Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
భార్య అయినా భర్త అయినా హద్దుల్లో ఉండాల్సిందే, అప్పుడే బంధం బలోపేతం అవుతుంది
అసలు సంబంధంలో హద్దులు ఎందుకు ఉండాలి, ఎలాంటి హద్దులు ఉంటే ఆ సంబంధం కలకాలం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం ఒకటేగా మరి హద్దులు ఎందుకు ఉండాలి, అసలు హద్దులు ఉంటేనే కదా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఏ బంధంలోనైనా హద్దులు ఉండాలని మానసిక నిపుణులు, రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కొన్ని హద్దులు ఏర్పరచుకుని వాటికి తగ్గట్లుగా నడుచుకుంటే బంధం మరింత బలోపేతం అవుతుందని, దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని చెబుతున్నారు.

అసలు సంబంధంలో హద్దులు ఎందుకు ఉండాలి, ఎలాంటి హద్దులు ఉంటే ఆ సంబంధం కలకాలం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

దాంపత్యంలో సరిహద్దులు అంటే ఏమిటి?
సాధారణంగా సరిహద్దు అంటే రెండు ఊర్ల మధ్య, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య ఉంటాయి. ఆ సరిహద్దులు దాటాలంటే అవతలి వారి అనుమతి ఉండాల్సిందే. సంబంధంలో సరిహద్దులు కూడా అలాంటివే. సొంత అవసరాలు, కోరికలు, ఇష్టాల కోసం ఏర్పాటు చేసుకున్నవి. రిలేషన్‌షిప్‌లో సరిహద్దులు స్వీయ రక్షణ కల్పిస్తాయి. ఒక వ్యక్తి స్వయం ప్రతిపత్తిని, వ్యక్తిగత శ్రేయస్సును నిర్వహించడానికి సహాయపడతాయి.

సంబంధంలో సరిహద్దుల ప్రాముఖ్యత:
సంబంధంలో సరిహద్దులు చాలా ముఖ్యం. అవి వ్యక్తులను విభిన్నంగా ఉంచడంలో సహాయపడతాయి. సరిహద్దులు ఒక వ్యక్తి యొక్క విలువను పెంచుతాయి. వారి సొంత కోరికలు, అవరాలు, ఇష్టాలు, నమ్మకాలను కాపాడటంలో, గౌరవించడంలో, రక్షించడంలో సహాయం చేస్తాయి.

దంపతుల మధ్య ఉండాల్సిన హద్దులు:
ప్రైవసీ:
ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత గోప్యత ఉంటుంది. ఇద్దరు భాగస్వాముల మధ్య కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాలను జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేం. ఆయా విషయాలు వారికి తెలియకూడదని అనుకుంటాం. అది వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుంది.
దంపతులైనా, ప్రేమికులైనా, స్నేహితులైనా ఎవరి మధ్య అయినా ప్రైవసీ హద్దులు ఉండాలి.

సమయం:
సమయానికి సంబంధించిన సరిహద్దులు దాంపత్య బంధంలో చాలా ముఖ్యమైనవి. సమయం ఎంత పెద్ద గాయాన్ని అయినా మానేలా చేస్తుంది. సమయం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత సమయాన్ని గడపాలని చెబుతుంటారు మానసిక నిపుణులు. ఆ సమయంలో కుటుంబం గురించి కానీ, జీవిత భాగస్వామి గురించి కానీ ఆలోచించకుండా కేవలం మీ గురించి మీరే ఆలోచించాలని చెబుతారు.
ఆ సమయం గాయాలను మానుస్తుందని, కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుందని వెల్లడిస్తున్నారు. జీవిత భాగస్వామి తన సొంత సమయాన్ని ఏకాంతంగా గడుపుతున్నప్పుడు వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు.

శృంగారం:
దాంపత్య బంధంలో శృంగారానికి కీలక పాత్ర. సరైన శృంగారం వల్ల దాంపత్య బంధంలో చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహ బంధంతో ఒక్కటైన భాగస్వామిని లైంగిక ఆట వస్తువుగా చూడకూడదు. దాంపత్య బంధం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు కావాలనుకోవడం కూడా సరైనది కాదు.
మీకు శృంగారం కావాలనుకుంటే దానికి జీవిత భాగస్వామి అనుమతి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. శృంగారం విషయంలో ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆశలు చెప్పడం, కావాల్సినవి చెప్పడం, అవన్నీ హద్దుల కిందకే వస్తాయి.

స్నేహాలు:
దాంపత్య బంధంలో అన్ని షేర్ చేసుకుంటాం. అన్ని ఫీలింగ్స్ పంచుకుంటాం. కానీ ఈ పంచుకోవడం అనేది కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఉండాలి. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, ఎవరితో ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో ఉన్నాం, ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా భాగస్వామికి చెప్పడం అనేది ఫ్రస్ట్రేషన్‌కు గురి చేస్తుంది.
స్నేహం, స్నేహితులు, వారి గురించిన విషయాల పట్ల హద్దులు ఉండాలి. మీ జీవిత భాగస్వామికి వారి స్నేహితుల గురించి చెప్పడం ఇష్టం లేకపోతే వారిని బలవంతం చేయవద్దు.



Click it and Unblock the Notifications