Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇండియాస్ గోల్డెన్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలు సాధించి భారత దేశానికి ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆయన, పెళ్లి చేసుకోవడంతో యావత్ దేశం ద్రుష్టి ఆ కొత్త జంటపై పడింది. నీరజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమానీ. కేవలం కొద్దీ మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే నీరజ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె చరిత్ర ఏంటి అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆమె వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నీరజ్ చేయి పట్టుకున్న ఈ హిమానీ ఎవరు?
25 ఏళ్ల హిమానీ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె సోనిపట్‌లో నివసిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ తరఫున జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఆడారు.

అలాగే తైపీలో జరిగిన 2017 విద్యాలయ స్థాయి క్రీడా పోటీలలో కూడా పాల్గొన్నారు. 2016లో మలేషియాలో జరిగిన ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం, హిమానీ 2018లో సింగిల్స్‌లో 42వ ర్యాంక్ మరియు డబుల్స్‌లో 27వ ర్యాంక్‌ను సాధించారు. హిమానీ సోదరుడు కూడా టెన్నిస్ ప్లేయర్.
నీరజ్‌ను గోల్డెన్ బాయ్ అని ఎందుకు పిలుస్తారు?
హర్యానాలోని పానిపట్ జిల్లా ఖండ్రా గ్రామానికి చెందిన 27 ఏళ్ల అథ్లెట్ అయిన నీరజ్ చోప్రా.. ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా పనిచేశారు. నీరజ్ చోప్రా 2011లో జావెలిన్ శిక్షణ ప్రారంభించాడు. అప్పటి నుంచి క్రమక్రమంగా రాణిస్తూ.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించారు. దీంతో జావెలిన్ త్రోయర్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. అలాగే 2018లో గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా స్వర్ణం సాధించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతడిని అర్జున అవార్డుతో సత్కరించింది.



Click it and Unblock the Notifications
