Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.!
Bonalu 2023: పోతురాజు అంటే ఎవరు? వీళ్లు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఆది, బుధవారాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా, ఎంతో అట్టహాసంగా బోనాల జాతర జరుగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం అంతా సంబరాల్లో మునిగిపోతుంది.
గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ సహా ఇతర అమ్మలకు బోనాలు సమర్పిస్తుంటారు. అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంల వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు. అసలు ఈ పోతురాజులు ఎవరు, బోనాల్లో వీళ్ల ప్రాముఖ్యత ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోతురాజు ఎవరు?
శివపార్వతులు ఓ రోజు వన విహారానికి వెళ్తారు. అక్కడ పార్వతీ దేవి కొలనులో నుంచి ఏడు దోసిళ్లతో నీళ్లు తీసుకుని తాగుతుంది. అప్పుడు సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుడతారు. నీళ్లు తాగితే పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోయిన పార్వతీ దేవి.. పరమ శివుడి వద్దకు వెళ్లి విషయం చెబుతుంది. తన వల్లే జన్మించిన ఆ ఏడుగురు కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకెళ్దామని పరమేశ్వరుడిని ప్రాధేయపడుతుంది. పార్వతీ దేవిని వద్దని వారించిన శివుడు.. వారి జన్మల వెనక అసలు రహస్యం ఏంటో వివరిస్తాడు.
ఆ ఏడుగురు కుమార్తెలు స్వతంత్ర ప్రవృత్తితో ఉంటారని, అందుకే వారిని వదిలేసి మనం వెళ్లిపోదామని పార్వతీ దేవితో చెబుతాడు. మరి వారికి రక్షణ కల్పించేది ఎలా, వారిని కంటికి రెప్పలా చూసుకునేది ఎవరూ అని పార్వతీ దేవి అడగ్గా.. పరమేశ్వరుడు ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు. ఆ ఏడుగురిని పోతురాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి అదృశ్యమవుతారు. అప్పటి నుంచి ఆ ఏడుగురికి పోతురాజు కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ ఏడుగురి పేర్లు పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ వివిధ పేర్లతో ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకుని భక్తులు పూజిస్తుంటారు.
బోనాల రోజు పోతురాజులకు ఉపవాసమే:
ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర వేళ పోతురాజులు కన్పిస్తుంటారు. పోతురాజులుగా కొందరు వ్యక్తులు వేషాధారణతో గంభీరంగా, భీతి కొలిపే రీతిలో వేషాధారణతో కన్పిస్తారు. భారీ శరీరంతో, గుబురు మీసం, గడ్డంతో, నాలుక బయట పెట్టి, భయంకరమైన కళ్లతో పోతురాజులు కన్పిస్తారు. ఈ పోతురాజుల వేషం వేసే వారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి అలంకరణ సామగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుని బోనాల వద్దకు వెళ్తారు. ఈ వేషంలో ఉన్నప్పుడు ఘన పదార్థాలు తీసుకోరు. కొందరు శక్తి కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు సేవిస్తారు.
పోతురాజుల అలంకరణ:
ఒకప్పుడు పసుపులో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా పూసుకునే వారు పోతురాజులు. తర్వాత్తర్వాత వివిధ రంగులు, రకరకాల బొట్లు, కళ్లకు భయంకరమైన లెన్సులు, విచిత్రమైన వేషాధారణతో కన్పిస్తున్నారు. చెమటకు, వానకు ఒంటికి వేసుకున్న పసుపు చెదిరిపోతుందని పసుపు స్థానంలో రంగులు పూసుకుంటున్నారు చాలా మంది.
చేతిలో ఈరకోల:
పోతురాజుల చేతుల్లో కొరడా, ఈరకోల ఉంటాయి. కొరడా ఝుళిపిస్తూ వాళ్లు ఆడే ఆట చూడటానికి చాలా మంది వస్తుంటారు. అయితే ఈ కొరడాను ఈరకోల అని పిలుస్తుంటారు. కొరడాను శిక్షించేందుకు వాడే వారు. అయితే ఈరకోల కాస్త భిన్నం. బోనాల జాతర వేళ పోతురాజుల వద్దకు వచ్చిన మెడలో ఈరకోల వేయించుకుంటారు. చిన్న పిల్లలకు ఈరకోల వేయిస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని భక్తుల విశ్వాసం,
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications