Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అప్పుల బాధలోంచి తొందరగా బయటపడాలంటే.. ఈ పరిహారం చేయండి..!
అప్పు చేసి పప్పు కూడా సామెత మనకు తెలిసిందే. అప్పులు చేసి విపరీతమైన కష్టాలను పడుతుంటారు. అప్పు తీర్చలేక అష్టకష్టాలు పడుతుంటారు. అప్పు తీర్చడానికి ఇంట్లో వున్న బంగారాన్ని తాకట్టుపెడుతుంటారు. వాటిని విడిపించుకోలేక మరింత అప్పుల ఊబిలో ఇరుక్కు పోతుంటారు. హిందూ శాస్త్రంలో అన్ని సమస్యలకూ పరిష్కారం వుంది. ఈ అప్పుల బాధ పోవాలంటే కూడా పండితులు పరిహారం చెప్పారు. ఈ అప్పులు తీరాలంటే పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం.
రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్. మంగళవారం రోజు మాత్రమే ఈ రుణవిమోచన అంగారక స్త్రోత్రాన్ని పారాయణం చేస్తే. మంగళవారమంటే అంగారకుడికి చాలా ఇష్టం. సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఈ స్త్రోత్రాన్ని పారాయణం చేయాలి. స్నానం చేసే నీళ్లల్లో ఎర్రని కుంకుమను, ఎర్రను కందులు కలుపుకోవాలి. ఈ నీళ్లతో స్నానం చేయాలి.

తరువాత ఎర్రని వస్త్రాలు ధరించాలి. అంగారకుడికి ఎరుపు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఎర్రని కుంకుమని నుదుటన ధరించాలి. దక్షిణంవైపు తిరిగి అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఎర్రని గిన్నెలో కందులు వేసుకోవాలి. దానిపై ఎర్రని పుష్పాన్ని పెట్టి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
ముందుగా "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే" అనే మంత్రాన్ని పఠించాలి. అని మంత్రాన్ని పఠించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. తరువాత దీపాన్ని వెలుగించుకొని, అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయాలి. బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి.

నైవేద్యం పెట్టిన తరువాత కింద వున్న ఈ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
స్కంద ఉవాచ
రుణగ్రస్త నరాణాంతు రుణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మొవాచ
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ రుషిః అను ష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ రుణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్
రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః ||
మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రధః ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పరేత్ |
రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోస్తుతే మమాశేష రుణమాశు వినాశయ ||
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపధీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా టు మంగళాహనీ సర్వదా ||
ఏకవింశతి నామాని పఠిత్వాతు తదండకె |
రుణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః ||
తాశ్చ ప్రమార్జాయేత్పశ్చత్ వామపాదేన సంస్పృశత్ |
మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల |
నమోస్తుతే మహాశేషరుణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహూ రుణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోటి హ్యపరో ధనదో యథా |
అర్ఘ్యం
అంగారక మహీపుత్ర భగవన్ భక్త వత్సల |
నమోస్తుతే మమాశేరుణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గ్రహాణార్ఘ్యం నమోస్తుతే ||
పైన వున్న ఈ స్తోత్రాన్ని మొత్తం 21 సార్లు పారాయణం చేయాలి. 21 పూలను తీసుకొని ఒక్కో పువ్వును సమర్పిస్తూ అంగారకుడికి సమర్పించాలి. పువ్వులను సమర్పిస్తున్నప్పుడు 21 అంగారక నామాలను పఠించాలి. ఓం మంగళాయ నమ:, ఓం భూమి పుత్రాయ నమ:, ఓం రుణ హస్త్రే నమ:, ఓం ధన ప్రదాయ నమ:, ఓం స్థిరాసనాయ నమ:, ఓం మహాకాయాయ నమ:, ఓం సర్వకామ ఫల ప్రదాయ నమ:, ఓం లోహితాయ నమ:, ఓం లోహితాక్షాయ నమ:, ఓం సామగాన కృపాకరాయ నమ:, ఓం ధరాత్మజాయ నమ:, ఓం కుజాయ నమ:, ఓం భౌమాయ నమ:, ఓం భూమిజాయా నమ:, ఓం భూమినందనాయ నమ:, ఓం అంగారకాయ నమ:, ఓం అంగారకాయ నమ:, ఓం యమాయ నమ:, ఓం సర్వరోగాయపహారకాయ నమ:, ఓం స్రష్టే నమ:, ఓం కర్తృే నమ:, ఓం హర్త్రే నమ:, ఓం సర్వదేవ పూజితాయ నమ:
ఈ 21 నామాలను చదివి పూలను సమర్పన చేసుకోవాలి. తరువాత బెల్లం పానకాన్ని ప్రసాదంగా తీసుకుంటే పరిహారం పూర్తయినట్టే. అయితే 21 రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడతారు. ఒక వేళ పడకపోతే 41 రోజుల పాటు ఈ పరిహారం చేస్తే తప్పక ఫలితం వుంటుంది.



Click it and Unblock the Notifications