Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పరువు హత్యలు ఎందుకని పెరుగుతున్నాయో తెలుసా...!
మన భారతదేశంలో పరువు హత్యలు ఎందుకని పెరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అమృత, ప్రణయ్.. ఈ ప్రేమ జంట గురించి తెలియని తెలుగు రాష్ట్రాల వారుండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన అమృత అగ్రకులానికి చెందిన అమ్మాయి.. అంతేకాదు కోటిశ్వీరుడికి ఒక్కగానొక్క కూతురు.

అయితే తను ప్రేమించిన యువకుడు ప్రణయ్ దళితుడు. దీంతో ఆమె ప్రేమకు తల్లిదండ్రలూ అస్సలు ఒప్పుకోలేదు. అయినా వారు పెద్దలను ఎదిరించి ఘనంగా వివాహం చేసుకున్నారు. సక్రమంగా కాపురం కూడా చేసుకుంటూ హాయిగా జీవించేవారు.

అయితే తను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లముందే ఓ దళితుడితో పెళ్లి చేసుకోవడం.. సంతోషంగా జీవించడం ఇష్టం లేని అమృత తండ్రి ప్రణయ్ ను చంపించేందుకు కిరాయి హంతకులకు సూపరీ ఇచ్చాడు. దీంతో వారు గతేడాది సెప్టెంబర్ 14వ తేదీన అమృత కళ్లముందే ప్రణయ్ ని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ హత్య కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది.

దాని సంగతి అలా ఉంచితే.. అలాంటి సంఘటనే మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత రిపీట్ అయ్యింది. కుటుంబం పరువు పోయిందనే కోపంలో కన్న కొడుకును చంపడానికి సూపరీ ఇచ్చాడో తండ్రి.. అయితే ఇక్కడ తక్కువ కులం కాదు.. వేరే కులం వారిని వివాహం చేసుకోవడమే కారణం. అప్పుడేమో ఎస్సీ కులం.. ఇప్పుడేమో వైశ్యకులం బాధిత కులంగా మిగిలిపోయింది... కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే.. కాలయములై పోతున్నారు.. పరువు కోసం పాకులాడుతూ కన్నవారినే కాలగర్భంలో కలిపేస్తున్నారు...

పరువు కోసం పాకులాడటం..
మన తెలుగు సినిమాల్లో చూపించినట్టు అనాదిగా వస్తున్న రక్తచరిత్ర, స్త్రీ, పురుషులిద్దరూ ప్రేమించుకోవడం.. అమ్మాయి వైపు లేదా అబ్బాయి వైపు ఉండేవారు ఒప్పుకోకపోవడం.. అయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. హాయిగా జీవిస్తున్న వారిని.. పరువు పేరిట వారిని హత్య చేయించడం.. ఏం సాధించడానికి ఇవి జరుగుతాయో తెలీదు.

ఆలోచనల్లో మార్పులను..
కన్నవారిని చంపించేసి.. జైలు పాలు కావడం.. మీడియాలో రచ్చ రచ్చ కావడం.. ‘కని పెంచిన మమ్మల్నే కాదంటారా? అని.. మమ్మల్ని తిరస్కరిస్తారా?'అని తట్టుకోలేని పెద్దలు.. ప్రస్తుత పిల్లల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఏ మాత్రం గమనించడం లేదు.

పంతాలకు పోవడం..
ఈ ఆధునిక కాలంలోనూ తమ మాటే వినాలి.. తాము చెప్పినట్టే అంతా జరగాలి.. తమకు ఇష్టం లేని వారిని వివాహం చేసుకోకూడదు.. ఒకవేళ తమను కాదని పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడానికైనా.. చేయించడానికైనా వెనుకాడమని కొందరు ప్రవర్తించడం బాధాకరం.

కులపిచ్చి..
పరువు, ప్రతిష్ట, గౌరవం, సమాజంతో పాటు కులపిచ్చి వల్ల ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర కులం వారిని పెళ్లి చేసుకున్నారనో.. తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారనో.. లేదా వారిని ప్రేమించారని తెలిసినా, వారిని వదలడం లేదు. కన్న కూతురు.. కొడుకులను కూడా హతమారుస్తున్నారు. అలాంటి కుల పిచ్చికే ప్రణయ్, హేమంత్ తో పాటు ఎందరో బలయ్యారు.

ఆస్తులు.. అంతస్తుల్లో తేడాలు..
ఒకవేళ కులం గురించి పట్టించుకోకున్నా.. ఆస్తులు, అంతస్తలు.. ఆర్థిక పరమైన తేడాలను చూస్తున్నారు. అంతేకాదు ఆంధ్ర, తెలంగాణ అనే ప్రాంతీయ వివక్షలను కూడా చూడటం చాలా బాధాకరం.

తప్పని ఒప్పుకోకపోవడం..
కొందరు తల్లిదండ్రులు ఇలాంటి దారుణాలకు పాల్పడి జైలు పాలవ్వడం ఒక ఎత్తు అయితే.. జైలుకు వెళ్లి వచ్చినా కూడా తమ తీరును మార్చుకోకపోవడం విచారకరం. పైగా తామేమీ తప్పు చేయలేదని చెబుతుంటారు.

పెరుగుతూనే ఉన్నాయి..
ఇలాంటి పరువు హత్యలు కేవలం మన తెలంగాణలోనే కాదు.. ఆంధ్రాలో మరియు ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉన్నాయి. అయితే కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరువు హత్యలు మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. కులం.. మతం.. ప్రాంతం.. అనేవి ఏవీ మనకు తిండి పెట్టవు.. ఎలాంటి పరువు, మర్యాదలను కాపాడవని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వీలైతే ప్రేమ పరీక్షలు పెట్టండి.. అందులో సక్సెస్ కాకపోతే వారికి వాస్తవాలను వివరించండి. అంతేగానీ.. ఇలాంటి దుశ్చర్యలకు మాత్రం పాల్పడకండి...



Click it and Unblock the Notifications
