For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ బిలీనియర్స్ కంటే ఎక్కువ ధనం ఉన్న ఆలయాలు

|

హిందూ మతంకు ఆరాధ్య ప్రదేశాలు దేవాలయాలు. అందుకే మన దేశంలో అనేక ఆధ్యాత్మిక దేవాలయాలను వెలసాయి. ప్రతి సందు మరియు మూలల్లో, లేదా చెట్టు క్రింద, ఊరిభయట..ఊరిలోపలో అనేక ప్రదేశాల్లో చిన్న లేదా పెద్ద ఆలయాలను చూస్తూనే ఉంటారు. కానీ, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి మత సంబంధిత దేవాలయాలు మాత్రమే కాదు అతి బాగా పాలపుర్ చెందిన రిచెస్ట్ దేవాలయాలు.

మన భారత దేశంలో ఉండే ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయానలు పెద్ద పెద్ద ధనికులు, సెలబ్రెటీలను, ప్రపవంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శిస్తుంటారు. అందుకు ఉదాహరణగా, మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రిచెస్ట్ దేవాలయం తిరుపతి బాలాజీ(శ్రీ వెంకటేశ్వర )దేవాలయం, పద్మభనాభస్వామీ దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, సిద్దివినాయక టెంపుల్ ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ది చెందినటువంటి మన ఇండియన్ టెంపుల్స్. మనఇండియాలో బిలియనీయర్స్ కంటే అత్యంత ధనిక దేవాలయాలు..

పద్మనాభస్వామి దేవాలయం:

పద్మనాభస్వామి దేవాలయం:

పద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురంలో కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ అనేక సంవత్సరాలను నుండి సేవ్ చేసిన $20bn నిధులు కనుగొనబడింది. భక్తులు శ్రీమహావిష్ణువుకు సమర్పించే డబ్బు, మరియు విలువైన బంగారం వెల కంటలేని విలువలు ఉన్నందున ఈ దేవాలయం మన ఇండియాలో బాగా ధనిక దేవాలయంగా ప్రసిద్ది చెందినది. ఇక్కడ ప్రదానంగా 6గదులు ఉన్నాయి అందులో 4గదుల్లో ఇల్ల పత్రాలు మరియు విలువైన వస్తువులు ఉన్నాయి. ఇంకా ఎ మరియు బి చాంబర్ లో భక్తుల నుండి సేకరించిన నగదు ఇక్కడ స్టోర్ చేయబడింది. 2011సంవత్సరం నుండి ఏడు మంది కమిటీ సభ్యుల ద్వారా ఇక్కడ నిల్వ చేసిన బంగారు నాణేలు, నగదు, విలువైన రాళ్ళు టన్నుల్లో ఉన్నదని కనుగొనబడింది. ఈ నిధి మొత్తం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందినది.

తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:

తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:

వార్షికాదాయం: Rs. 900 crore

సాధారణంగా తిరుపతి దేవాలయం అని అందరికీ తెలుసు. ఈ దేవాలయంను రెండవ ధనిక దేవాలయంగా ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉన్నది. ప్రతి రోజూ 60వేళ భక్తులు ఈ దేవాలయంను సందర్శిస్తుంటారు. అలాగే 900 కోట్లో కంటే ఎక్కువ సంపద నిల్వ చేయబడింది. ఈ దేవాలయంను మన ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా చెబుతారు.

 శిరిడీ సాయి బాబా:

శిరిడీ సాయి బాబా:

వార్షికాదాయం: Rs 540 crore మహరాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలుకాలోని చిన్న గ్రామం శిరిడి . ఆ గ్రామంలో వేపచెట్టు క్రింద పదమారేళ్ళ బాలుడుగా మెట్ట మొదట కనిపించి తమ జీవితాతం శ్రీ సాయి బాబా అక్కడే నివసించడం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీసాయి బాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులెవరో, కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. ఎండ, వాన, చలి లెక్కచేయక రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు క్రిందే కూర్చుని తప్పస్సులో ఉండేవారు. ఆయన మహిమలు అనిర్వచనీయమైనవి. ఎలాంటి కష్టంలో ఉన్నవారికైనా మార్గాలు చూపే గొప్ప గురవు శిరిడీ సాయి. అందుకే ఇప్పటీకి కొన్ని వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు .

వైష్ణోదేవి ఆలయం -జమ్ము:

వైష్ణోదేవి ఆలయం -జమ్ము:

వార్షికాదాయం: Over 500 crore ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సవంత్సరం ఈ గుడిని 10మిలియన్ల భక్తులు సందర్శిస్తుంటారు . ఒక సంవత్సర ఆదాయం 500కోట్లుగా నిర్ధారించారు. 1.2 టన్నుల గోల్డ్ ను దేవాలయంలో నిల్వచేసినట్లు సమాచారం.

. సిద్ది వినాయక టెంపుల్---ముంబాయ్:

. సిద్ది వినాయక టెంపుల్---ముంబాయ్:

ముంబాయి అనగానే సిద్ది వినాయక ఆలయం గుర్తుకు వస్తుంది. కాని మరొక ప్రముఖ గణేశ ఆలయం ఉన్నది అదే ముంబాయికి దగ్గరలో ఉన్న తిత్వాలా గ్రామంలోని వినాయకుని గుడి. ముంబాయికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా వెళ్లి చూసి వచ్చే ప్రార్ధనా స్థలాల్లో ఈ గుడి కూడా ఒకటి. గుడి అనంగానే మన పక్కన (దక్షిణ భారత దేశంలో) ఉన్నట్టుగా పెద్ద పెద్ద కట్టడాలు ఏమీ కాదు. చిన్న గుడి కాని, వేలమంది భక్తులు రోజూ వస్తారు. ఈ దేవాలయానికి సంవత్సరంలో 25 వేల నుండి కొన్ని లక్షల్లో దేవాలయాన్ని దర్శించుకుంటారు.

గోల్డెన్ టెంపుల్--అమ్రిత్ సర్:

గోల్డెన్ టెంపుల్--అమ్రిత్ సర్:

ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మందీర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అద్భుతమైర పవిత్రమైన దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క గ్రంధాలయం బంగారు పూతతో పూసిన ఆలయం ఉంది. ప్రకాశించే ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టు వైట్ భవనాలు మరియు ఒక పవిత్రమైన సరస్సు కలిగి ఉన్నాయి. అయితే ఈ దేవాలయం యొక్క సంపదను రహస్యంగా ఉంచారు. ఈదేవాలయంలో రోజూ లక్షమందికి పైగా అన్నధానం జరుగుతుంది. అయితే ఈ దేవాలయం యొక్క సంపదను పబ్లిక్ కు తెలియకుండా రహస్యంగా ఉంచారు.

 మీనాక్షి దేవాలయం-మధురై:

మీనాక్షి దేవాలయం-మధురై:

వార్షికాదాయం: 60 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది.అత్యంత ధనిక దేవాలయాల్లో మీనాక్షి దేవాలయం ఒకటి. సంవత్సరానికి 10లక్ష మంది ఈ దేవాలయాన్ని సందర్శస్తుంటారు.

శబరి మల:

శబరి మల:

వార్షికాదాయం: 105కోట్లు శబరిమల లేదా శబరిమలై , కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఒక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువలు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

గురువాయురప్పన్ టెంపుల్, కేరళ

గురువాయురప్పన్ టెంపుల్, కేరళ

వార్షికాదాయం: 50 కోట్లు నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి . పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మెదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూపాశరుషికి ప్రసాధించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ , తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతి ష్టించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.

జగన్నాథ టెంపుల్:

జగన్నాథ టెంపుల్:

వార్షికాదాయం: 208కేజిల బంగారం మరియు 25, 711ఏకారాల స్థనం ఉన్నట్లు వెల్లడించారు . లార్డ్ జగన్నాథున్ని అత్యంత ధనికుడుగా చూపించడానికి ఇండియన్ గౌర్నమెంట్ 30000 ఎకరాల స్థలంను లార్డ్ జగన్నాథ ఆలయానికి రిజిస్టర్ చేశారు. పూరీ జగన్నాథ్ ఆలయం: జగన్నాథ ఆలయం చాలా ప్రసిద్ధి ఒకటి అలాగే ఒరిస్సా అతిపెద్ద దేవాలయాలు వంటి ఉంది. 12 వ శతాబ్దంలో స్థాపించబడింది, ఆలయ జగన్నాథుని (కృష్ణుడు), విశ్వానికి ప్రభువు అంకితం. పూరీ జగన్నాథ ఆలయ పునాదిని వేసాయి కోసం క్రెడిట్ రాజా అనంత వర్మ చోడ గంగా దేవ్ వెళుతుంది. ఆలయం బంగాళాఖాతంలో తీరంలో, భువనేశ్వర్ నుండి 60 km దూరంలో ఉన్న, మరియు బాగా వైష్ణవ సంప్రదాయాలకు తరువాత భక్తులు గౌరవించబడ్డాడు. పూరీ జగన్నాథ ఆలయం సంబంధం ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది.

 సోమనాథ్ దేవాలయం:

సోమనాథ్ దేవాలయం:

వార్షిక ఆధాయం 109kg బంగారం మనదేశంలో ఉన్న ప్రసిద్ధపుణ్యక్షేత్రాల్లో సోమనాథ్ విఖ్యాతమైనది. ఇది గొప్ప పర్యాటక క్షేత్రం కూడ. సోమనాథ్‌లోని మహాదేవలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఆలయ నిర్మాణం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మార్గదర్శకత్వంలో జరిగింది. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని ప్రభాస పట్టణం అని కూడా పిలుస్తారుసోమనాథ్ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అహ్మదాబాద్ నుంచి సుమారుగా 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సోమనాథ్ క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో బాలకతీర్థం ఉంది. వేటగాడి బాణపు ముల్లు శ్రీకృష్ణ భగవానుని పాదానికి గుచ్చుకున్న స్థలం అని చెబుతారు. కృష్ణుడు కాయాన్ని పరిత్యజించిన ప్రదేశం ‘దేహాస్వర్గ' బాలతీర్థానికి దగ్గరలో ఉంది. ఇది కపిల, హిరణ్య, సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానం. కృష్ణుని పార్థివ దేహానికి అర్జునుడు దహన క్రియలు జరిపించిన ప్రదేశం ఇదేనని చెబుతారు.

కాశీ: ద్వారకానాథ్

కాశీ: ద్వారకానాథ్

వార్షికాదాయాన్ని రివీల్ చేయలేదు. కాశీ విశ్వనాథ్ దేవాలయం: భక్తుల హృదయములలో అసలైన కైలాసంగా గుర్తింపబడిన పుణ్యక్షేత్రం. గంగానది ఒడ్డున గల ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లో వారణాసి పట్టణంలో ఉంది. కాశీ కేలితే కాటి కేగినట్లే అనే పూర్వకాలము నుంచి నేటి వరకు పవిత్రత చెడని మహా పుణ్య శైవక్షేత్రం. ఇక్కడే అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవాలయములు కలవు. నది ఒడ్డునే అనేక శ్మశాన వాటికలు, హోరెత్తే పంచాక్షరీ మంత్రం యాత్రికుల గుండెలలో తమో గుణాధీసుడు పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రాంతము కైలాసంలో అడుగు పెట్టినట్లు ఆత్మానందాన్ని అనుభవిస్తారు. జీవితములో ఒక్కసారైనా అసలైన శివాలయమునకు వెళ్లాలనుకొనేవారి కలల పంట ఈ వారణాసి.

మహాలక్ష్మీ దేవాలయం -కౌలాంపూర్

మహాలక్ష్మీ దేవాలయం -కౌలాంపూర్

వార్షికాదాయంను: వెల్లడి చేయలేదు

మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో పంచగంగా నదీ తీరంలో వెలసింది. దేవీ భాగవతంలో ఈ కొల్మాపూర్ ప్రస్తావన ఉంది. కోల్హాపూర్ పట్టణం చోళులు, పాండ్యుల మధ్య అంతర్యుద్ధానికి సాక్షిగా నిలబడింది. అష్టాదశ శక్తిపీఠాలలో కామ్యమోక్ష కారక పీఠంగా ఈ క్షేత్రం పేరుగాంచింది. ప్రళయకాలంలో కూడా లక్ష్మీ నారాయణులు ఈ క్షేత్రాన్ని విడువకుండా ఇక్కడే ఉంటారని విశ్వాసం . అందుకే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు కూడా వచ్చింది. కరవీరని వాసినిగా ఇక్కడి తల్లి పేరు పొందింది . ఈ ప్రాంత జగన్మాత కుడిచేత ఉన్నది కాబట్టి ప్రళయాతీతమైనదిగా భావించబడుతోంది. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మీ ఇక్కడ నివసించటం వలన ఆ దేవదేవుడైన శ్రీహరి నిరంతరం ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం.

శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

మన దేశoలో చాల కొద్ది ఆలయాలలో మాత్రమే శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవలిస్తునట్టుగా దర్సన మిస్తాడు.అలాంటి కొద్ది ఆలయాలలో నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇది నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉంది.నెల్లూరు పట్టణం మన రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన పట్టణాలలో ఒకటి.కాబట్టి ఈ ప్రాంతంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఈలాంటి అసౌకర్యం కలగకుండా దర్శించవచ్చు. బస్సు మరియు రైల్ సౌకర్యాలు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆలయానికి గాలిగోపురం ఒక ప్రత్యెక ఆకర్షణ.ఇది దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది.

English summary

14 Temples Around India That Have More Money Than Our Billionaires

Temple is a place of worship for Hindu devotees. And you can find en number of temples in this spiritual country. Every nook and corner, below the tree shades and near footpaths, you will find a big or small temple.
Desktop Bottom Promotion