Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు, మనుషులు శిలలుగా మారుతారు!
తెరపై చూస్తున్నప్పుడు ఈ చిత్రాలు భయం కల్గించవచ్చు. దానికన్నా భయంకర విషయం అలాంటివి నిజజీవితంలో కూడా జరుగుతాయని తెలియటం.
అనేక సినిమాల్లో మనం ఎన్నో అభూతశక్తులు, మాయావిచిత్రాలు చూస్తుంటాం. కానీ నిజజీవితంలో ఇవేవి నిజం కావుగా. అవన్నీ కేవలం మనలో ఉత్సుకతను పెంచడం కోసం వాడేవి. ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు, మనుషులు శిలలుగా మారుతారు!
తెరపై చూస్తున్నప్పుడు ఈ చిత్రాలు భయం కల్గించవచ్చు. దానికన్నా భయంకర విషయం అలాంటివి నిజజీవితంలో కూడా జరుగుతాయని తెలియటం. మేము మీకు అలాంటి విషయమే చెప్పబోతున్నాం. రాజస్థాన్ లోని ఒక ఆలయంలో సూర్యాస్తమయం తర్వాత మనుషులు రాళ్ళగా మారిపోతారట. ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు, మనుషులు శిలలుగా మారుతారు!
ఈ గుడి ఎంత మాయగా అన్పించినా, నిజానికి ఈ కథ ఎంత ప్రచారంలో ఉందంటే, సాయంత్రం దాటాక ఈ స్థలానికి ఎవరూ రారు. ఇది జోక్ కాదు.
ఇక్కడ ఏళ్ళక్రితం నుంచి ఏదో జరుగుతోంది. ఈ కిరడు విచిత్ర ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.
ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో మీరే చదవండి…

ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజు సోమేశ్వర
పురాణాల ప్రకారం కిరడు అసలు పేరు కిరాడ్ కోట్. ఇది కిరాడ్ వంశస్తులైన రాజపుతులచే పాలించబడింది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు శివుడికి పరమభక్తులు. అందుకే ఇక్కడ కొన్ని శివాలయాలు ఉన్నాయి.

పతనం
మహారాజు యుద్ధానికి వెళ్ళినపుడు, రాజ్యంలో ప్రజలు నిర్లక్ష్యంగా మారి ఎవరికీ సాయపడకుండా ఉంటారు. కోపం వచ్చిన రాజు తన రాజ్యాన్ని “ మానవత్వం లేని రాజ్యంలో మనుషులు ఉండకూడదు “ అని శపించాడు. దానితో రాజ్యం పతనమైంది.

మనుషులు శిలలుగా మారిపోయే శాపం
రాజస్థాన్ కిరడు ఆలయంపై ఉన్న శాపం ఎంత శక్తివంతమైనదంటే, ఎవరైనా సాయంకాలం ఆలయంలో అడుగుపెట్టినా, రాత్రంతా అక్కడ బస చేసినా, రాళ్ళలాగా మారిపోతున్నారట. మహారాజు ఒక్క కుమ్మరి భార్యని తప్ప అందర్నీ శిలలుగా మారమని శపించాడు. ఆమె అతని అనుచరునికి సేవచేయటం వల్లన రాజు ఆగ్రహం నుంచి తప్పించుకోగలిగింది.

ఇది ఎక్కడ ఉన్నది?
ఈ ఆలయం థార్ ఎడారిలో ఉంది. దీన్ని రాజస్థాన్ యొక్క ఖజురహో అనికూడా అంటారు. ఐదు ఆలయాలు కలిసి ఉండే కిరడు ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇది 11 వ శతాబ్దానికి చెందినది.

ఆలయం యొక్క కళావైవిధ్యం
ఈ ఐదు ఆలయాలు సోలంకి కళారూపాలతో నిర్మితమయ్యాయి. ఇది కొత్తగా పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడకి చాలామంది పర్యాటకులు వచ్చినా ఎవరూ ఇక్కడ ఉండటానికి సాహసించరు.

నిర్మానుష్య ప్రదేశం
ఈ నిర్మానుష్య ఆలయాలలో అసహజ వాతావరణం ఉంటుందని అంటారు. తుప్పుపట్టిన ముఖద్వారం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్ళాలనుకుంటే గోడపక్కన చిన్న గేటునుండి వెళ్లాలి. ఈ మొత్తం ప్రదేశం విచిత్రంగా ఉండి ఏదో తప్పుగా అన్పిస్తూ ఉంటుంది. ఇప్పటికి ఇది చాలా పురాతనమైనా ఎవరూ ఉండి ప్రయోగం చేయాలనుకోరు.
మీకేమనిపిస్తోంది? మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications