For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ని పెగ్గులేస్తే.. రొమాన్స్ లో రెచ్చిపోవచ్చో తెలుసా...! ఆ మజానే వేరంటున్న కపుల్స్...!

|

మామూలుగా అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అందరూ చెబుతూ ఉంటారు. అయితే అదే మద్యాన్ని పరిమితిలో తీసుకుంటే పడకగదిలో మీ భాగస్వామితో శృంగారంలో రెచ్చిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మద్యం విషయం ఒక్కటే కాదు.. ఏదైనా మితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని.. మోతాదుకు మించి తీసుకుంటేనే సమస్యలొస్తాయని చెబుతున్నారు. ఇదే ఫార్ములా బెడ్ రూమ్ లోనూ పని చేస్తుందట.

అయితే మద్యం తాగే అలవాటు ఉన్నవారు.. ఎన్ని పెగ్గులేస్తే శృంగారంలో కీలు గుర్రంలా రెచ్చిపోవచ్చు.. మీ భాగస్వామిని ఎంత బాగా సుఖపెట్టొచ్చు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరు పురుషులు ఆ విషయంలో తాము వీక్ అని ఎందుకు ఫీలవుతుంటారు?

ఎన్ని పెగ్గులేస్తే..

ఎన్ని పెగ్గులేస్తే..

మద్యం తాగే అలవాటు ఉన్న వారు, శృంగారంలో పాల్గొనడానికి ముందు రెండంటే రెండు పెగ్గులేని కలయికలో పాల్గొంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యం అతిగా తాగి కలయికలో పాల్గొంటే అనుకూలత కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే మద్యాన్ని పరిమితికి మించి తాగకుండా అందులో పాల్గొంటే.. అందులో వచ్చే మజానే వేరని అంటున్నారు విశ్లేషకులు. ఈ అలవాటు మెట్రో నగరాల్లోనే కాకుండా ఇప్పుడు పట్టణాలలో కూడా ఈ కల్చర్ మొదలైందట.

మగాళ్లు మాత్రమే కాదు...!

మగాళ్లు మాత్రమే కాదు...!

అయితే పెగ్గులు అనగానే మగవారు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్టే..ఎందుకంటే పెగ్గులను ఆడవారు కూడా వేస్తున్నారు. మహిళలు కూడా రెండు పెగ్గులేసి పడకగదిలో మంచమెక్కితే అందులో వచ్చే కిక్కే వేరంట..! అదే మత్తులో కలయికలో పాల్గొంటే.. కేవలం దాని మీదో ఫోకస్ ఉంటుందట.. ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరట.

అవి అడ్డుకావు..

అవి అడ్డుకావు..

మనుషులలో ఆడవారైనా.. మగవారైనా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. అయితే వీరు మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఆకారాలు అనేవి ఆకర్షణకు అడ్డు కావని, కేవలం రొమాన్స్ పైన మాత్రమే వీరి ఫోకస్ ఉంటుదట.

రానా-మిహీకా వెడ్డింగ్: సెలబ్రెటీలకు పెళ్లిలో ఉన్న ఫీలింగ్ వచ్చేందుకు ఏ టెక్నాలజీ వాడారో తెలుసా...

మితంగా తీసుకుంటే..

మితంగా తీసుకుంటే..

అందుకేనేమో ఈ మధ్య నగరాలు, మెట్రో నగరాల్లో సైతం మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్యం కోసం ఎగబడుతున్నారు. కరోనా వంటి లాక్ డౌన్ కాలంలో కూడా మద్యం కోసం క్యూలైన్లలో నిలబడుతున్నారు. అయితే ఇది మితంగా తీసుకుంటేనే మంచిది. అయితే మద్యం ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అసలుకే ఎసరు..

అసలుకే ఎసరు..

అయితే మద్యం మంచిదే కదా అని.. ఫుల్లుగా తాగేసీ రొమాన్స్ చేయాలని చూస్తే మాత్రం అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎక్కువ మద్యం తాగి కలయికలో పాల్గొంటే అంగస్తంభన వంటి సమస్యలు ఎదురవుతాయట. సో బీ కేర్ ఫుల్.

గుండెకు ప్రమాదమట..

గుండెకు ప్రమాదమట..

అయితే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పెగ్గులు తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుందట. అదేవిధంగా రోజుకు నాలుగు పెగ్గులు తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు సుమారు 35 శాతం వరకు పెరుగుతుందట.

ఈ చిట్కాలను ఫాలో అయితే మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ ను కనిపెట్టడం చాలా ఈజీ...!

ఓ అధ్యయనం ప్రకారం..

ఓ అధ్యయనం ప్రకారం..

ఓ అధ్యయనం ప్రకారం, ఒక పెగ్గు, ఒక బీరు, చిన్న గ్లాసులోని వైన్ దాదాపు ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయని తేలిందట. ఈ మూడు రకాల ఆల్కహాల్ ను పరిశోధనకులు పరిగణనలోకి తీసుకున్నారట.

38 శాతం గుండెపోటు ముప్పు..

38 శాతం గుండెపోటు ముప్పు..

కేం బ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్ హాల్టర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, తాము చేసిన అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే, గుండె పోటు ముప్పు 38 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు.

మరిన్ని పరిశోధనలు..

మరిన్ని పరిశోధనలు..

అదే సమయంలో, స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ, గుండె పోటు ముప్పు తగ్గుతుందనే దాఖలాలేవీ లేవని ఆ అధ్యయనంలో స్పష్టం అయినట్లు వారు చెప్పారు. గుండెపోటుకు సంబంధించి మద్యం ప్రభావాలపై పూర్తి స్పష్టత ఇంకా రాలేదని, దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే, రానున్న రోజుల్లో మరింత సమాచారాన్ని సేకరించాలని చెప్పారు.

English summary

Reasons for the increase in romance abstinence after alcohol consumption

Here are reasons for the increase in romance abstinence after alcohol consumption. Take a look.
Story first published: Thursday, August 13, 2020, 16:00 [IST]