For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ వీడియో : గర్భిణీ భార్య కోసం కుర్చీగా మారిన ఈ భర్తకే 'Husband of the year'అవార్డు ఇవ్వాలి...!

|

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వచ్చాక.. అందులో ఉండే యాప్ ల ద్వారా ఏ మూల చిన్న సంఘటన జరిగిన ఎక్కడో ఒక చోట రికార్డు అవుతోంది. అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. అలాగే ప్రపంచమంతా కొన్నికోట్ల మంది దాన్ని వీక్షించడం.. లైకులు కొట్టడం, కామెంట్లు చేయడంతో అవి బాగా వైరల్ అయిపోతున్నాయి.

అయితే తాజాగా ఓ వీడియో మళ్లీ బాగా వైరల్ అయిపోయింది. ఇందులో ఫన్నీ అయితే ఏమి లేదు. కాకపోతే ఇది భార్యభర్తల మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. గర్భిణి అయిన తన భార్య ఇబ్బంది పడుతుంటే అది చూసి తట్టుకోలేని భర్త తన బాడీనే కుర్చీగా మార్చుకున్నాడు. తన శరీరంపై ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే అది కాస్త బాగా వైరల్ అయిపోయింది.. ఇంతకీ మానవీయ కోణం ఉన్న సంఘటన ఎక్కడ జరిగింది? ఆ భర్త పేరేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

నెటిజన్లను కదిలించింది..

గర్భవతి అయిన భార్యకు ఓ భర్త మానవ కుర్చీగా మారిన సంఘటన నెటిజన్లను కదిలించింది. దీంతో వారి స్పందనను తమదైన శైలిలో తెలియజేశారు. ఓ నెటిజన్ చేసిన కామెంట్ అందరి కంటే హైలెట్ గా నిలిచింది. ఆ భర్తకు ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్‘ అవార్డుకు అసలైన అర్హుడు అని కామెంట్ చేశారు.

టెస్టుల నిమిత్తం ఆసుపత్రికి..

టెస్టుల నిమిత్తం ఆసుపత్రికి..

చైనాలోని హీలాంగ్జి యాంగ్ ప్రావిన్స్ లోని కియాంగ్ నగరానికి చెందిన ఒక వ్యక్తి గర్భవతి అయిన తన భార్యను టెస్టుల నిమిత్తం వారి ఇంటికి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే వారు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కుర్చీలన్నీ నిండిపోయాయి. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ డాక్టర్ రూమ్ బయటే నిలబడాల్సి వచ్చింది.

అలసటగా ఉన్నట్లు గుర్తించిన భర్త..

అలసటగా ఉన్నట్లు గుర్తించిన భర్త..

గర్భవతి అయిన తన భార్య అలసటగా ఉన్నట్టు గమనించిన తన భర్త వెంటనే తన భార్యతో తన వెనుక భాగంలో నేలపై కూర్చుని మానవ కుర్చీగా మారాడు. ఆ సన్నివేశాన్ని చూసి కూడా అక్కడున్న వారు ఎవరూ వారికి సహాయం చేయలేదు. కనీస మర్యాద కోసం అయిన కుర్చీని ఇవ్వలేదు.

ఆ భర్తకు ప్రశంసలు..

ఆ భర్తకు ప్రశంసలు..

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దీన్ని అతి తక్కువ సమయంలో కొన్ని మిలియన్ల మంది నెటిజన్లు చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గర్భవతి భార్యను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో అక్కడ వారికి సహాయం చేయని వారిని తిడుతూ కామెంట్లు చేశారు.

నిజమైన ప్రేమకు నిదర్శనం..

నిజమైన ప్రేమకు నిదర్శనం..

ఒక వ్యక్తి నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో ఈ సంఘటనను నిదర్శనంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి ప్రేమ ఎంత గొప్పదో.. ప్రేమ కోసం ప్రతిదాన్ని త్యాగం చేయడానికి మగవారు సిద్ధంగా ఉంటారు. అయితే చాలా మంది నిజమైన ప్రేమ లాంటిదేమీ లేదని ప్రజలు చెబుతుంటారు. ఎందుకంటే మానవులు తమ సొంత అవసరాలపై దృష్టి సారించడం వల్ల వారు భౌతిక ఆనందాన్ని కోరుకుంటారు.

English summary

viral video of husband becomes human chair for pregnant wife

In a sweet gesture, a husband becomes a human chair for his pregnant wife when people refuse to offer her a seat. The couple was at a hospital, probably for a checkup and this is when people do not offer any seat to the lady.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more