Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రోజూ ఇలా చేస్తే ధనలాభం పొందుతారు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
ప్రజలు ప్రతిరోజూ పని చేసేది డబ్బులు సంపాధించుకొని హాయిగా జీవించడానికే. ఎన్ని సమస్యలు ఉన్నా డబ్బులు సంపాధించడాన్ని మాత్రం అస్సలే ఆపరు. డబ్బుకోసం ప్రతిరోజూ చాలా కష్టపడి పని చేస్తుంటారు. కానీ 24 గంటలూ కష్టపడి పని చేసినా కొందరి చేతుల్లో మాత్రం డబ్బు నిలవదు. నీవు చేసే పనికి ప్రతిఫలం లభించదు. దీనంతటికీ కారణం వారి చుట్టూ ఉండే ప్రతికూల శక్తే. అయితే ఈ ప్రతికూల శక్తిని పారద్రోలి.. లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి చేరితే.. లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోతుంది. అలాగే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చెప్పబోయే చిట్కాలు కనుక పాటిస్తే.. ఆ ఇంట్లో అనుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీ దేవి మళ్లీ ఇంటికి చేరుతుంది. దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా.. అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు.

1. ఆవనూనె దీపం వెలిగించండి:
రోజూ సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయండి. మరియు ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పుకుండా లభిస్తాయి.
2. కర్పూరం, లవంగాలు వెలిగించాలి:
కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం. దేవారాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ కర్పూరం.. వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా వెలుగొందింది. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు రాసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది.
3. గోమాతకు ఆహారం తినిపించండి:
ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది. ఈ గోమాతకు రోజూ ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
4. పక్షులకు ఆహారం ఇవ్వండి:
ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే, జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి మరియు శ్రేయస్సు ఉంటుంది.
5. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చకూడదు:
సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావచ్చు. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది. కాబట్టి ఏ కారణం చేతనూ ఈ పని చేయకండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications