Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
తిరుమల శ్రీవారి గురించి 10 నిజాలు: చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!
తిరుపతి లో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా శక్తి వంతమైన దైవం. వేడుకొనే భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీసుస్తూ సప్త గిరులపై వెలసియున్న కలియుగ దైవం.

తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారు ఉండరు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. జీవితంలో ఒక్క సారైనా తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని అంటుంటారు. తిరుమలను ఎన్నిసార్లు దర్శించినా శ్రీవారి ఆలయంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం..

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
1. శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారికి తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అసలు చిక్కు పడదని అంటారు.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
3. తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు అక్కడికి ప్రవేశం లేదు. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు రవిక కూడా వేసుకోరు. అక్కడి నుంచే స్వామికి వాడే పువ్వులు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, నెయ్యి, వెన్న తదితరాలన్నీ.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుంచి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
5. శ్రీవారికి ప్రతిరోజూ కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు రూ.50 వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను, పురుషులకు పంచెను అందిస్తారు. ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
6. గర్భగుడిలో నుంచి తీసివేసిన పువ్వులు అసలు బయటికి రావు. స్వామి వెనుక జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
7. శ్రీనివాసునికి వీపుమీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీ అలానే వస్తుంది.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
9. స్వామివారికి తీసేసిన పువ్వులు మరియు అన్ని పదార్థాలు పూజారి వెనక్కి చూడకుండా వెనుక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక్కి చూడరని అంటారు. ఆ పువ్వులన్నీ తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు (శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో) దగ్గర పైకి వస్తాయి.

చిక్కు పడని వెంకన్న కురులు.. వీపు వెనుక తడి.. సముద్రపు ఘోష..!ఇవన్నీ నిజమేనా..
10. స్వామి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియవు.

Click it and Unblock the Notifications