ఈ విషయాలను ఎవ్వరితో పంచుకోవద్దు..! ఎంతటి దగ్గరివారైనా సరే..!

జీవితంలో మనకు చాలా రహస్యాలు వుంటాయ్. కొంత మంది తమ దగ్గర ఏ రహస్యాలు పెట్టుకోకుండా అందరికీ అన్నీ చెప్పే ప్రయంత్నం చేస్తారు. దీని వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని విషయాలను అందరికీ చెప్పనవసరం లేదు. కేవలం అవసరమైన విషయాలను మాత్రమే చెప్పాలి.

హిందూ శాస్త్రంలో ఏ విషయాలు చెప్పకూడదో ఎన్నో యేళ్ల క్రితమే రుషులు, పండితులు చెప్పివున్నారు. వారు చెప్పిన విషయాలను పాటిస్తూ వుంటే మన జీవితం సంతోషమయంగా వుంటుంది. ధన సంపాదన, కుటుంబం గొడవలు, వయసు ఇలా కొన్ని విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని శాస్త్రం చెబుతోంది.

dont-tell-these-secrets-to-anybody-according-to-hindu-sastra

మన సంపాదన విషయాలను ఎవ్వరితోనూ చర్చించవద్దు. మీ సంపాదన తక్కువ అని తెలియడం వల్ల మీమ్మల్ని చులకన భావనతో చూసే అవకాశం వుంటుంది కాబట్టి చెప్పరాదు. మనకంటే తక్కువ సంపాదించేవారికి మన సంపాదన తెలిసినా మనపై అసూయ, మనల్ని నాశనం చేయాలనే తలంపు వారికి వస్తుంది. ఎలాగైనా మన సంపాదన ఆగిపోవాలని ఏదైనా పూజలు చేయడమో, వేరే ప్రయత్నాలు చేయడం చేస్తారు.

మన కుటుంబ సమస్యల గురించి ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. భార్యా భర్తల మధ్య ఎన్నో గొడవలు వుంటాయ్. గొడవలు లేని ఇల్లు, కాపురాలు వుండవు. ఈ సమస్యలు ఇతరులకు చెప్పడం వల్ల కాపురంలో కుటుంబంలో నిప్పులు పోయాలను చూస్తారు.

ఎవ్వరికి కూడా మన వయసు చెప్పకూడదు. శాస్త్రప్రకారం మన వయస్సు చెప్పినట్లయితే మన ఆయుశ్వు తగ్గిపోతుంది. వయసును స్నేహితులు, బంధువులకు కూడా చెప్పవద్దని ఎన్నో యేళ్ల క్రితమే పెద్దలు చెప్పారు.

dont-tell-these-secrets-to-anybody-according-to-hindu-sastra

మన దగ్గరవున్న మంత్రన్ని కూడా ఎవ్వరికీ చెప్పవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. గాయాత్రీ మంత్రానికి ఎవ్వరికంటే వారికి ఉపదేశం చేయవద్దు. కొన్ని మంత్రాలను గోప్యంగా వుంచుకోవాలి. మంత్రాన్ని ఉపదేశించినప్పుడు, దాన్ని తీసుకున్నవారు నియమనిష్టలతో చేయాలి, కొందరు అలా చయరు కాబట్టి మంత్రాన్ని అందరికీ చెప్పవద్దు.

మనం చేసే దానాన్ని కూడా ఎవ్వరికీ చెప్పవద్దు. కుడి చేయితో ఇచ్చిన దానం ఎడమ చేయికి తెలవకూడదు అని పెద్దలు చెప్పారు. దానం ఇచ్చి చెప్పుకుంటే ఆ ఫలితం లభించదు.

భార్యా భర్తల మధ్య జరిగే సంగమం, మైధునాన్ని గోప్యంగా వుంచాలి. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని ఎవ్వరితో పంచుకోవద్దు.

మనకు జరిగిన సన్మానాలను కూడా ఎవ్వరితో చెప్పకూడదని పెద్దలు చెప్పారు. ఎవ్వరైనా మీమ్మల్ని మీకు గొప్పసన్మానం జరిగింది కదా అని అంటే..అదంతా భగవంతుని కృపగా తెలపాలి. మనకు ఎంత విద్య వున్నా మనకు మనం పొగుడుకోకుడదు.

మనకు జరిగిన అవమానాలను కూడా ఎవ్వరితో చెప్పుకోకూడదు. అలా చెప్పడం వల్ల మనపై జాలి చూపించి మనల్ని చులకన భావనతో చూస్తారు. మనకు శతృవులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం వుంది.

ఏ ఔషదం వాడుతున్నామో కూడా ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే ఆ ఔషదం వాడవద్దని కొందరి నుంచి మనకు సలహా రావచ్చు. దీని వల్ల మనకు అనారోగ్య సమస్యలు మరింత తలెత్తే అవకాశం వుంది. మనం వాడే ఔషదాల గురించి ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు. పైవాటన్నింటినీ నవగోప్యాలు అని అంటారు.

Story first published: Tuesday, June 18, 2024, 11:35 [IST]
Desktop Bottom Promotion