Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Sick After Love Making: ఫుల్‌గా సెక్స్ ఎంజాయ్ చేశాక నీరసించి, డీలా పడిపోతున్నారా?
శృంగారం మత్తునిచ్చే, మధురమైన, మైమరిపించే అనుభూతి. సెక్స్ గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా దానిని స్వయంగా అనుభవిస్తేనే దాని మజా తెలుస్తుంది. దాంపత్య బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషులు శృంగారం ద్వారానే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఒక్కటవుతారు.
దాంపత్య బంధంలో శృంగారానిది అత్యంత కీలక పాత్ర. భాగస్వామిపై హద్దుల్లేని ప్రేమను వ్యక్తపరిచడానికి శృంగారం మంచి మార్గం. జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా, సంతృప్తిగా శృంగారాన్ని అనుభవించిన తర్వాత కొంత మంది నీరసించి, డీలా పడిపోతారు.

ముఖ్యంగా స్త్రీలలో శృంగారం తర్వాత సిక్ అయినట్లుగా అనిపిస్తుంది. వికారంగా, వాంతులు వచ్చినట్లుగా ఉంటుంది. శృంగారం తర్వాత అనారోగ్యంగా ఎందుకు అనిపిస్తుంది, వికారంగా అనిపించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డీప్ పెనెట్రేషన్:
అంగం లోతుగా వ్యాప్తి చెందితే దాని వల్ల వికారంగా అనిపిస్తుంది. అసౌకర్యంగా అనిపించేంత వరకు వెళ్లడం వల్ల కటి అవయవాలు అసౌకర్యానికి గురవుతాయి. దీని వల్ల యోని అసంతృప్తికి గురవుతుంది. అయితే, ఈ కారణం వల్ల వికారంగా అనిపిస్తే అది తాత్కాలికమేనని గుర్తుంచుకోవడం ముఖ్యం. పడుకున్నప్పుడు పాదాలను పైకి ఉంచితే అసౌకర్యం తగ్గుతుంది.
అండాశయ తిత్తి:
ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఇది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అండాశయ తిత్తులు స్త్రీ భాగాల్లో ప్రమాదకరమైన సమస్యలను తీసుకువస్తాయి. పెల్విక్ అవయవాల్లో అంతరాయాలకు కారణం అవుతుంది. సెక్స్ చేసిన ప్రతిసారీ వికారంగా అనిపించవచ్చు. అటువంటి సందర్భాల్లో ముందుగా వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోవాలి.

మోషన్ సిక్‌నెస్:
కార్లు, పడవల్లో ప్రయాణించినప్పుడు మాత్రమే మోషన్ సిక్‌నెస్ వస్తుందనుకుంటే పొరబడినట్లే. సెక్స్ చేస్తున్నప్పుడు శరీరం వేగంగా కదులుతుంది. సెక్స్ చేసిన తర్వాత అసౌకర్యంగా అనిపించడానికి కఠినమైన, నిరంతర శరీర కదలికలు కారణం కావొచ్చు.
మద్యం:
మద్యం సేవించిన తర్వాత లేదా డ్రగ్స్ తీసుకున్న తర్వాత సెక్స్ చేశాక వికారంగా అనిపించే అవకాశం ఉంది. ఆల్కలహాల్, డ్రగ్స్ తీసుకోవడం వల్ల అప్పటికే వికారంగా అనిపించవచ్చు. సెక్స్ లో తీవ్రమైన శరీరక కదలికల వల్ల ఆ పరిస్థితి మరింత పెరుగుతుంది. శృంగారాన్ని ఆస్వాదించాలనుకుంటే మత్తుకు దూరంగా ఉండాలి.
ఎండోమెట్రియోసిస్:
ఇదో తీవ్రమైన పరిస్థితి. గర్భాశయంలోని పొర కణజాలం గర్భాశయ కుహరం వెలుపల పెరుగుతుంది. ఇది లైంగిక సంపర్కం, అంగం చొచ్చుకుపోయేటప్పుడు విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. నొప్పిగా అనిపించే శృంగారం తర్వాత వికారంగా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications