Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కార్తీక మాసం ప్రారంభం.. 30 రోజులు ఈ పనులు అస్సలే చేయకూడదు, ఎందుకంటే?
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవైన కార్తీక మాసం ప్రారంభమైంది. నేటి నుంచి అంటే నవంబర్ 2వ తేదీ నుంచి ఈ మాసం అనేది ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఎటువంటి మాంసాహారం తినకుండా, 30 రోజుల పాటు వివిధ ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే పరమేశ్వరుడు, విష్ణువును పూజించి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు.
అయితే ఈ కార్తీకమాసంలో కొన్ని పనులు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఆ కార్యక్రమాలు ఏంటి? ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుంది? ఏ విధంగా వాటిని చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తంలో లేవడం..
సాధారణంగా కొంత మంది కార్తీక మాసంలో కూడా చాలా లేట్‌గా లేస్తూ ఉంటారు. ఉదయం పది అయ్యే వరకు లేచి ఫ్రెష్ అవ్వరు. అయితే ఇలా చేయడం చాలా తప్పు అని పండిత నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని తులసి చెట్టు ముందు ఉదయం, దీపాలు వెలిగించాలని చెబుతున్నారు. ఈ మాసంలో గుడిలో దీపాలు వెలిగించేందుకు నూనె, దీపాలు దానం చేస్తే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
ఈ నెలలో భగవద్గీత చదివినా చాలా ప్రయోజనం ఉంటుందని, అలాగే ఈ నెలలో నేలపై పడుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఈ మాసంలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే శుభప్రదమని చెప్పుకుంటున్నారు.
కార్తీక మాసంలో ఏమి చేయకూడదు?
పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చాలా మంది చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో ఎలాంటి పనులు చేయకూడదు. అనేది ఇక్కడ చూద్దాం. ఈ కార్తీక మాసంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు. సాత్విక, శాకాహార ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో పొట్లకాయ, పెరుగు, జీలకర్ర, బెండకాయ వంటి కూరగాయలను కూడా తినొద్దని చెబుతున్నారు.
కార్తీక మాసం పూజలు
నవంబర్ 2న ప్రారంభమవుతున్న ఈ నెల డిసెంబర్ 1వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు మన ఆధ్యాత్మిక శోభా సంతరించుకోనుంది. ఈ నెల రోజుల పాటు చాలా మంది, శివుడిని విష్ణువును పూజిస్తూ ఉంటారు. శివుడు లేదా విష్ణువు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. కార్తీక మాసం చివరి సోమవారం రోజున పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులసి కళ్యాణం
కార్తీక మాసంలో జరిగే తులసి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు సాలిగ్రామ లేదా తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ తులసి వివాహానికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. సంతానం లేని దంపతులు ఈ తులసిని వివాహం చేస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఆడపిల్లల పెళ్లికి అడ్డంకులు ఏర్పడితే అవి పరిష్కారమవుతాయని ప్రతీతి. ఈ నెల నవంబర్ 12న ప్రబోధిని ఏకాదశి రోజున తులసి వివాహం నిర్వహించనున్నారు. కార్తీక మాసంలో ప్రకృతిలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి. పగలు చాలా తొందరగా, రాత్రి కూడా చాలా గడిచిపోయిందని భావన కలుగుతుంది.



Click it and Unblock the Notifications