Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
Char Dham Yatra 2023: ప్రతి గుళ్లో చేసే పనిని బద్రీనాథ్ ఆలయంలో చేయడం నిషేధం, అదేంటో తెలుసా?
దేశంలో అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో ఎండాకాలోల చార్ ధామ్ యాత్ర ఉంటుందన్న విషయం తెలిసిందే. హిమాలయాల్లో ఉండే ఈ దివ్య క్షేత్రాలు చలికాలంలో మంచుతో కప్పబడిపోతాయి. ఆ సమయంలో ఈ ఆలయాలను మూసేసి, వేసవికాలంలోనే తెరుస్తారు.
చాలా మంది వెళ్లాలని కోరుకునే తీర్థయాత్రల్లో చార్ ధామ్ ముందుంటుంది. ఇదో అడ్వెంచర్ లా సాగుతుంది. హిమగిరుల్లో, ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ, ఎత్తైన శిఖరాలు అధిరోహిస్తూ ఈ యాత్ర సాగుతుంది. అయితే చార్ ధామ్ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన, అమేజింగి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చార్ ధామ్‌లో కేదార్‌నాథ్ లేదు, అయితే..:
ప్రధాన చార్ ధామ్, చోటా చార్ ధామ్‌లు రెండు వేర్వేరు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రధాన చార్ ధామ్‌లో రామేశ్వరం, పూరీ జగన్నాథ ఆలయం, ద్వారకా, బద్రీనాథ్ ఆలయాలు ఉంటాయి. చోటా చార్ ధామ్‌లో బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలు ఉంటాయి. చాలా మంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు తెలియవు. చోటా ధామ్‌లో ఉండే ఆలయాలన్నీ ఉత్తరాఖండ్‌లోనే ఉంటాయి.
బద్రీనాథ్‌లో శంఖం ఊదడం నిషేధం:
దాదాపు ప్రతి దేవాలయంలో శంఖం ఊదడం తెలిసిందే. అయితే బద్రీనాథ్‌లో మాత్రం శంఖం ఊదడంపై నిషేధం ఉంది. పురాణాల ప్రకారం కేదార్‌నాథ్్ యొక్క ఇద్దరు రాక్షసుల్లో ఒకరు తన ప్రాణాలు కాపాడుకోవడానికి శంఖంలో దాక్కున్నాడని, శంఖం ఊదడం వల్ల ఆ రాక్షసుడు బయటకు వస్తాడని అందుకే శంఖం ఊదడంపై ఇక్కడ నిషేధం విధించారని చెబుతారు. ఇతర శాస్త్రీయ కారణాల వల్ల కూడా బద్రీనాథ్‌లో శంఖం ఊదడం నిషేధం.
సూర్య కుండ్:
యమునోత్రికి సమీపంలో ఉన్న ఈ వేడి నీటి బుగ్గ పవిత్ర జలమని నమ్ముతారు. ఈ నీటితోనే 'ప్రసాద్' తయారు చేస్తారు. సూర్య కుండ్ చుట్టూ మంచు హిమనీనదాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వేడి నీరు ఉంటుంది. ఇక్కడి నీరు 88 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉంటాయి.
బద్రీనాథ్ పేరు ఎలా వచ్చిందంటే:
పురాణాల ప్రకారం బద్రీనాథ్ ధామ్ చెట్లతో నిండి ఉండేది. విష్ణువు అక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద బృడి చెట్టు నీడలో ధ్యానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ చెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని అంటారు. అలా ఆ క్షేత్రానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.
బద్రీనాథ్ ఆనాటి బౌద్ధ యూత్రాస్థలం:
బద్రీనాథ్ దేవాలయం బౌద్ధ నిర్మాణశైలిలో ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం ప్రస్తుతం ఉన్న ప్రదేశం 8వ శతాబ్దానికి ముందు బౌద్ధ యాత్రా స్థలంగా పరిగణించేవారు.
పాండవులు నిర్మించిన ఆలయం:
ప్రస్తుతం ఉన్న ఆలయానికి పక్కనే ఉన్న కేదార్‌నాథ్ ప్రారంభ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆస్తి కోసం, రాజ్యం కోసం సొంత సోదరులను చంపామన్న అపరాధభావంతో పాండవులు మోక్షం కోసం కైలాసానికి వెళ్తారు.
ఎద్దు వేషంలో దాక్కున్న శివుడిని ఎట్టకేలకు భీముడు గుర్తించాడు. భీముడు శివుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన వీపు భాగాన్ని వదిలిపోయాడు. అలా నేటికీ కేదార్‌నాథ్‌లో శివుడిని ఎద్దు రూపంలోని వెనక భాగాన్ని పూజిస్తారు.



Click it and Unblock the Notifications