Latest Updates
-
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి -
ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి కోడి పులావ్.. స్పైసీగా ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్.! -
బ్రెడ్ లేకుండానే అదిరిపోయే శాండ్ విచ్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
2026 జూన్ 2: శని సంచారంతో ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితిగతుల్లో ఊహించని మార్పులు, అదృష్టం! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 02 జూన్ 2026 -
సన్ స్క్రీన్ ఎంత రాయాలో తెలుసా? చర్మ నిపుణులు చెబుతున్న సీక్రెట్ ఇదే!
మగవాళ్లకు రక్షణ లేదా: మరొకడితో కులుకుతూ భర్తను వేధిస్తున్న భార్య!..విడాకులిచ్చినా వదలకుండా టార్చర్
వివాహేతర సంబంధాలు కాపురాలు నాశనం చేయడమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో పడి హత్యలు కూడా చేస్తున్నారు కొందరు. 5 నిమిషాల సుఖం కోసం కక్కుర్తి పడి దారుణంగా హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదు. మరికొందరు అయితే తమ వివాహేతర సంబంధాలకు అడ్డు వచ్చేవారిని మానసికంగా చిత్ర హింసలు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పెరిగిపోయిన వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. ఇక,భార్యల వేధింపులకు అల్లాడుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. లక్షల రూపాయల భరణం చెల్లించినా భార్యల వేధింపుల నుంచి విముక్తి కలగడం లేదు. చెన్నైలో మరో భార్య బాధితుడి వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టి పెరిగిన ప్రసన్న శంకర నారాయనన్(Prasanna Sankaranarayanan).. ట్రిచ్చి నిట్(Trichy NIT) లో చదివి తర్వాత అమెరికా వెళ్లి రిప్లింగ్(Rippling) అనే స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఇదొక వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం దాదాపు లక్ష కోట్ల రూపాయులు. రిప్లింగ్ కంపెనీ ప్రారంభించడానికి ముందు శంకర్ ప్రముఖ టెక్ సంస్థలలో అనుభవాన్ని పొందాడు. 2006లో గూగుల్‌లో ఇంటర్న్‌షిప్, తర్వాత మైక్రోసాఫ్ట్ కెనడాలో పనిచేశాడు. జనవరి 2023 నుండి క్రిప్టో కమ్యూనిటీల కోసం రూపొందించబడిన వికేంద్రీకృత సోషల్ నెట్‌వర్క్ అయిన 0xPPL పౌండర్ గా కూడా శంకర్ ఉన్నారు.

పదేళ్ల క్రితం ప్రసన్న శంకర్ కి..దివ్య అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 9 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లైన కొన్నేళ్ల వరకు హాయిగా సాగిన వీరి కాపురంలో వివాహేతర సంబంధం(Extra Marital Affair) చిచ్చుపెట్టింది. దివ్యకు అనూప్ అనే వ్యక్తితో ఎఫైర్ ఉన్నట్లు తాను గుర్తించానని శంకర్ చెప్పాడు. ఈ విషయమై శంకర్, దివ్య ల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ప్రసన్నకు వేధింపులు
భర్త తనను వేధిస్తున్నాడని, కొడుకుని కూడా కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ దివ్య అమెరికాలో ప్రసన్న శంకర్ పై కేసు పెట్టింది. అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. అయితే అనూప్ అనే వ్యక్తితో దివ్య ఎఫైర్ పెట్టుకుందని,ఏదో రకంగా తనను వేధించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా కేసు పెట్టిందని,తగిన సాక్ష్యాలను ప్రసన్న శంకర్ బయటపెట్టాడు. అనూప్ తో దివ్య చాటింగ్ సహా తగిన సాక్ష్యాలను కోర్టుకి సమర్పించడంతో ప్రసన్న శంకర్ కి అమెరికా కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అయినా అక్కడితో ఆగకుండా సింగపూర్ లో కూడా దివ్య ఇదే తరహా కేసుని ప్రసన్న శంకర్ పై పెట్టింది.
సింగపూర్ కోర్టు కూడా ప్రసన్న శంకర్ ని నిర్దోషిగా తేల్చింది. ఆ తర్వాత దివ్య,శంకర్ దంపతులు విడిపోవాలని నిర్ణయం తీసుకొని విడాకులకు వెళ్లారు. అయితే తనకు భరణంతో పాటు నెల నెలా యెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తేనే విడాకులు ఇస్తానని దివ్య చెప్పింది. దీంతో భరణంగా రూ.9 కోట్లు,మెయింటెన్స్ కింద నెలకు రూ. 4.3 లక్షలు ఇచ్చేందుకు ప్రసన్న ఒప్పందం చేసుకున్నాడు.
ఒప్పందం ప్రకారం కుమారుడి బాధ్యత ఇద్దరూ పంచుకోవాలి. కొడుకుతో వారం వారం గడిపేందుకు కూడా అమెరికా కోర్టు ప్రసన్న శంకర్ కి అనుమతిచ్చింది. అయితే ఈ గొడవ జరుగుతుండగా దివ్య చెన్నై వచ్చేసింది. వీకెండ్ లో ప్రసన్న శంకర్ తన కుమారుడిని తనతో తీసుకెళ్లాడు. అయితే తన కొడుకుని కిడ్నాప్ చేశాడంటూ,తనను రేప్ చేశాడని, వేధించాడని ప్రసన్న శంకర్ పై చెన్నై పోలీసులకు దివ్య కంప్లెయింట్ చేసింది.
ఇక్కడే అసలు కథ మొదలైంది
దివ్య ఫిర్యాదుతో చెన్నై పోలీసులు ప్రసన్న శంకర్ ని వేధించడం మొదలుపెట్టారంట. ఈ విషయాన్ని ప్రసన్న శంకర్ స్వయంగా చెప్పాడు. తన నుంచి పోలీసులు రూ. 25 లక్షలు కూడా డిమాండ్ చేశారని చెప్పాడు. మార్చి 23వ తేదీన ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో అసలు ఏం జరిగిందో పూస గుచ్చినట్లు ప్రసన్న శంకర్ చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. తమిళనాడులో ఉండలేకపోతున్నా అంటూ చెన్నై పోలీసుల వేధింపుల వ్యవహారం, దివ్యకు తనకు మధ్య జరిగిన గొడవలు, దివ్య ఎఫైర్ వ్యవహారం,దానికి తగిన ఆధారాలు అన్నీ ఎక్స్ వేదికగా బయటపెట్టాడు ప్రసన్న శంకర్. అనూప్ తో దివ్య ఎక్కడెక్కికి వెళ్లింది,ఆమె చాటింగ్ వివరాలను కూడా ప్రసన్న శంకర్ బయటపెట్టాడు. అనూప్ భార్యనే తనకు ఈ వివరాలను అందించినట్లు చెప్పాడు.
తన కొడుకు తనతో కలిసి ఆనందంగా ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. పోలీసులు చెన్నైలో ఉన్న తన తల్లిని కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎఫైఆర్ లేకుండానే తన ఫ్రెండ్ గోకుల్ ని బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారని ఎక్స్ లో పెట్టిన ఓ వీడియోలో ప్రసన్న శంకర్ చెప్పాడు.ప్రసన్న శంకర్ వీడియో,పోస్ట్ చెన్నై, బెంగళూరు సాఫ్ట్ వేర్ గ్రూప్ లలో వైరల్ గా మారడంతో ప్రసన్న శంకర్ కి సపోర్ట్ గా పలురువు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు .



Click it and Unblock the Notifications