Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
శృంగారం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, ఏవంటే?
శృంగారం అనిర్వచనీయమైన అనుభూతి. దానిని అనుభవించాల్సిందే. శృంగారం ఎంత గొప్ప అనుభవమైనప్పటికీ కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. శృంగారంలో ఆనందం పొందటానికి ఎంతగా తాపత్రయ పడతామో అలాగే సెక్స్ చేశాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
సెక్స్ చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలే చేయవద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అద్భుతంగా శృంగారాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దు:
చాలా మంది మహిళలు చేసే తప్పు ఇది. ఎక్కువ మంది స్త్రీలు సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయకుండా ఉంటారు. సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రాశయం చుట్టూ ఉన్న బ్యాక్టీరియా సులభంగా బయటకు వెళ్లిపోతుందా. అలాగే సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు.
సబ్బుతో కడగొద్దు:
సెక్స్ చేసిన తర్వాత చాలా మంది మహిళలు యోనిని శుభ్రం చేసుకుంటారు. ఈ సమయంలో సబ్బును వాడటం మానుకోవాలి. సబ్బులు, హ్యాండ్ వాష్ లు వాడటం వల్ల యోనిలో మంట, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి. యోని భాగం చాలా సున్నితంగా ఉంటుంది. సబ్బులో ఉండే రసాయనాలు సున్నితమైన యోనిని చికాకు పెట్టవచ్చు. సబ్బుకు బదులు నీటితో కడగడం చాలా మంచిది.
సాధారణ దుస్తులు ధరించకపోవడం:
శృంగారంలో పురుషుల్లో ఉద్రేకం పెంచడానికి, మూడ్ వచ్చేలా చేయడానికి కొంత మంది స్త్రీలు సెక్సీ లోదుస్తులు ధరిస్తుంటారు. ఇవి బిగుతుగా ఉండి ప్రైవేట్ పార్ట్స్ ను ఒత్తిడికి గురిచేస్తాయి. అలాగే లోదుస్తులు రేయాన్, పాలిస్టర్, నియాన్ వంటి బట్టలతో తయారు చేస్తారు. ఇలాంటి ఫ్యాబ్రిక్ వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, దురద లాంటి సమస్యలు వస్తాయి. శృంగారం తర్వాత బిగుతైన లోదుస్తులు విడిచి తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
చేతులు శుభ్రం చేసుకోకపోవడం:
సెక్స్ సమయంలో ఒకరి జననాంగాలను ఒకరు తాకడం చాలా సాధారణం. ఇలా చేయడం వల్ల అక్కడ ఉండే బ్యాక్టీరియా చేతులకు అంటుకుంటుంది. అయితే శృంగారం ముగిశాక చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. లేకపోతే మల్టీపుల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
