Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్టార్ హీరో కూతురుని నగ్న ఫొటోలు అడిగారు..డిజిటల్ యుగంలో పేరెంట్స్ కు కనువిప్పు కలిగించే నిజజీవిత అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురు విషయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఆన్ లైన్ ప్రపంచంలో ఒక కనిపించని శత్రువు వలలో చిక్కబోయిన సంఘటనను ఆయన ఇటీవల షేర్ చేసుకున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రినీ ఆలోచింపజేసే, హెచ్చరించే నిజజీవిత అనుభవం. అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కూతురు నితార ఇంట్లో ప్రశాంతంగా ఒక ఆన్ లైన్ గేమ్ ఆడుకుంటోంది. ఆ గేమ్ లో భాగంగా పరిచయం లేని ఒక అపరిచితుడితో ఆమె జతకట్టింది.
ఆట సరదాగా సాగుతున్న సమయంలో ఆ అపరిచితుడు నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా?అని అక్షయ్ కుమార్ కుతురుని అడిగాడు. ఆ చిన్నారి అమాయకంగా అమ్మాయిని అని సమాధానమిచ్చింది. ఆ మరుక్షణమే ఆ వ్యక్తి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. అయితే నీ నగ్న ఫోటోలు పంపు అని డిమాండ్ చేశాడు. ఈ ఊహించని పరిణామానికి ఆ చిన్నారి ఏమాత్రం భయపడలేదు. వెంటనే ఆటను ఆపేసి పరుగున తన తల్లి ట్వింకిల్ ఖన్నా దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది.

ఈ సంఘటన మనందరి కళ్ళు తెరిపించాలి. నేటి డిజిటల్ యుగంలో మన పిల్లలు ఎంత పెద్ద ప్రమాదం అంచున ఉన్నారో ఇది స్పష్టం చేస్తోంది. ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా రూపంలో సైబర్ నేరగాళ్లు మన ఇళ్లలోకి చొరబడుతున్నారు. ఇలాంటి చిన్న అభ్యర్థనలే రేపు బ్లాక్‌మెయిలింగ్, వేధింపులు వంటి పెద్ద నేరాలకు దారితీస్తాయి.
స్కూల్స్ లో సైబర్ భద్రత అవసరం
ఈ సంఘటనతో చలించిపోయిన అక్షయ్ కుమార్ దీనిపై తీవ్రంగా స్పందించారు. వీధి నేరాల కన్నా సైబర్ నేరాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఈ డిజిటల్ మాయాజాలం నుండి కాపాడటానికి పాఠశాలల్లోనే అవగాహన కల్పించాలని ఆయన మహారాష్ట్ర సీఎంకి విజ్ఞప్తి చేశారు. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేకంగా సైబర్ పీరియడ్ ఏర్పాటు చేసి, ఆన్ లైన్ భద్రతపై పాఠాలు చెప్పాలని ఆయన సూచించారు.
ప్రతి తల్లిదండ్రికీ ఒక పాఠం
అక్షయ్ కుమార్ కుమార్తె ఆ రోజు చూపిన ధైర్యం వివేకం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదే తల్లిదండ్రులతో ఆమెకున్న స్నేహపూర్వక బంధం. తన తల్లిదండ్రులు తనను అర్థం చేసుకుంటారనే నమ్మకం ఆమెకు ఉంది. అందుకే భయంతో విషయాన్ని దాచిపెట్టకుండా, ధైర్యంగా చెప్పగలిగింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఫ్రెండ్స్ లాగా కూడా ఉండాలి. మీ పిల్లలు ఏ విషయాన్నీ మీ దగ్గర దాచకుండా, భయం లేకుండా మీతో పంచుకుంటున్నారంటే, అంతకన్నా పెద్ద విజయం మరొకటి లేదు. ప్రతిరోజూ వారితో సమయం గడపండి. ఈరోజు ఏం చేశావ్? ఏ గేమ్స్ ఆడావ్? ఆన్ లైన్ లో ఎవరితో మాట్లాడావ్? అని ప్రేమగా అడగండి. అపరిచితులెవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే మీకు చెప్పాలని వారికి ధైర్యం ఇవ్వండి.



Click it and Unblock the Notifications