Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
Sankranti 2025: సంక్రాంతి జరుపుకోవడానికి అసలైన, శుభ సమయం ఇదే.. ఈ సమయంలో జరుపుకుంటే తిరుగుండదు!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండగ వచ్చేసింది. 2025లో ఈ సంక్రాంతి పండుగను జనవరి 14వ తేదీ మంగళవారం నాడు జరుపుకుంటున్నారు. ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. యావత్ భారత దేశంలో ఈ సంక్రాంతి పండగను జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను అత్యంత ఘనంగా, శోభాయమానంగా జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతి పండగను ఏ సమయంలో జరుపుకోవాలి? సంక్రాంతి జరుపుకోవడానికి మంచి ముహూర్తం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంక్రాంతి జరుపుకోవడానికి శుభ ముహూర్తం
సంక్రాంతి జరుపుకోవడానికి కొన్ని శుభ ముహుర్తాలు ఉన్నాయి. స్నానం దానం చేయడానికి కొన్ని ఘడియలు ఉన్నాయి. సంక్రాంతి పండగ నాడు ఉదయం 9:03 గంటలకు నుంచి సాయంత్రం 05:46 గంటల వరకు సంక్రాంతి స్నానాలు చేయొచ్చు. అలాగే ఇదే సమయంలో దానం చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఎవరైనా వ్యక్తి దానం చేస్తే ఆ జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వారి జీవితం మారిపోతుంది.

మహాపుణ్య కాలం:
సంక్రాంతి పండగ నాడు మహాపుణ్యకాలం ఉదయం 9:03 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్య దేవునితో పాటు శ్రీ విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ మహాపుణ్యకాలంలో శ్రీ విష్ణువును పూజించడం వల్ల వెయ్యి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే శ్రీవిష్ణు, సూర్య దేవుళ్ళ అనుగ్రహం మీపై ఉంటుంది. వారి అనుగ్రహం వలన జీవితంలో కస్టాలు తొలిగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి.
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు?
సంక్రాంతిని జరుపుకోవడానికి చాలా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సూర్యుడు దక్షిణాయనంలోని ధనుస్సు రాశి నుంచి ఉత్తరాయణంలోని మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండగ కాలచక్రంలో మార్పులు, పాడి పంటల్లో భోగ భాగ్యాలను సూచిస్తుంది.
ఈ సంక్రాంతికి మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఈ పండగను సాంప్రదాయబద్దంగా కుటుంబ సమేతంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ నాడు పట్టణాల్లో ఉండే వ్యక్తులు సైతం పల్లెటూర్లకు వెళ్లి పూజలు చేసి, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతిని జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారు?
సంక్రాంతిని మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తొలిరోజు భోగి మంటలు వేసి.. అందులో పాత వస్తువులను, పాత బట్టలను కాల్చేసి పాత కష్టాలకు, చేదు జ్ఞాపకాలకు బాయ్ చెబుతారు. అలాగే తమ జీవితంలో కొత్త మార్పులు రావాలని, కొత్త కొత్త లాభాలు చేకూరాలని కోరుకుంటారు.
రెండోరోజు సంక్రాంతి జరుపుకుంటారు. ఈరోజున పొంగల్ వండడం, పితృతర్పణం చేయడం, నది స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇక మూడో రోజు కనుమ జరుపుకుంటారు. ఈ కనుమ నాడు మాంసాహారం తీసుకొచ్చి.. ఇంటికి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు. అలాగే ఆరోజున ఇంట్లోని పశు పక్షాదులకు పూజలు నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications











