Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
దీపావళికి ఆ పేరు ఎలా వచ్చింది... ఆ రోజున బాణసంచా ఎందుకు కాలుస్తారో తెలుసా...
దీపావళి 2020 తేదీ, సమయం, పండుగ మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం.
దీపావళి పండుగ అంటేనే చిన్నారుల నుండి పండు ముసలి వరకు అందరికీ చాలా ఉత్సాహం వస్తుంది. దీపావళి పండుగ రోజున దీపాల వెలుగులో రకరకాల పూల అలంకరణలో.. కొత్త బట్టలతో.. విద్యుత్ దీప కాంతులతో ప్రతి ఇల్లు శోభయామనంగా వెలిగిపోతుంది.

భారతదేశంలో దీపావళి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగన మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ దీపాల పండుగ 2020 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన వచ్చింది.

ఈ పండుగ సమయంలో హిందువులు, సిక్కులు, జైనులు లక్ష్మీపూజను చేస్తారు. ఈ పండుగ గురించి ఒక్కో భాషలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఇతిహాసాలు, చరిత్ర, ఆసక్తికరమైన కారణాలు, రహస్యాలు, నమ్మకాలు ఉన్నాయి.

పురాణాలలో, రామాయణంలో, మహాభారతంలోనూ దీపావళి గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ సందర్భంగా దీపావళి పండుగ గురించి.. దీని వెనుక ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ధనలక్ష్మీ పుట్టినరోజు..
మనం ఏ పని చేయాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిందే. ఆ తల్లి ఆశీర్వాదం లేనిదే మనకు ఏ పనులు ముందుకు సాగవు. అలాంటి ధనలక్ష్మీ తల్లి పుట్టినరోజు సందర్భంగా దీపావళి పండుగను జరుపుకోవాలని హిందువులు నమ్ముతారు. అది కూడా కార్తీక మాసంలో అమావాస్య రోజున లక్ష్మీదేవి పుట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఇదే రోజున లక్ష్మీదేవి శ్రీవిష్ణుమూర్తిని వివాహం చేసుకున్నారని, అందుకే వారి వివాహా గుర్తుగా దీపాలతో ఇంటిని అలంకరించి అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తారనే కథ కూడా ప్రచారంలో ఉంది.

సత్యభామ నరకాసురుని సంహారం..
శ్రీవిష్ణువు అవతారమైన శ్రీక్రిష్ణుడు నరకాసురుడిని వధించి 16 వేల మంది మహిళలను రక్షించాడని.. ఈ ప్రమాదం నుండి బయటపడినందుకు ప్రజలందరూ రెండురోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. మరోవైపు శ్రీక్రిష్ణుని భార్య సత్యభామ నరకాసురుడిని సంహరించిందని.. ఈ సమయంలో నరకాసరుడు ఓ వరం కోరాడు. తన మరణాన్ని ప్రతి ఒక్కరూ కాంతులు విరజిమ్మేలా జరుపుకోవాలని కోరుకున్నాడట. అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో దీపావళిని నరక చతుర్దశిగా పిలుస్తూ.. రెండురోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు.

లక్ష్మీపూజ
దీపావళి పండుగ సమయంలో హిందువులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ దేవత ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ తల్లి అనుగ్రహం వల్ల తమ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వంటివి లభిస్తాయని అందరూ నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరంలో లక్ష్మీదేవిని ఆరాధించడానికి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం రండి.

శుభ ముహుర్తం..
నవంబర్ 14వ తేదీన శనివారం నాడు దీపావళి పండుగ వచ్చింది. కాబట్టి ఆరోజు సాయంత్రం 5:28 నుండి రాత్రి 7:24 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి.
ప్రదోష్ కాల ముహుర్తం : నవంబర్ 14వ తేదీనే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల 07 గంటల వరకు
వృషభ కాల ముహుర్తం : నవంబర్ 14వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 28 నిమిషాల నుండి రాత్రి 7:24 గంటల వరకు

పాండవులు
మహాభారతం ప్రకారం, కౌరవుల చేతిలో ఓడిన తర్వాత పాండవులు 12 ఏళ్ల అజ్ణాతవాసం వీడి కార్తీక అమావాస్య రోజున హస్తినపురం చేరుకుంటారు. అందుకే పాండవుల అభిమానులు సంతోషంతో దీపావళి పండుగను జరుపుకున్నట్లు మరో కథ ప్రచారంలో ఉంది. అలా ప్రారంభమైన దీపావళి పండుగ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

సీతారాముల రాక సందర్భంగా..
సీతారాములు 14 సంవత్సరాలు వనవాసం తర్వాత అయోధ్యకు కార్తీక మాసం అమావాస్య రోజున తిరిగొచ్చిన సందర్బంగా ప్రజలంతా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీపావళిని దివాళి అని.. నరక చతుర్దశి అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు.

దీపాలు వెలిగించడం..
దీపావళి పండుగను సిక్కులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. సిక్కుల మూడో గురువు ఆశీస్సులు పొందే సమయంలో దీపాలు వెలిగించడం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే 1577 సంవత్సరంలో స్వర్ణ దేవాలయం శంకుస్థాపన జరిగింది కూడా ఆరోజే కావడంతో.. సిక్కులు దీపావళి పండుగలా జరుపుకుంటారు.

రైతుల్లో ఆనందం..
దీపావళి పండుగ సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. ఈ సమయంలో రైతుల చేతికి పంట వచ్చి ఉంటుంది. ఈ సమయంలో వారు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కొత్త బియ్యం కూడా అందుబాటులోకి వస్తాయి. దీంతో రైతులు సంతోషంతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications