Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గురుడ పురాణం పుస్తకం మీ ఇంట్లో వుందా..? ఐతే..!!
అష్టాదశ పురాణంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరెంతో ప్రత్యేకత ఉంది. మిగతా పురాణాలు చదివినంతగా గరుడపురాణాన్ని చదవడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడ పురాణం వల్ల వారికి ఉన్న అపోహ అని చెప్పవచ్చు. ఈ పురాణంలో గురుత్మండికి శ్రీ మహావిష్ణువు సమాధానాలను చెబుతాడు. ఆత్మ దేహం వదిలిన తరువాత చేసే ప్రయాణం గురించి ఈ పురాణం గురించి స్పష్టంగా చెప్పింది. ఈ కారణంతో కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ కర్మల సమయంలో గరుడ పురాణం చదవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సమయంలో తమ కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయ్. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసినవే.

ఇప్పుడు ఎవరైనా చనిపోతే గరుడపురానాన్ని చదవాలనే విషయాన్ని పక్కన పెట్టేశారు. గరుడ పురాణం చదివితే ఎవరైనా చనిపోతారేమోనన్న అనుమానమే ఎక్కువగా అందరినీ వెంటాడుతుంది. ఈ కారణంగానే గరుడ పురాణం ఎవ్వరి ఇంట్లో కనిపించకుండా పోయింది, ఎవరి నోట కూడా వినిపించకుండా పోయింది. నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవచ్చని పండితులు చెబుతున్నారు. దీన్ని చదవడం వల్ల ఎలాంటి హాని, అశాంతి కలగదని అంటున్నారు.
కొన్ని పనులను చేయవద్దని గరుడ పురాణం మనకు చెబుతోంది. బ్రహ్మ హత్య, శిశువు హత్య, గో హత్య, స్త్రీ హత్య, పాపపు పనులు చేసేవారు, ధనాన్ని హరించేవారు కూడా నరకంలో శిక్ష అనుభవించాల్సి వుంటుందని గరుడ పురాణం చెబుతోంది. అప్పులు తీర్చని వారు, ద్రవ్యాన్ని అపహరించే వారు, విశ్వాస ఘాతుకులు, ఇతరులను హత్య చేసేవారు, మంచి వారిని నిందించే వారు, రుణ గ్రస్తులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేసే వారు కూడా పాపులే. గరువులను, దేవతలను నిందించే వారు యమలోకంలో దక్షిణ మార్గాన నడవాల్సి వుంటుందని గరుడ పురాణం చెబుతోంది.
పెద్దల హితోపదేశాలను వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు కొందరైతే ఇంకా నీచ పనులు చేసేవారు మరికొందరు వున్నారు. తల్లిదండ్రులను, గోవులను, ఆచార్యులను గౌరవించేవారు, భార్యను ద్వేశించి విడిచిపెట్టేవారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునే వారు, దానం ఇచ్చి బాధపడేవారు, పశువులకు మేత లేకుండా చేసేవారు, పశు హత్య చేసేవారు యమలోకానికి వెళ్లక తప్పదు.
యమరాజు ఆఘ్నలను పాటించి యమభటులు వైతరని నదిలో తోసివేస్తారు. అబద్ధపు సాక్షం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పూలతోటలను ధ్వంసం చేసేవారు యమలోకానికి తప్పక వెళ్లాల్సిందేనని గరుడ పురాణం చెబుతోంది. ప్రతీ వ్యక్తికి పాపభీతి ఉండాలి. భయం లేకపోతే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే రుషులు ముందుగానే పురాణాన్ని రచించి మానవజాతికి అందించారు. ఈ గరుడపురాణం వల్ల భయం ఏర్పడుతుంది. మనిషిని సన్మార్గంలో నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు మనల్ని అంతగా భయపెట్టారు. గరుడపురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయ్. మనిషి, మనిషిగా బతకాలంటే గరుడపురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. మనుషులను సన్మార్గంలో పయనించేలా మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంధం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు.



Click it and Unblock the Notifications