేళ అలాంటి వారిని ఎంపిక చేసినప్పటికీ.. అప్పటిదాకా కనీసం ముఖ పరిచయం కూడా లేని వారితో ఎలా కలిసేది.. మాట్లాడేది.. అని తెగ మదనపడిపోతున్నారు.

అసంభవం..

అసంభవం..

పెద్దలు చెప్పారని.. వారు చెప్పిన వ్యక్తిని చేసుకోమని ఒప్పించడంతో కొందరు ధైర్యం చేసి ముందడుగు వేస్తున్నారు. ముందుగా తమకు కాబోయే భాగస్వామిని వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుతున్నారు. అయితే అలా తొలిసారి ముచ్చటించినప్పుడు తన గురించి మొత్తం అంచనా వేయడం అంసభవంగా అనిపిస్తోంది. ఆ సమయంలో వారు ఏ లోపాలు లేనట్టు యాక్టింగ్ చేస్తే.. పెళ్లి ఆటోమేటిక్ గా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత అసలు నిజం బయటపడితే.. అప్పుడు దాని ప్రతికూల ఫలితాలను జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది.

చాలా టెన్షన్..

చాలా టెన్షన్..

అదే బంధువులు లేదా ఒకే కులం వారని చెప్పి.. పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ జీవితంలో అది ఒక అతి పెద్ద నిర్ణయం అని చాలా టెన్షన్ పడతారు. అయితే కేవలం తల్లిదండ్రులపై నమ్మకంతో అప్పటికీ ఒకే అనుకున్నప్పటికీ.. ముఖ్యంగా పెళ్లియిన రోజు నుండే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే అప్పటివరకు తనకు తెలియని వ్యక్తితో.. పరిచయం లేని వ్యక్తితో.. మనం కలిసి జీవించాలి.. బెడ్ పంచుకోవాలి.. అనే విషయాలు మిమ్మల్ని చాలా కలవరపెడతాయి...

అత్తమామల జోక్యం..

అత్తమామల జోక్యం..

అదే ప్రేమ పెళ్లి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే.. తమకు తాము నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ, అధికారం అస్సలు ఉండదు. ప్రతి చిన్న విషయానికీ పెద్దలను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్తమామల జోక్యం అన్ని విషయాల్లో ఉంటుంది. అలాంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి.

ఎలా పెళ్లి చేసుకున్నా..

ఎలా పెళ్లి చేసుకున్నా..

ఎవరు ఎలాంటి పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎంతకాలం నిలిచి ఉంటుందనేది కేవలం భార్యాభర్తలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వారి మధ్య ఉన్న నమ్మకం, పరస్పరం కురిపించుకునే ప్రేమానురాగాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవితాన్ని పంచుకోడానికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటే అది కులాంతర వివాహమైనా.. ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా జీవితం అద్భుతంగా ఉంటుందని మనం గ్రహించాలి.

English summary

Inter-caste marriage benefits and problems in telugu

Here we talking about the intercaste marriage benefits and problems in telugu. Read on
Desktop Bottom Promotion