Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కపుల్స్ కు గొప్ప వరంగా మారిన కరోనా లాక్ డౌన్..! వాటిని విపరీతంగా వాడేస్తున్నారట...!
మన దేశంలో కూడా కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ లోకి వచ్చింది.
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్ర దేశాలలో ప్రజలను బయటికి రానివ్వటం లేదు.

అయినా కూడా ఆ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ వందలాది మంది చనిపోతున్నారు. వేలాది కేసులు పాజిటివ్ గా వస్తున్నాయి. అయితే మన దేశంలో కూడా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే మన దేశంలో దాదాపు 13 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. సుమారు 400 మంది మరణించారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారుతోంది. మర్కజ్ మసీద్ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసులు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. దీని వల్ల లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.

దీని వల్ల చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇలా ఇంట్లో ఉండటాన్ని చాలా మందికి ఇబ్బందిగా మారుతోంది. కానీ కొందరు మాత్రం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అయితే కరోనా వల్ల ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారా? అంటే అది కేవలం కపుల్సే అని చెప్పొచ్చు. కరోనా వైరస్ చాలా మంది జంటలకు వరంగా మారింది.

ఈ లాక్ డౌన్ సమయాన్ని అంతా కపుల్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కపుల్స్ ఎక్కువగా పడకగదిలోనే గడిపేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారట. ఇందుకు నిదర్శనమే తాజాగా కండోమ్స్ తో పాటు, ఐ-పిల్స్ (గర్భ నిరోధక మాత్రలు) అమ్మకాలు విపరీతంగా పెరగడం. ఈ విషయాలన్నీ డుంజో యాప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ టాపిక్ ప్రస్తుతం వైరల్ మారిపోయింది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలిపింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

భారత నగరాలలో..
మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మెడికల్ షాపులు, ఆస్పత్రులు, అత్యవసర సర్వీసులు, నిత్యావసర దుకాణాలు మినహా అన్నింటినీ మూసేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో అనేక నగరాల్లో పలు డోర్ డెలివరీ యాప్ లు బాగా పాపులర్ అయ్యాయి. అవి ఆహారం, మందులతో పాటు నిత్యావసర సరుకులను కూడా తమ బాయ్స్ తో డోర్ డెలివరీ చేస్తున్నాయి.

పాపులర్ అయిన ‘డుంజో‘(Dunzo)
అయితే వీటన్నింటినితో పాటు కిరాణ సామాగ్రి నుండి ఆహారం వరకు అన్నింటినీ అతి తక్కువ సమయంలోనే డోర్ డెలివరీ చేసి పెట్టే యాప్ గా ‘డుంజో‘ యాప్ బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో బాగా పాపులర్ అయ్యింది.

హైదరాబాదీలే టాప్..
ఈ సందర్భంగా డుంజో యాప్ ఏయే నగరాల్లో ఏయే వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారో అనే విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అందులో మన హైదరాబాదీలు టాప్ ప్లేసులో నిలిచారట.

షాకింగ్ ఫ్యాక్ట్..
మన హైదరాబాదీలు ఎక్కువగా ఐ-పిల్స్(గర్భ నిరోధక మాత్రలను) విచ్చలవిడిగా వాడేశారని షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పేసింది. లాక్ డౌన్ ను మరి కొన్ని రోజులు పొడిగించడంతో జనాలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే కపుల్స్ చాలా గొప్ప వరంగా మారిందని చెప్పింది. అంతేకాదు వారికి కావాల్సినంత ఏకాంత సమయం కూడా దొరికినట్లు అయ్యింది.

విపరీతంగా సేల్స్ పెరగడమే..
మన హైదరాబాదీలు ఎక్కువగా ఐ-పిల్స్ ఆర్డర్ చేస్తే, ముంబై, పూనే వాసులు మాత్రం కండోమ్స్ ఎక్కువగా ఆర్డర్ చేశారట. దీంతో ఇక్కడ విపరీతంగా సేల్స్ పెరిగిపోయాయని ఆ కంపెనీల ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు ఇక బెంగళూరులో ప్రెగ్నన్సీ కిట్స్, ఐ పిల్స్ తెగ వాడేశారని ఆ యాప్ తెలిపింది.

తర్వాతి స్థానాల్లో..
కండోమ్స్, ఐ-పిల్స్ తర్వాతి స్థానాల్లో హ్యాండ్ వాష్, శానిటైజర్లను జైపూర్, చెన్నైవాసులు ఎక్కువగా ఆర్డర్ చేశారట. వీరంతా కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు శుభ్రతే ప్రధానమని గుర్తించినట్టున్నారు అని ప్రకటించింది.



Click it and Unblock the Notifications