Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Margasira Amavasya: మార్గశిర అమావాస్య..ఆ రోజున ఈ 4 దానం చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్!
హిందూ మతంలో అమావాస్య తేదీకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకుంటే మార్గశిర మాసం అంటే శ్రీ కృష్ణుడికి చాలా ఇష్టం. మార్గశిర మాసాన్ని మార్గశీర్ష మాసం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సమయంలో స్వయంగా శ్రీ కృష్ణుడే తనకు 12 మాసాలలో మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం అని చెబుతాడు.
అలాంటి మార్గశిర మాసంలో వచ్చే అమవాస్య(Margashirsha Amavasya 2024) చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజున స్నానం, దాన ధర్మాలు రెండూ ముఖ్యమైనవిగా భావిస్తారు. మార్గశిర అమావాస్య రోజున హిందువులు పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఈ రోజున సుకర్మ యోగం ఉండే సమయంలో స్నానం చేసి దానధర్మాలు చేస్తే మరింత ఫలితం ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. దీంతో పూర్వీకులకు సంతోషం కలుగుతుందని, పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

నవంబర్ 30న మార్గశిర అమావాస్య రాబోతోంది. పంచాంగం ప్రకారం ఈ అమావాస్య తిథి నవంబర్ 30 ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 1న ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది.
మీ జాతకంలో పితృ దోషం ఉంటే మార్గశిర అమావాస్య రోజున ఖచ్చితంగా శ్రాద్ధం, తర్పణం చేయండి. అంతే కాకుండా ఈ రోజున మీరు అవసరమైన వారికి కొన్ని వస్తువులను దానం చేస్తే మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుంది. అయితే మార్గశిర అమావాస్య రోజు వేటిని దానం చేస్తో మీ ఇళ్లు ఎప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుందో ఇక్కడ చూడండి.
తేనె
మార్గశిర అమావాస్య రోజున తేనెను దానం చేయడం వల్ల ధన నష్టం,వ్యాపారంలో నష్టం,ఆరోగ్య సంబంధిత సమస్యలు మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా తేనెను దానం చేయడంతో పూర్వీకులు సంతోషించి వారి ఆశీస్సులను మీకు ప్రసాదిస్తారు.
బెల్లం
ఈ ప్రత్యేకమైన రోజున అవసరమైన వారికి బెల్లం దానం చేయాలి. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే బెల్లం దానం చేయాలి. దీంతో మీరు అన్ని రకాల వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
మినపప్పు
మార్గశిర అమావాస్య రోజున మినపప్పు దానం చేయాలి. దీంతో మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఇది మాత్రమే కాదు మినపప్పు దానం చేయడం ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.గ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
ఉన్ని వస్త్రం
మార్గశీర్ష అమావాస్య రోజున ఉన్ని బట్టలు నిరుపేదలకు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి మీపై భగవంతుని విశేష ఆశీస్సులు లభిస్తాయి.



Click it and Unblock the Notifications