Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? ఏం తాగాలో, తినాలో తెలుసుకోండి!
దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. చాలామంది ఈ తొమ్మిదిరోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అంతేకాదు ఈ నవరాత్రుల్లో ఉపవాసలు కూడా చేస్తుంటారు. ఈ ఉపవాసల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఈ సమయంలో కొంతమంది ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. మరికొందరు మొదటి రోజు, చివరి రోజున ఉపవాసాలు పాటిస్తారు. అయితే, ఉపవాసం చేసేవారికి చాలామంది చాలా సందేహాలు ఉంటాయి. ఆ సమయాల్లో అసలు ఏం తాగొచ్చు. ఏం తాగకూడదు. ఏం తినాలి? ఏం తినకూడదు వంటి విషయాలపై సందిగ్ధత ఉంటుంది. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే ఈ ఆర్టికల్ తప్పనిసరిగా చదవాల్సిందే...
పానీయాలు సేవించొచ్చా..?
చాలామంది ఉపవాస సమయంలో టీ, కాఫీలు తీసుకోవచ్చా లేదా అనే భ్రమలో ఉంటారు. ఉపవాసం చేసేటప్పడు టీ, కాఫీలు తాగకూడదని కొందరు అంటుంటే, మరికొందరేమో ఉపవాస సమయంలో టీ, కాఫీలు తాగొచ్చని నమ్ముతారు. వాస్తవంగా చెప్పాలంటే, ఉపవాసం చేసేటప్పడు టీ తాగకూడదన్న నిభందన ఏమీ లేదు. చాలా మంది ఇలాంటి సమయాల్లో పానీయాలను సేవిస్తారు. టీ, కాఫీలు తాగొచ్చు. లేదంటే ఇతర పానీయాలను కూడా సేవించొచ్చని చాలామంది చెబుతున్నారు. పానీయాలను తాగాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

స్నాక్స్ తినొచ్చా..?
చాలామంది ఉపవాసం చేసేటప్పడు ఇతర స్నాక్స్ వంటి ఆహార పదార్థాలను తినొచ్చా లేదా అనే సందేహాంలో ఉంటారు. ఉపవాసంలో భాగంగా అనేక రకాల ఆహారాలను తినొచ్చని కొందరు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా పూల్ మఖానా, వేరుశెనగ పలుకులు, బాదం పప్పులు, జీడిపప్పు, బంగాళాదుంప చిప్స్ ను స్నాక్స్ గా ఆరగించొచ్చు. ఉపవాసం చేసేవారు రైస్ ఖీర్ లేదా కిచిడీ, సాబుదానా కిచిడీ వంటివి కూడా తయారు చేసుకుని తినొచ్చట. ఇక, ఇలాంటి తినలేము అని అనుకునేవాళ్లు ఫ్రూట్స్‌ని తీసుకోవచ్చు. వీటితోపాటు పాలు, పెరుగుతో తయారుచేసిన పదార్థాలను కూడా తీసుకోవచ్చు.
తినకూడనివి..
ఉపవాసం చేసేవారు కొన్ని ఆహారపదార్థాలను అస్సలు ముట్టుకోకూడదు. ఉపవాస సమయంలో వెల్లుల్లి, ముల్లంగి, ఉల్లిపాయ వంటివి అస్సలు తినకూడదని కొందరు చెబుతున్నారు. వీటిని ఉపవాస సమయంలో నిషిద్ధంగా భావిస్తారు. ఉపవాసం చేసేవారు గోధుమలు, బియ్యం, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి ఏ రకమైన ధాన్యాలను తినకూడదు. సాధారణ ఉప్పును కూడా ఉపవాసంలో ఉపయోగించకూడదని నిపుణులు అంటున్నారు. ఆవనూనె, అనేక రకాల మసాలా దినుసులు కూడా ఉపవాసదీక్షలో చేర్చకూడదని చెబుతున్నారు. వీటితో పాటు నవరాత్రుల్లో మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి.వాస్తవంగా చెప్పాలంటే ఉపవాసం రోజుల్లో చాలా సాత్విక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ఆహారం లేకపోవడం వల్ల పొట్ట ఖాళీగా ఉంటుంది. కాబట్టి, అలాంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పండ్లు అధికంగా తింటే మంచిది. మజ్జిగ తాగడం మాత్రం అస్సలు మరిచిపోవద్దు. అలాగే నిమ్మరసం వంటివి తాగుతూ ఉండాలి.



Click it and Unblock the Notifications