జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్పూరం వలన కలిగే ప్రయోజనాలు

Subscribe to Boldsky

హిందువులు నిర్వహించే రోజువారీ ఆరాధన లేదా పూజాప్రక్రియలలో భాగంగా అనేక పవిత్ర వస్తువులను కలిగి ఉంటుంది. దేశంలోని పూజా విధానాలలో అనేక విధానాలు అమలులో ఉన్నా, కొన్ని సారూప్యతలు, వాడే వస్తువులు హిందుత్వాన్ని ఐక్యం చేస్తుంది. వీటిలో ప్రతి ఒక్కవస్తువుకీ, హిందూ మతంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉందని నమ్ముతారు.

ఉదాహరణకు, నుదుటిపై తిలకంవలె ధరించే గంధం సాదు, మానసిక ప్రశాంతతను కలగజేయడమే కాక, చల్లదనం యొక్క అనుభూతిని ఇస్తుంది, తద్వారా వారు పూజ సమయంలో తమ దృష్టిని భగవంతుని మీద కేంద్రీకరించగలుగుతారు. అదేవిధంగా, పూలు, నైవేద్యం, పంచ పాత్ర, హారతి పళ్ళెం, దీపపు స్తంభాలు వంటి అనేకములైన వస్తువులు, విగ్రహాలు మొదలైనవి ఏవైనా, ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

As Per Astrology These are the Benefits Of Camphor

చివరికి దేవునికి పెట్టే నైవేధ్యాలలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఇష్ట దైవం ప్రకారం, ఆ దైవానికి నచ్చిన పదార్ధాలను నైవేద్యంగా ఉంచడం కూడా హిందువుల ఆనవాయితీ.

దైవస్థానంలోని గంటని కొట్టడం ద్వారా జనించే ధ్వని మరియు కంపనాలు ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతాయి. అదేవిధంగా కర్పూరం కూడా ఈ అంశాలలో ఒకటిగా ఉంది. ఈరోజు, కర్పూరం – దాని ప్రాముఖ్యత గురించిన వివరాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.

ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది:

ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది:

హారతి లేకుండా పూజ ఎన్నటికీ పూర్తి కాదు. కర్పూర హారతి, పర్యావరణంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులను మరియు మలినాలను తొలగిస్తుందని నమ్ముతారు. తద్వారా, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొని సానుకూల పవనాలు వీస్తాయని, క్రమంగా ఆర్ధిక, ఆరోగ్య పరిస్థితులు నిలదొక్కుకుంటాయన్ననమ్మకం హిందువులది.

కాలసర్ప దోషానికి / పితృ దోషానికి నివారణా మార్గంగా .. !

కాలసర్ప దోషానికి / పితృ దోషానికి నివారణా మార్గంగా .. !

తప్పు స్థానాలలో కేంద్రీకరించబడిన నక్షత్రాలు లేదా గ్రహాల యొక్క కొన్ని స్థితి గతుల కారణంగా జన్మ కుండలిని చార్టు ప్రకారం, అనేక మంది ప్రజలు కాల సర్ప దోషం మరియు పితృ దోషాల కారణంగా అనేక ఆరోగ్య, ఆర్ధిక సంబంధాల వ్యవహారాలతో అనేక బాధలు పడుతున్నారు.

ఇంటిలో రోజులో మూడుసార్లు నేతిలో ముంచిన కర్పూరం వెలిగించడం ద్వారా అటువంటి ప్రతికూల ప్రభావిత అంశాలు దూరమవుతాయని పెద్దల మాట. అంతేకాకుండా, బాత్రూంలో ఒక ఘనాకారంలోని కర్పూరాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరమైన లక్షణాలను కలగజేస్తుంది. దోషాలు తొలగి జీవన మార్గం సుగమం అవుతుందని నమ్మకం.

దైవానుగ్రహం కోసం:

దైవానుగ్రహం కోసం:

సూర్యాస్తమయం సమయంలో కర్పూర హారతిని ఇవ్వడం దేవతలకు సంతోషదాయకంగా ఉంటుందని, మరియు ప్రతిరోజూ అలా హారతి ఇచ్చే వారికి ఆర్ధిక శ్రేయస్సును కలుగజేస్తారని నమ్మకం. అందువలన, సాయంత్రం ప్రార్ధనల సమయంలో కర్పూర హారతి ఖచ్చితంగా ఉండాలని సూచిస్తుంటారు. తద్వారా రోజంతా సంచితం చేయబడిన ప్రతికూలత దూరంగా పోతుంది మరియు గృహంలో శాంతి నెలకొంటుంది.

ప్రమాదావకాశాలను తగ్గిస్తుంది:

ప్రమాదావకాశాలను తగ్గిస్తుంది:

ప్రతిరోజూ కర్పూరం వెలిగించే వారింట ఊహించని రీతిలో మరణాల అవకాశాలు తగ్గుముఖం పడుతుందని చెప్పబడింది. ముఖ్యంగా ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్యపై ఈ ప్రభావం ఉంటుంది. ప్రతిరోజూ హనుమాన్ చాలిసాను చదివిన తర్వాత దేవునికి హారతి కర్పూరం ఇవ్వవలసినదిగా పెద్దలు సూచిస్తుంటారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే, నిద్రకు ఉపక్రమించే ముందు సమయం ఒక కర్పూరాన్ని వెలిగించవలసినదిగా సూచిస్తుంటారు. క్రమంగా ప్రమాదం ద్వారా మరణాలు సంభవించే అవకాశాలు తగ్గుతాయి.

పీడకలలు వదిలించుకోవటం సహాయపడుతుంది:

పీడకలలు వదిలించుకోవటం సహాయపడుతుంది:

మీరు తరచూ పీడకలలను ఎదుర్కొంటూ ఉన్నారా?, కర్పూరం వెలిగించడం మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. పర్యావరణం నుండి హానికరమైన సూక్ష్మజీవులను తొలగించగలిగే కర్పూరం, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి, పీడకలలను దూరంగా ఉంచగలుగుతుంది. క్రమంగా కొన్ని మానసిక సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

ఆర్ధిక పురోగతికి సహాయం :

ఆర్ధిక పురోగతికి సహాయం :

వీటన్నింటితో పాటు, కర్పూరాన్ని ప్రతిరోజూ వెలిగించే వారు ఆర్ధిక పురోగతిని పొందగలడని చెప్పబడింది. ఒక గులాబీని తీసుకొని, దానిలో ఒక చిన్న కర్పూరాన్ని వెలిగించండి. తరువాత దుర్గాదేవి పాదాల చెంత ఆ గులాబీని ఉంచి పూజించాలి. 43 రోజులు నిలకడగా ఈ పద్దతిని అనుసరిస్తే ఆర్ధికంగా పురోగతి చెందడంలో సహాయపడుతుంది. ఆర్ధిక దోష నివారణా మార్గాలు దుర్గాదేవితో సంబంధం కలిగి ఉన్నందున, ఇది నవరాత్రులలో కూడా చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలకై పండితుని సంప్రదించడం మేలు.

కర్పూరం వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది:

కర్పూరం వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది:

ఇంటి నిర్మాణం లేదా ఏదేని భవన నిర్మాణం వాస్తు ప్రకారం నిర్మించబడకపోయినా, అది వ్యక్తిగతంగానే కాకుండా, ప్రజల వృత్తిపరమైన జీవితాలలో కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. దీనిని వాస్తు దోషం అని పిలుస్తారు. వాస్తు ప్రకారం తప్పుగా నిర్మించబడిన గదిలో మీరు కర్పూరం వెలిగిస్తూ ఉంటే, అది వాస్తు దోషాన్ని తొలగించడంలో సహాయం చేస్తుందని నమ్ముతారు. మరియు మంచి వాస్తు శాస్త్ర నిపుణుడి సలహాతో, సరైన రీతిలో వాస్తు దోష నివారణా చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యం.

జన్మకుండలినిలోని ఇతర దోషాలను కూడా తొలగిస్తుంది:

జన్మకుండలినిలోని ఇతర దోషాలను కూడా తొలగిస్తుంది:

నీటిలో, కొన్ని చుక్కల కర్పూరం నూనెను, మరియు కొన్ని చుక్కల జాస్మిన్ నూనెను జోడించి స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుంది. ప్రతి శనివారం, ఈ పద్దతి అనుసరించడం ద్వారా రాహు కేతు శని దోషాలు మరియు వాటి ప్రతికూల ప్రభావాలను తొలగించగలదని నమ్ముతారు.

కర్పూరం సంబంధాలను బలపరుస్తుంది:

కర్పూరం సంబంధాలను బలపరుస్తుంది:

గది యొక్క మూలల్లో రెండు కర్పూర బిళ్ళలను ఉంచడం ఒక జంట మధ్య సంబంధాలను పెంచుతుందని నమ్మకం. అందువల్ల, తరచుగా అర్ధం లేని వాదనలు, గొడవలు నిత్య కృత్యాలైన సంబంధంలో ఈ పద్దతిని పాటించడం మేలని చెప్పబడింది. కుటుంబంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు, కోపావేశాలు తగ్గడం కూడా గమనించవచ్చు.

అధిక ఖర్చులను తగ్గించేలా కర్పూరం సహాయపడుతుంది

అధిక ఖర్చులను తగ్గించేలా కర్పూరం సహాయపడుతుంది

కొన్నిసార్లు, ఒక వ్యక్తి జన్మించిన సమయంలో గ్రహాల స్థానాల కారణంగా, వారి జీవితంలో ఖర్చులు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, సంపద క్షీణత గురించిన ఆలోచనలతో మానసిక, శారీరిక అనారోగ్యాలకు కూడా గురవుతూ ఉంటారు. ఈ సమస్యను సరిచేయడానికి, సాయంత్రం భోజనం తర్వాత వంటగదిలో ఒక వెండి గిన్నెలో కర్పూరం మరియు లవంగాలను మండించడం మంచిదిగా చెప్పబడింది. ప్రతి రోజూ రాత్రి, వంటగది శుభ్రం చేసిన తర్వాత ఈ పద్దతిని పాటించడం మేలని సూచించబడినది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆధ్యాత్మిక, రాశిచక్ర, హస్త సాముద్రిక తదితర అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    As Per Astrology These are the Benefits Of Camphor

    Camphor drives away negative energy and brings peace in the environment. It can be used as a remedy for the Vastu Dosha by placing a few cubes in the room which is constructed wrongly as per the vastu. It is also said that it removes the negative effects caused by Pitra Dosha, Kalsarpa Dosha, etc.Astrological Benefits Of Camphor
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more