Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
‘ఆ’కార్యం పట్ల ఆసక్తి తగ్గుతోందా... అలా చేయండి.. రతిక్రీడను ఆస్వాదించండి...
మీ భర్త మీపై ప్రేమను తగ్గించుకునేందుకు గల కారణాలేంటో తెలుసుకోండి.
రతి క్రీడలో ప్రతిరోజూ పాల్గొంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటికే చాలా పరిశోధనల్లో తేలింది. పలు అధ్యయనాలు కూడా ఆ కార్యం వల్ల భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని స్పష్టం చేశాయి.

అంతేకాదండోయ్.. అలా ప్రతిరోజూ కలయికలో పాల్గొనడం వల్ల పగలు మీరు చేసుకునే రోజువారీ పనుల్లో కూడా ఒత్తిడి తగ్గి బాగా హుషారుగా మారిపోతారంట. చిరాకు అనేది అస్సలు ఉండదట. అయితే ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనే జంటలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి.

పని ఒత్తిడి.. వ్యాపారం, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ విషయాలతో పాటు పరిస్థితుల అనుకూలించకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి తరం వారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత, పిల్లలు పుట్టగానే వారికి వైవాహిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతోంది.

అయితే పూర్వకాలంలో మాత్రం పెళ్లి చేసుకున్న జంటలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్లనే వారు నిత్యం ఆరోగ్యకరంగా ఉండేవారని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మీ భాగస్వామి మీపై ప్రేమను తగ్గించకుండా.. శృంగారంలో మీతో ప్రతిరోజూ పాల్గొనాలంటే మీరు కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బాడీ ఫిట్ గా..
శృంగారం అనేది ఒక వ్యాయామం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అంతేకాదు దీని వల్ల శ్వాసక్రియ సక్రమంగా పెరిగి ఎక్కువ క్యాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్ గా ఉంటుంది.

15 నిమిషాలు చొప్పున
వారానికి మూడుసార్లు మీరు మీ భాగస్వామితో కలిసి శృంగారంలో పాల్గొంటే.. ఏడాదికి 7,500 క్యాలరీల శక్తి పోతుంది. అంటే దాదాపు 75 మైళ్లు దూరం వరకు జాగింగ్ చేసినట్టే.

ఆక్సీజన్ విరివిగా..
మీరు మీ భాగస్వామితో కలిసి రతి క్రీడలో పాల్గొనే సమయంలో మీరు అధికంగా శ్వాస తీసుకుంటారు. దీని వల్ల మీ శరీర కణాలకు ఆక్సీజన్ అధికంగా లభిస్తుంది.

బంధం బలంగా..
మీరు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాదు మీరు చేసే రోజువారీ పనుల్లో కూడా ఒత్తిడి ఎగిరిపోతుంది. షుగర్, హార్ట్ లాంటి సమస్యలు అస్సలు ఉండవు. ఇక చిరాకు అనేదే పుట్టదు. ఎల్లప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు.

సామర్థ్యం తగ్గితే..
అయితే ప్రస్తుత జనరేషన్ వారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోయి.. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కలయిక సమయంలో భాగస్వామి అసంత్రుప్తికి లోనవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి.

జంక్ ఫుడ్ తో జాగ్రత్త..
అయితే ఈ తరం వారిలో శృంగార సామర్థ్యం ఎందుకు తగ్గిందనే విషయాన్ని పరిశీలిస్తే.. చాలా మందిపై వారు తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ఎంతో ప్రభావితం చేస్తుంది. అదీ కాక అనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువశాతం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారి శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే జంక్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం మీ శృంగార సామర్థ్యం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
