Latest Updates
-
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
భద్రాచలం: శీతారామ కళ్యాణోత్సవం మరియు పుష్కర సామ్రాజ్య పట్టాబిషేకం తేది మరియు ప్రాముఖ్యత
శీతారామ కళ్యాణోత్సవం మరియు పుష్కర సామ్రాజ్య పట్టాబిషేకం తేది మరియు ప్రాముఖ్యత
దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరంలో వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం స్థల పురాణం ప్రకారం మేరువు, మేకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తప్పస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం, సీత..లక్ష్మణ ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారు. ఇక్కడి శ్రీరామచంద్రుడిని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని , చతుర్భుజ రాముడని భద్రగిరి నారాయణుడని పిలుస్తారు.

పురాణాల ప్రకారం భద్రాచలం సమీపంలోని భద్రి రెడ్డి పాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్దలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెంచి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించి, తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం ..భద్రగిరిపై ఉన్నానని ..నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయండినని, నీకు సహాయకుడిగా మరో మహాపరమ భక్తుడు కూడా నిలుస్తాడని ఆదేశించారట!

చరిత్ర: వెంటనే దమ్మక్క గ్రామ పెద్దలకు తెలిపి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించి , అక్కడ పందిరి నిర్మించి, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామ నవమి నిర్వహిస్తున్నారని స్థలపురాణం చెబుతుంది. తర్వాత రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడన్న బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి).

ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది.

కళ్యాణం: ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ది చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతున్నది. అదే క్రమంలో ఈ సంవత్సరం మార్చి 30వ తేదీనా శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. గతంలో మాదిరిగానే కల్యానోత్సవంలో పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామలు పఠించనున్నారు. కల్యానోత్సవం, సామ్రాజ్య పట్టాబిషేకం వేడుకలకు హాజరవలేనివారు ఇప్పటి నుంచే www. bhadrachalamonline.com ద్వారాగానీ, రామాలయ కార్యాలయం ద్వారా పరోక్ష పూజా టికెట్లను పొందవచ్చు.



Click it and Unblock the Notifications