Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అక్రమ సంబంధాలపై లేటెస్ట్ సర్వే.. ఆ సంబంధాలు పెరగడానికి 50 శాతం కారణాలు ఇవే!
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు భారీగా పెరిగిపోయాయి. చాలా మంది ఆ అక్రమ సంబంధాల కారణంగా తమ భాగస్వామిని హతమార్చడం, లేదా వేరే వారితో లేచిపోవడం వంటివి చేస్తున్నారు. అలాగే వివాహితులు తమ భాగస్వాములను మోసం చేయడం, ఆ తర్వాత అవి బయటపడితే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కుటుంబాన్ని నష్టం వాటిల్లించే పరిస్థితులలోకి వెళ్లడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలపై కొందరు సర్వే నిర్వహించారు. ఈ తాజా సర్వేల్లో వివాహేతర సంబంధాలకు సంబంధించిన కొన్ని షాకింగ్ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా "వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏమిటి?", "ఎంత శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు?" వంటి అంశాలపై సర్వే నిర్వహించారు.

ఎవరు సర్వే చేశారంటే
2022లో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం నిర్వహించిన గ్లోబల్ సోషల్ సర్వే (GSS) ప్రకారం, 20% మంది పురుషులు మరియు 13% మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను మోసం చేసి అక్రమ సంబంధంలో కొనసాగుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. అలాగే, 2019లో బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో 1000 మందికి పైగా వివాహితులపై ప్రశ్నించగా, 20% మంది పురుషులు మరియు 10% మంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య మారొచ్చు. ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఎక్కువైపోవడంతో చాలా మంది ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం సాధారణంగా అయిపోయింది.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా, వివాహేతర సంబంధాల ఏర్పాటు చేసే మహిళల సంఖ్య పెరిగింది. 2010లో జరిగిన ఒక సర్వేలో, భార్యలు తమ భర్తలను మోసం చేసే ధోరణి 20 సంవత్సరాల క్రితం కంటే 40% ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అసలు వివాహేతర సంబంధాల్లో పాల్గొనడానికి కారణాలు ఏంటో ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వివాహేతర సంబంధాలకు కారణాలు:
ఒంటరితనం:
స్త్రీలు ఎక్కువగా భావోద్వేగంగా స్పందిస్తారు. వారు తమ భాగస్వామి దగ్గరగా లేకపోతే, ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేరు. దానివల్ల వారు వివిధ ఆలోచనలను చేయవచ్చు. చాలామంది తమ పనులు లేదా కుటుంబ సంబంధాలలో బిజీ అయి, భాగస్వామికి సమయం కేటాయించలేరు. అయితే, ఇది వారి బంధాన్ని బలహీనపరిచేస్తుంది.
ఆత్మగౌరవం:
స్త్రీల ఆత్మగౌరవం దెబ్బతినటం లేదా భాగస్వామి వారి వైపు గమనించే ప్రయత్నం చేయకపోవటం, వివాహేతర సంబంధాలకు కారణంగా మారుతుంది. ఈ పరిస్థితిలో, వారు అవసరమైన శ్రద్ధ, గౌరవం కోసం ఇతరుల వైపు చూడవచ్చు.
ఆవశ్యకతలు:
అధికారిక అధ్యయనాల ప్రకారం.. స్త్రీలు తమ భావోద్వేగ అవసరాలను తీర్చడానికి మోసం చేయాలని భావిస్తారు. ఇందులో సెక్స్, శ్రద్ధ, సానుభూతి, గౌరవం, ప్రశంస లాంటి అంశాలు కూడా ఉంటాయి. వారు తమ ప్రస్తుత సంబంధం నుంచి ఇవి పొందలేకపోతే, అవి ఇతర వ్యక్తుల దగ్గర కలుగుతాయని భావిస్తారు.
కోపం:
కొంతమంది స్త్రీలు తమ భాగస్వామిని ఒక నిర్దిష్ట విధంగా ఊహించుకుని వివాహం చేసుకుంటారు. కానీ భాగస్వామి వారి అంచనాలకు తగ్గట్లుగా వ్యవహరించకపోవడం, సంబంధంలో రుగ్మతలను తెచ్చిపెట్టవచ్చు. అదేవిధంగా, గత సంబంధాల కారణంగా కొంతమంది తమ ప్రస్తుత భాగస్వామిని మోసం చేస్తుంటారు. ఈ సమస్యలు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి, కనుక వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండడం, సంబంధం యొక్క ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications