`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అహోయి అష్టమి, కార్వాచౌత్ కు ఉన్న వ్యత్యాసమేంటో తెలుసా...

|

కార్తీక మాసంలో క్రిష్ణ పక్షం యొక్క అష్టమి రోజున అహోయి అష్టమిని పండుగల జరుపుకుంటారు. అయితే ఇది మన దక్షిణ భారతదేశంలో కాదు.. ఉత్తర భారతదేశంలో. కార్వాచౌత్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత అహోయి అష్టమిని జరుపుకుంటారు.

ఈ సంవత్సరం ఈ పండుగ నవంబర్ 8వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు పార్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉంటారు.

ఈ పర్వదినాన చీకటి పడిన సమయంలో నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసాన్ని విడిచిపెడతారు. అంతవరకూ ఉపవాసం అలాగే కొనసాగిస్తారు. ఈ ఉపవాసం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సందర్భంగా అహోయి అష్టమి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. ఏ శుభ సమయంలో ఇది పాటించాలి.. అమ్మవారి ఆరాధాన ఎలా చేయాలి.. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళికి ముందే మీ ఇంట్లో నుండి ఈ వస్తువులను పడేయండి...

దీపావళికి ముందు..

దీపావళికి ముందు..

ఈ అహోయి అష్టమి పండుగను తమ పిల్లల శ్రేయస్సు కోరుతూ తల్లలుంతా ఉపవాసం ఉంటారు. దీపాల పండుగ అయిన దీపావళి ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.

రోజంతా ఉపవాసం..

రోజంతా ఉపవాసం..

ఈ అహోయి అష్టమి రోజున కార్వాచౌత్ వేళ ఎలా అయితే ఉదయాన్నే లేచి మట్టి కుండలో నీళ్లు పెట్టి అహోయి దేవతను ఆరాధిస్తారో.. ఈ సమయంలో కూడా అలానే అమ్మవారిని ఆరాధిస్తారు. అదే సమయంలో ఈరోజంతా ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు. ఈ పూజ సమయంలో (పూరి, హల్వా, చనా మొదలైనవి) నైవేద్యంగా సమర్పిస్తారు. చీకటి పడిన తర్వాత నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తారు.

తేడా ఏంటంటే..

తేడా ఏంటంటే..

అహోయి అష్టమి మరియు కార్వాచౌత్ యొక్క ఉపవాసం మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కార్వాచౌత్ రోజున చంద్రుడిని చూసిన అనంతరం ఉపవాసాన్ని ముగిస్తారు. అదే అహోయి అష్టమి రోజున మాత్రం నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసం ముగుస్తుంది.

అహోయి అష్టమి వ్రత కథ..

అహోయి అష్టమి వ్రత కథ..

పూర్వం ఏడుగురు కుమారులున్న సంపన్న దంపతులు ఉన్నారు. ఒకరోజు వీరు ఇంటి పని నిమిత్తం మట్టి తీసుకురావడానికి బయటకు వెళ్లారు. అక్కడ మట్టిని తవ్వుతున్నప్పుడు వారి గొడ్డలి పొరపాటున సింహం పిల్లపై పడి అది చనిపోయింది. అప్పుడు సింహ రాశి వారిని శపించింది. ఫలితంగా ఏడుగురు కుమారులు ఒక్క ఏడాదిలోనే చనిపోయారు. దీంతో దుఃఖం, నిరాశ ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆ దంపతుల బాధను చూసిన ఓ రుషి వారికి పశ్ఛాత్తాప చర్యలు ప్రారంభించాలని సూచించాడు. అప్పుడు వారు తమ ఇంటిని విడిచిపెట్టి అడవిలో నడుస్తూనే ఉన్నారు. అయితే వారెంత నడిచినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో వారు నిరాశ మరియు అలసటతో వారు ఏమీ తినకుండా ప్రాణాలను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. 6 రోజుల ఉపవాసం తర్వాత వారు ఒక దైవిక గొంతు విన్నారు. అప్పుడు అష్టమి రోజున అహోయి దేవతను ఆరాధించమని వినబడటంతో వారు కొంత ఓదార్పు చెందారు. అప్పుడు వారు ఇంటికి తిరిగొచ్చి ఉపవాసం ప్రారంభించారు. అప్పుడు వారి కుమారులు మళ్లీ తిరిగొచ్చారు. అప్పటి నుండి ఉత్తర భారతంలో తమ పిల్లల శ్రేయస్సు కోసం ఈ వ్రతం చేస్తారు.

శుభ ముహుర్తం..

శుభ ముహుర్తం..

అహోయి అష్టమి వ్రత తేదీ : నవంబర్ 8, 2020(ఆదివారం)

అహోయి అష్టమి పూజా ముహుర్తం : సాయంత్రం 5:31 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

అహోయి అష్టమి తేదీ ప్రారంభం : నవంబర్ 8, 2020 రోజున ఉదయం 7:29 గంటలకు

అష్టమి ముగింపు : నవంబర్ 9, 2020 సాయంత్రం 6:50 గంటలకు

పూజా విధానం..

పూజా విధానం..

అహోయి అష్టమి రోజున ఉపవాసం పాటించే వారు ముందుగా ఉదయాన్నే స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకుని, ఆలయ గోడపై బియ్యం సహాయంతో అహోయ్ మాతా మరియు ఆమె ఏడుగురు కుమారుల చిత్రాలు గీయాలి. ఇలా కుదరకపోతే.. మార్కెట్లో లభించే అహోయ్ మాతా చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు. ఆ దేవత ముందు ఒక పాత్రలో బియ్యం నింపండి. వాటితో పాటు ముల్లంగి, పండ్లను నీటిలో నింపండి. ఆ తర్వాత ఆ తల్లి చిత్రపటం ముందు దీపం వెలిగించండి. ఇప్పుడు తామరలో నీరు నింపండి. అప్పుడు అహోయ్ అష్టమి వ్రత కథను చదవండి. ఆ తర్వాత ఆ నీటిని దీపావళికి ముందు ఉపయోగించండి. ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలొస్తాయి...

English summary

Ahoi Ashtami 2020: Date, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

The Ahoi Ashtami puja muhurat is between 5:31 PM to 6:50 PM on November 8 as per the drikpanchang.
Story first published: Saturday, November 7, 2020, 11:54 [IST]