Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!
రిలేషన్‌షిప్‌లో ఓసీడీ.. పదే పదే మీలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా.?
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్- ఓసీడీ.. ఇటీవలి కాలంలో ఈ సమస్య కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది బాధపడుతున్న విషయం తెలిసిందే. పదే పదే స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, ప్రతిదీ పర్ఫెక్ట్‌గా, శుభ్రంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ ఓసీడీ పరిశుభ్రతకి సంబంధించింది. అయితే రిలేషన్‌షిప్‌లో ఓ రకమైన ఓసీడీ ఉంటుందని తెలుసా..

ప్రేమ, వైవాహిక జీవితం ఇలా రిలేషన్ ఏదైనా ఆ బంధంలో అనుమానాలు నిత్య సాధారణం అయిపోయాయి. అనుమానం, గొడవలు లేని బంధాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇదిలా ఉండగా భాగస్వామితో బంధంలో కొందరు ఓసీడీతో బాధపడుతుంటారని కపుల్ థెరపిస్టులు చెబుతున్నారు. దీనినే రిలేషన్‌షిప్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్య ఎక్కువైతే అది తీవ్రమైన పరిణామాలకి దారితీస్తుందని థెరపిస్టులు హెచ్చరిస్తున్నారు. అసలీ రిలేషన్‌షిప్ ఓసీడీ అంటే ఏంటి.?
భాగస్వామితో బంధంపై ఓసీడీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని థెరపిస్టులు అంటున్నారు. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య అని.. ఈ సమస్య బారిన పడిన వ్యక్తి అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతూ బంధాన్ని విచ్ఛిన్న చేసుకుంటారని హెచ్చరిస్తున్నారు.
కాల్ డేటాపై నిఘా
కొందరికి తమ భాగస్వామి ఫోన్‌ను తరచూ తనిఖీ చేస్తుంటారు. ఎవరితో మాట్లాడుతున్నారు. వారి కాల్ డేటా, చాటింగ్ డేటా, ఆర్థిక వ్యవహారాలు వీటన్నిటిపైనా ఎక్కువగా నిఘా పెడుతుంటారు. వారికి వచ్చిన ప్రతి కాల్‌ను వినాలని ఆరాటపడుతుంటారు. ఈ సమస్య తీవ్రమైతే అదే రిలేషన్‌షిప్ ఓసీడీ. ఫలితంగా వివిధ రకాల భావోద్వేగాలకు గురై భాగస్వామిని అనుమానిస్తున్నామని తమను తాము నిందించుకుంటూ ఉంటారు. దీంతో ఆ బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువ.
రిలేషన్‌షిప్‌పై అనుమానం
ప్రేమలో పడ్డాక, లేదంటే వైవాహిక జీవితం ప్రారంభించాక కొందరిలో పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి తనకు సరైన వారేనా, రిలేషన్‌షిప్‌లో పొరపాటు చేశానా, భాగస్వామి తన గురించి ఏమనుకుంటున్నారని పదే పదే ఆలోచిస్తుంటారు. తనతో కాకుండా వేరే ఎవరితోనైనా చనువుగా ఉంటున్నారా అనే అనుమానాలను పెంచుకుంటూ ఉంటారు. దీంతో భాగస్వామిపై అధిక శ్రద్ధ చూపుతుంటారు. ఇంకా వారి లోపాలను పదే పదే గమనిస్తూ ఉంటారు. ఇది కూడా ఓసీడీ పరిధిలోకే వస్తుందని అంటున్నారు.
తన జీవితంలో ప్రవేశించిన భాగస్వామి అన్ని విషయాల్లో నిజాయతీగా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. వారి నుంచి అధికంగా నమ్మకాన్ని ఆశిస్తారు. అంతేకాకుండా తమ ఆశయాలను, అభిరుచులను ఎదుటి వ్యక్తిపై రుద్ది వారూ ఇలాగే ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తమ రిలేషన్‌ను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు.

రిలేషన్‌షిప్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్న వారు బాధపడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని అంటున్నారు. ఆర్‌ఓసీడీతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యను మీ భాగస్వామితో మనసు విప్పి చర్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. భాగస్వామిపై అనుమానం అనే బీజం మొలకెత్తితే వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటున్నారు.
భిన్నాభిప్రాయాలు, విరుద్ధ ఆలోచనలతో సతమతం కాకుండా అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలని థెరపిస్టులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి, మానసికంగా భారం తగ్గి మనసు తేలికవుతుందని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
