Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పగోడికి కూడా ఇలాంటి పెళ్లాం వద్దు..రోజూ అలా చేయాలంటూ భర్తను వేధిస్తున్న భార్య!
తన భార్య వేధిస్తోందంటూ ఓ భర్త పోలీస్ ప్టేషన్ కి వెళ్లాడు. భార్య గురించి అతడు చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. తన భార్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, కాపురం చేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోందని, తనను ఉద్యోగం కూడా చెయ్యనివ్వకుండా అడ్డుకుంటుందని వాపోయాడు. అయితే ఈ విషయమై స్పందించిన భార్య తన భర్త గలీజ్ గా బూతులు తిడుతుంటాడని, ఇంట్లో తాను చేసే ప్రతిదాన్నీ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడని, డబ్బులిస్తేనే అతడిని వదిలేస్తానని చెప్పింది. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి 2022లో బిందు అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొంతకాలం వరకు అంతా బాగానే సాగింది. అయితే క్రమంగా వీరి సంసారంలో లుక లుకలు మొదలయ్యాయి. తనతో ఉండాలి అంటే రోజుకి రూ.5వేలు ఇవ్వాలని, ఎలాంటి కారణం లేకుండానే తన భార్య తనను వేధిస్తోందని శ్రీకాంత్ బెంగళూరులోని వ్యలికావల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లెయింట్ లో చెప్పాడు. పిల్లలు కనడానికి కూడా భార్య అంగీకరించడం లేదని,60 ఏళ్ల వయస్సు వచ్చాక పిల్లలను దత్తత తీసుకోవచ్చులే.తాను మాత్రం పిల్లలను కనే ప్రశక్తే లేదు అని తేల్చి చెబుతోందని శ్రీకాంత్ తెలిపాడు. తాను చెప్పినట్లుగా చేయకున్నా, తన మాటలు వినకుంటే ఆత్మహత్య చేసుకుంటాను,సూసైడ్ లెటర్ లో నీ పేరు రాసి చచ్చిపోతా అంటూ భార్య తనను వేధిస్తోందని చెప్పాడు.

తాను ఇంటినుంచే వర్క్ చేస్తుంటానని, అయితే తాను వర్క్ చేసుకునే సమయంలో భార్య పెద్దగా సౌండ్ తో సినిమా పాటలు పెట్టడం వంటివి చేస్తూ పని కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వడం లేదని శ్రీకాంత్ చెప్పాడు. భార్య టార్చర్ కారణంగా తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయానని, ప్రాజెక్ట్ లపై శ్రద్ద చూపలేకపోతున్నట్లు వాపోయాడు. పెళ్లాం టార్చర్ కారణంగా వివాహ బంధంలో అన్నీ సంతోషాలను కోల్పోయానని, అయితే తనకు విడాకులు ఇవ్వాలని అడుగుంటే మాత్రం రూ.45 లక్షలు డిమాండ్ చేస్తోందని,ఎలాగైనా తనను కాపాడాలని పోలీసులకు తన బాధను చెప్పుకున్నాడు శ్రీకాంత్. తన భార్య కుటుంబసభ్యులపై కూడా శ్రీకాంత్ కంప్లెయింట్ చేశాడు.
భార్య స్పందన ఇలా
తన భర్త చెప్పేవన్నీ అబద్దాలేనని బిందు తెలిపింది. తన భర్త గలీజ్ గలీజ్ మాటలతో తనను తిడుతుంటాడని, ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తుంటాని,ఇది తనకు విచిత్రంగా అనిపించిందిని బిందు తెలిపింది.తన భర్త నుంచి తానేమీ రూ.45 లక్షలు భరణంగా డిమాండ్ చేయట్లేదని, పెళ్లి సమయంలో తన తండ్రి ఖర్చుపెట్టిన పెట్టిన రూ.40లక్షలు ఇవ్వాలని అడినట్లు చెప్పింది. తన భర్త ఇంట్లో తనను తిడుతున్నట్లుగా ఉండే ఆడియో,వీడియోలు అన్నీ ఎడిట్ చేసి ఆయనకు అనుకూలంగా ఉంచుకున్నాడని బిందు ఆరోపించింది. తనను భర్త మెంటల్ టార్చర్ చేస్తున్నాడని, కట్నం కోసం డిమాండ్ చేస్తూ హింసిస్తున్నాడంటూ భర్తపై బిందూ కూడా వ్యలికావల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications