Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
ఉద్యోగం దొరకడం లేదా..? అయితే ఈ మంత్రాన్ని పారాయణం చేస్తే ఫలితం మీరే చూస్తారు..!!
ఉద్యోగం పురుషు లక్షణం. ఇంట్లో మగవారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఇంట్లోకి డబ్బులు తెచ్చినప్పుడు మాత్రమే భార్య దగ్గర, తల్లిదగ్గర, బంధువుల దగ్గర అతడికి గౌరవ మర్యాదలు, విలువ ఉంటాయ్. ఉద్యోగం చేయకుండా ఖాలీగా ఉన్న వారికి అస్సలు విలువ అనేది ఉండదు. పూర్వం కేవలం పురుషులు మాత్రమే ఉద్యోగం చేసే వారు. ఇప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాలు లేకుండా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పరిహారం చేస్తే ఉద్యోగం లభిస్తుందో పండితులు చక్కగా వివరించారు. ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం.

ఉద్యోగం లభించాలంటే కార్య సిద్ది హనుమాన్ మంత్రాన్ని జపించాలి. కార్య సిద్ధి హనుమాన్ మంత్రాన్ని జపించి ఉద్యోగం పొందిన వారు చాలా మంది ఉన్నారు. దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఉదయాన్ని స్నానం చేసి ప్రతీ రోజు దేవాలయానికి వెళ్లి ఈ కార్య సిద్ది హనుమాన్ మంత్రాన్ని పారాయణం చేయాలి. అయితే చాలా మందికి ఇంటికి దగ్గర్లో హనుమాన్ మందిరం లేకపోవచ్చు. అలాంటి వారికి లలితా సహస్రనామంలో 143వ శ్లోకం, 144వ శ్లోకం విడిచిపెట్టకుండా ఎవరైతే 41 రోజులు పారాయణం చేస్తారో అలాంటి వారికి కచ్ఛితంగా ఉద్యోగం లభించి తీరుతుంది.
ప్రతీ ఇంట్లో లలితా అమ్మవారి ఫోటో కచ్ఛితంగా ఉండాలి. లలితా అమ్మవారి. మనకు దేవతలు, పరమేవ్వరుడు, గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, ఇలా అందరు దేవతలు ఆ ఫోటోలు లలితా దేవి దగ్గర చూడవచ్చు. లలితా దేవి మహాశక్తివంతమైన దేవత. శుక్రవారం రోజు మాత్రమే ఈ పారాయణాన్ని ప్రారంభించాలి. ఆరోజున సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి, స్నానం చేసి ఉతికి ఆరేసిన వస్త్రాలను కట్టుకోవాలి. మగవారు ఈ 41 రోజులు ప్రతీ రోజూ తలస్నానం తప్పనిసరిగా చేయాలి.
అమ్మవారి ముందు పీట మీద కూర్చోవాలి. నేల మీద ఎట్టిపరిస్థితిలో కూర్చోవద్దు. అమ్మవారికి ఎర్రని పూలతో పూజించాలి. గులాబీ పువ్వులైనా లేక మందారం పువ్వులతో అయినా పూజించాలి. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. కలకండ, లేదంటే అటుకులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 108 సార్లు ఈ స్తోత్రాలను పారాయణం చేయాలి. 5 నుంచి 5.30 గంటల మధ్య పారాయణం చేయాలి.
మీ మనసులో ఉన్న సంకాల్పాలను అమ్మవారితో బలంగా చెప్పుకోవాలి. అప్పుడు అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది. 41 రోజులు ఇది పారాయణం చేయాలి. స్త్రీలు కూడా 41 రోజులు పారాయణం చేయాలి. అయితే మధ్యలో రుతుదోశం ఉన్నప్పుడు 5 రోజులు విడిచిపెట్టి పారాయణం చేసుకోవాలి.
లలితా సహస్రనామంలో ఉన్న శ్లోకాలు ఇవే :
143) భవదావ సుధావృష్టిః పాపారణ్య దవానలా దౌర్భాగ్యతూలా వాతూల జరాధ్వాంత రవి ప్రభా
144) భాగ్యబ్ది చంద్రికా భక్త చిత్తకేకి ఘనాఘనా రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారికా
పారాయణం చేస్తున్న రోజుల్లో మాంసాహారాన్ని తినవద్దు. బాగా చదివినా ఉద్యోగం రానివారికి మాత్రమే ఈ పారాయణం పనిచేస్తుంది. కేవలం పారాయణం చేసి ఏ ప్రయత్నం చేయకపోతే లాభం ఉండదు. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అమ్మవారి ఈ శ్లోకాలను పారాయణం చేస్తే కచ్ఛితంగా ఉద్యోగం దక్కి తీరుతుంది.



Click it and Unblock the Notifications