Latest Updates
-
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్!
Char Dham Yatra 2023: మొదలు కాబోతున్న చార్‌ధామ్ యాత్ర.. తేదీలు, హెలికాప్టర్ సర్వీసు వివరాలు
వేసవి కాలం వస్తోంది, గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్- మే నెలల్లో వేసవి కాలంలో చార్ ధామ్ యాత్ర ఉంటుంది. భక్తులు, యాత్రికులు ఏప్రిల్ - మే నుండి అక్టోబర్- నవంబర్ వరకు చార్ ధామ్ యాత్రకు వెళ్లొచ్చు. చలికాలం ప్రవేశించగానే ఇక్కడి ఆలయాలు మంచుతో కప్పబడిపోతాయి. అప్పుడు ఈ యాత్రను మూసివేస్తారు.

ఏప్రిల్ 22వ తేదీ నుండి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. చార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ లో వెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుకింగ్ లను స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి IRCTC వెబ్‌సైట్‌లో బుకింగ్ లు చేసుకోవచ్చు.
2023లో చార్ ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటితో ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బద్రీనాథ్ ప్రారంభ & ముగింపు తేదీలు:
బద్రీనాథ్ ఆలయ తలుపులు ఏప్రిల్ 27, 2023వ తేదీన తెరచుకుంటాయి.
నవంబర్ 21, 2023 తేదీన తాత్కాలికంగా మూసివేస్తారు.
బద్రీనాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో ఏటా వచ్చే వసంత పంచమి రోజు నిర్ణయిస్తారు. అలాగే ఆలయ తలుపులు ఎప్పుడు మూసివేయాలో విజయదశమి రోజు నిర్ణయిస్తారు.

కేదార్‌నాథ్ ప్రారంభ & ముగింపు తేదీలు:
కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఏప్రిల్ 25, 2023వ తేదీన తెరచుకుంటాయి.
నవంబర్ 14, 2023వ తేదీన వచ్చే భాయీ దూజ్ రోజు ముసివేస్తారు.
ఏటా కేదార్‌నాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో మహా శివరాత్రి రోజున, ఆలయాన్ని తాత్కాలికంగా ఎప్పుడు మూసివేయాలో కూడా అదే రోజు నిర్ణయిస్తారు.

యమునోత్రి ప్రారంభ & ముగింపు తేదీలు:
యమునోత్రి ఆలయ ద్వారాలు ఏప్రిల్ 22, 2023వ తేదీన తెరచుకుంటాయి.
నవంబర్ 14, 2023వ తేదీన ఆలయ తలుపులు మూసుకుంటాయి.

గంగోత్రి ప్రారంభ & ముగింపు తేదీ:
గంగోత్రి ఆలయ తలుపులు ఏప్రిల్ 22, 2023వ తేదీన తెరచుకుంటాయి.
నంవబర్ 13వ తేదీ దీపావళి రోజున గంగోత్రి ఆలయ తలుపులు మూసుకుంటాయి.
గంగోత్రి పవిత్ర క్షేత్రాన్ని ఏటా వచ్చే అక్షయ తృతీయ రోజున తెరచుకుంటాయి. అలాగే దీపావళి రోజున మూసుకుంటాయి.

హెలికాప్టర్ సర్వీస్ బుక్ చేసుకోవడం ఎలా:
వాట్సాప్, మొబైల్ అప్లికేషన్ ద్వారా హెలికాప్టర్ సర్వీసులు బుక్ చేసుకోవచ్చు. యాత్ర కోసం www.registrationandtouristcare.uk.gov.in కి లాగిన్ అయ్యాక యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్ లో ప్రయాణించాలనుకునే వారు heliserivces.uk.gov.in ద్వారా హెలికాప్టర్ సర్వీసులు బుక్ చేసుకోవచ్చు.

చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సర్వీస్ ధర:
చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ ద్వారా మొత్తం 5 రోజుల పాటు ఉంటుంది. ఢిల్లీ నుండి ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తికి దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుంది.
డెహ్రాడూన్ నుండి కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఆపరేట్లు ఉన్నందున సర్వీస్ ప్రొవైడర్లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సర్వీస్ రూట్:
మొదటి రోజు:
సహస్త్రధార రోడ్డులో ఉన్న డెహ్రాడూన్ ప్రభుత్వ హెలిప్యాడ్ నుండి యమునోత్రికి ఛాపర్ రైడ్ ఉంటుంది. చార్ ధామ్ హెలికాప్టర్ యాత్ర ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడే పూర్తవుతుంది.
యమునోత్రి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండింగ్ ప్లేస్ వద్ద దిగుతారు. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే రాత్రి బస చేస్తారు.
రెండో రోజు:
యమునోత్రి నుండి హెలికాప్టర్ బయలుదేరుతుంది. గంగోత్రికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్సిల్ వద్ద ల్యాండ్ అవుతుంది. ఆ రోజు యమునోత్రి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు:
హర్సిల్ నుండి ఫాటా హెలిప్యాడ్ కు వెళ్తారు. అక్కడి నుండి మరో ఛాపర్ లో కేదార్ నాథ్ కు ప్రయాణం ఉంటుంది. దర్శనం అనంతరం అక్కడి నుండి గుప్తకాశీకి వెళ్తారు. అక్కడ రాత్రి బస చేస్తారు.
నాలుగో రోజు:
నాలుగో రోజు గుప్తకాశీ నుండి బద్రీనాథ్ కు సమీపానికి వెళ్తారు. బద్రీనాథ్ దర్శనం అయ్యాక రాత్రి అక్కడే బస ఉంటుంది.
ఐదో రోజు:
బద్రీనాథ్ రాత్రి బస అయ్యాక ఐదో రోజు అక్కడి నుండి డెహ్రాడూన్ కు తిరుగు ప్రయాణం అవుతారు.



Click it and Unblock the Notifications