Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఎంగేజ్ మెంట్ అయినా.. ఏడడుగులు వేయని తారలెవరో తెలుసా...
ఈ సెలబ్రెటీలు ఎంగేజ్ మెంట్ అయితే చేసుకున్నారు.. కానీ ఏడడుగులు మాత్రం వేయలేదు.. ఎందుకో మీరే చూడండి.
కొందరికి పెళ్లికి ముందు ప్రేమ అందం.. ఆ ప్రేమలో బ్రేకప్ ఉంటుంది.. మరి పెళ్లిలో ఉంటుందా అంటే.. విడాకుల రూపంలో ఉంటుంది..

అయితే ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఏడడుగులు వేయకుండా ఆగిపోవచ్చా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ తారల నుండి. ప్రస్తుత కాలంలో కొందరు జంటలు పెళ్లికి ముందు ప్రేమాయణం సాగిస్తున్నారు.. డేటింగ్ కూడా చేస్తున్నారు. వీరి ప్రేమ జీవితం సాఫీగా.. సంతోషంగా ఉన్నప్పటికీ.. పరిణయం వరకు మాత్రం వెళ్లలేకపోయింది.

కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే లోపే తమ బంధానికి బ్రేకులు వేస్తున్నారు. అందుకు వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ సినీ తారల డైవర్స్, బ్రేకప్ వంటి విషయాలు ఎప్పటికీ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి.

పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమై.. ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత కూడా కొందరు తారలు వెనుకడుగు వేశారు. కొందరు తమ వివాహ బంధంలోకి అడుగు పెట్టకముందే.. వివాహ బంధాన్ని వదులుకుంటారు. ఈ జాబితాలో ఒకప్పుడు బాలీవుడ్ తారలుంటే.. ఇప్పుడు అందులో టాలీవుడ్ తారలు కూడా చేరిపోవడం విశేషం. ఇంతకీ ఆ తారలెవరో మీరే చూడండి...

రష్మీక మందన్నా..
టాలీవుడ్ లో అత్యంత తక్కువ సమయంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ రష్మీక మందాన తను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కలిసి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఏడడుగులు వేయడానికి ముందు బెంగళూరులో ఘనంగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఏమో కానీ.. వారిద్దరూ తమ రిలేషన్ షిప్ బ్రేకప్ చెప్పేశారు. ప్రస్తుతం ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు.

మెహరీన్..
టాలీవుడ్ లో మరో కథానాయిక మెహరన్. ఈ అందాల భామ మార్చి మాసంలో జైపూర్ లో ఘనంగా ఎంగేజ్ మెంట్ వేడుకలు చేసుకుంది. అయితే ఏమయిందో తెలియదు కానీ.. మూడంటే మూడు నెలల్లోనే తాను ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తితో కలిసి ఏడడుగులు వేయకూడదని నిర్ణయించుకున్నట్టు.. ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు ఓ ప్రకటనలో ప్రకటించారు. తన కంటే ముందే భవ్యా బిష్ణోయ్ విడిపోదామనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తమ ఫ్యామిలీపై ఎవ్వరూ నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని కోరారు. తామిద్దరిదీ మంచి జంట అయినప్పటికీ.. విధిరాత మరోలా ఉందని బిష్ణోయ్ తెలిపారు. అంతేకాదు హీరోయిన్ గా తన కెరీర్ మరింత వేగంగా, సాఫీగా సాగాలని కోరుకున్నారు. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇద్దరూ చెప్పలేదు.

అఖిల్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ముద్దుల కుమారుడు అక్కినేని అఖిల్ కూడా కుటుంబ సభ్యులు, అతిరథుల మధ్య శ్రియా భూపాలత్ తో ఘనంగా నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్నారు. అఖిల్ తో పాటు నాగచైతన్య సమంత కూడా వెడ్డింగ్ జరుపుకున్నారు. వీరిద్దరూ వివాహం కూడా చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. కానీ ఎంగేజ్ మెంట్ తర్వాత ఏమి జరిగిందో తెలీదు కానీ.. తను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయితో బంధానికి గుడ్ బై చెప్పేశాడు.

త్రిష..
వర్షం సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్ త్రిష. ఈ అందాల భామకు కూడా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత తనతో కలిసి ఏడడుగులు మాత్రం వేయలేదు. పెళ్లికి ముందే తన నిర్ణయం మార్చుకుంది.

నయనతార..
మరో టాలీవుడ్ బ్యూటీ నయనతార.. ఈ బ్యూటీ తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ బాగా పాపులర్ అయ్యింది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎప్పటికీ వివాదస్పద విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముందు శింబుతో ప్రేమాయణం.. బ్రేకప్.. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవమెంతో ఎవ్వరికీ తెలియదు. అయితే తనకు కూడా బ్రేకప్ చెప్పేసి.. తాజాగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లవ్ ట్రాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

విశాల్..
తమిళ హీరో విశాల్ హైదరాబాదీ అమ్మాయి అనీషా రెడ్డితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలో తామిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. పెళ్లి గురించి ఎలాంటి విషయం మాట్లాడటం లేదు.

బాలీవుడ్ లో..
ఈ తరహా ఎంగేజ్ మెంట్ బ్రేకప్ లు కేవలం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఉన్నాయి. అప్పట్లో అభిషేక్ బచ్చన్-కరీష్మా కపూర్, అక్షయ్ కుమార్-రవీనా టాండన్, వివేక్ ఒబేరాయ్ - గుర్ ప్రీత్ గిల్.. తదితరులు ఎంగేజ్ మెంట్ తర్వాత బ్రేకప్ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు.
ఈరోజుల్లో ప్రేమలో పడిన తర్వాత బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత కూడా బ్రేకప్ అనేది కొంచెం కొత్తదే. ముఖ్యంగా ఇలాంటివి ఎక్కువగా సినీ తారల జీవితాల్లో జరుగుతూ ఉండటం విశేషం. వీరంతా తమ పెళ్లిళ్లను రద్దు చేసుకుని తమ కెరీర్ పై ఫోకస్ పెడుతుండటంతో పెళ్లికి నో చెబుతున్నారనే మాటలు వినబడుతున్నాయి. పెళ్లి తర్వాత కుటుంబసభ్యులు నటించకూడదని కండిషన్లు పెడుతుంటారని కొందరు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











