Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఇలా వస్తాయ్..! వాటి నుంచి బయపడాలంటే..!
తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలు అనుభవిస్తారని ఒక నానుడి వుంది. ఈ మాటను మన ఇళ్లల్లో పద్దవాళ్లు ఎప్పుడో ఒక సందర్భంలో అనే వుంటారు. అయితే దీంట్లో ఎంతవరకు నిజముంది. నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయా? పండితులు దీనిపై ఏమంటున్నారో తెలుసుకుందాం. తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలు తప్పకుండా అనుభవించాల్సిందే. కేవలం తల్లిదండ్రి మాత్రమే కాకుండా తాతా, ముత్తాత చేసిన పాపాలను కూడా వారు అనుభవించాల్సిందే. అందుకే జీవితంలో ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలని అంటున్నారు. మనం చేసిన పాపాలు పిల్లలనే కాకుండా వారికి పుట్టబోయే పిల్లలపైన కూడా పడుతుంది. ధర్మమార్గంలో వెళ్తే మాత్రమే మన పిల్లలు బాగుంటారు. లేదంటే మన తరువాతి తరం, మనకు పుట్టిన పిల్లలు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.

అధర్మమార్గంలో వెళ్లినా, ఒకరిని మోసం చేసినా, ఇతరుల డబ్బును అపహరించినా , వేరే వాళ్లకు అన్యాయం చేసి మనం జల్సా చేసినా వారికి పుట్టబోయే పిల్లలను అష్టకష్టాలకు గురిచేస్తాయ్. కాబట్టి సంపాదించే ప్రతీ రూపాయ్ ధర్మబద్దమై వుండాలి. మనం చేసే ప్రతీ పని కూడా న్యాయంగా, ధర్మబద్ధంగా వుండాలి. అప్పుడు మనపిల్లలు, వాళ్ల పిల్లలు, మొత్తం వంశమంతా బాగుంటుంది.
మనం చేసే పాపాల వల్ల మన వంశం కూడా పాడైపోతుంది. తాతల నుంచి ఆస్థులను ఎలాగైతే సంపాదిస్తారో అలాగే పాపాలను కూడా వారసత్వంగా పొందుతారని పండితులు, శాస్త్రం చెబుతోంది. ఏ కష్టం పడకుండా ఆస్తులెలా తీసుకుంటారో, అలాగే పాపాలను కూడా తీసుకుంటారని పండితులు చెబుతున్నారు.
పెద్దల నుంచి కేవలం ఆస్థులు మాత్రమే కాదు, వారి రోగాలు, కోరికలు, సంస్కారాలు, పోలికలు, వీటితో పాటు పాపాలను కూడా వారసత్వంగా పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంపాదించిన ప్రతీ డబ్బూ ధర్మబద్ధమైతే జీవితంలో పిల్లలు కష్టాలను అనుభవించరు. అన్యాయంతో డబ్బు సంపాదిస్తే, ఆ డబ్బును ఎవరినుంచైతే అపహరిస్తారో వారు అనేక శాపాలను పెడతారు. మా సొమ్మును తిన్నవారు జీవితంలో నాశనమైపోతారని శాపం పెడితే అది పిల్లలకు తగులుతుంది. అందువల్ల ధర్మమార్గంలోనే ఎప్పుడూ నడవాలని పెద్దలు మనకు చెప్పివున్నారు.

తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్థులను తీసుకోకుండా అనాధ శరణాలయానికి, దేవాలయాలకు దానం చేస్తే పాపాల్లో 75 శాతం మనకు తగలకుండా వుంటుంది. అంటే చాలా వరకు వారు చేసిన పాపాలను అనుభవించాల్సిన అవసరం వుండదు.
తల్లిదండ్రి పిల్లలను తిడితే అవి ఫలిస్తాయని శాస్త్రం చెబుతోంది. పిల్లలను శాపాలు పెట్టే విధంగా తిట్టవద్దని పిండితులు హెచ్చరిస్తున్నారు. నీ బుద్ధి సల్లంగుండ, నీ నోట్లో పంచదార పొయ్య, నీ ఇల్లు బంగారం కాను, లాంటి తిట్లను ఉపయోగించాలి. ఇలా తిడితే ఎలాంటి శాపం తగలదు. పిల్లలు మాట వినకపోతే కొంచెం కొట్టవచ్చు, కానీ బలంగా కొట్టవద్దు, అలాగే సాయంత్రం దీపారాధన సమయంలో కూడా పిల్లలను కొట్టవద్దని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పిల్లలు ఏడవడం లక్ష్మీదేవికి ఇష్టముండదు. ఏడిస్తే ఇంట్లోంచి వెళ్లిపోతుంది. నువ్వు సర్వనాశనమైపోతావు, చస్తావు, ఎక్కడైానా పోయి చావు లాంటి మాటలు అనకూడదు. పిల్లలపైన ఎటువంటి ప్రమాణాలు కూడా చేయవద్దని శాస్త్రం చెబుతోంది. తల్లిదండ్రులకు మించిన దైవం లేరు కాబట్టి వారు పిల్లలను శపించే మాటలు మాట్లాడవద్దు.



Click it and Unblock the Notifications