For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీరు చనిపోయినట్లు కల వస్తే దేనికి సంకేతం ! కలలో అవి కనపడితే ఏమవుతుందో తెలుసా? కలలు వాటి ఫలితాలు

  |

  మనలో చాలా మందికి రోజూ రాత్రి నిద్రించేటప్పుడు కలలు వస్తుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన కలలు వస్తుంటాయి. ఇక కలలో కుక్క మిమ్ములను కరిచినట్లు కనపడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కలవస్తే... కష్టాలు వచ్చే సూచనలున్నాయి. కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది.

  నెమలిని చూస్తే దుఃఖం కలుగుతుంది. మీ పెళ్ళిని మీరు మీ కలలో చూస్తే... ఇబ్బందులెదుర్కోక తప్పదు. కలలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్లు కనపడితే... శుభకార్యం జరుగుతుందని భావించాలి. కలలో అద్దం చూస్తే... మనసు కకావికలమౌతుందంటున్నారు జ్యోతిష్యులు.

  ఆవు దొరికినట్లు కలవస్తే

  ఆవు దొరికినట్లు కలవస్తే

  రైలులో ఎక్కుతున్నట్లు కలవస్తే... యాత్ర చేస్తారని భావించాలి. నిద్రలో కాలుజారి పడినట్లు కలవస్తే... అధోగతి పాలయ్యే ప్రమాదానికి సూచన. మీకు ఆవు దొరికినట్లు కలవస్తే... భూలాభం ఉంటుంది. గుర్రం నుంచి కింద పడినట్లు కలవస్తే... పదవీత్యాగం చేయాల్సివుంటుంది. గుర్రంపై ఎక్కినట్లు కలవస్తే... పదవిని పొందుతారు.

  చనిపోయినట్లు కలలో కనపడితే

  చనిపోయినట్లు కలలో కనపడితే

  మీరు చనిపోయినట్లు కలలో కనపడితే... మీకున్న అన్నిరకాల బాధలు తొలగిపోయినట్లేనంటున్నారు జ్యోతిష్యులు. ఇదేవిధంగా సముద్రం, వికసిస్తున్న పూలు, యువతితో కలవడం లేదా చూడటం, ప్రసాదం లభించినట్లు కలవస్తే, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, ఆలయాన్ని చూడటం, నగలు దొరకడం లాంటి కలలు ఇంకా ఏనుగుపై సవారీ చేయడం, పండ్లు తీసుకున్నట్లు కలలు రావడం, అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనపడటం లాంటి కలలు వస్తే ధనలాభం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

  జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే

  జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే

  అలాగే మీ కలలో రక్తం చూడటం, స్తనపానం చేస్తున్నట్లు, మద్యం, నూనె సేవిస్తున్నట్లు, మిఠాయి తినడం, వివాహం జరిగినట్లు, పోలీసును కలలో చూడటం లాంటివి, తమరు గుండు గీయించుకున్నట్లు కలలో కనపడితే మరణ వార్త వినాల్సి వస్తుంది. విధవకు గెడ్డం పెరగడం లాంటి దృశ్యం కలలో కనపడితే... పునర్వివాహం జరిగే సంకేతాలున్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసికొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు.

  కలలో పాము కనిపించి అది కాటు వేస్తే

  కలలో పాము కనిపించి అది కాటు వేస్తే

  ఇక కలలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. మీకు కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్ళిపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు.

  పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే

  పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే

  అయితే పాము కలలో మీకు వెంటాడితే మాత్రం సమస్యలు, కష్టాలు తప్పవు. ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్థంగా ఉండాలి. పాము వెంటాడినట్లు కనిపిస్తేను లేదా తరచూ సాములు స్వప్నంలో కనిపిస్తేనూ ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించాలి. పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు ఉంచి సుబ్రమణ్యస్వామికి అర్చనలు, అభిషేకాలు చేయాలి. భక్తితో స్వామిని ప్రార్థిస్తే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

  వివాహానికి సంబంధించిన కలలు

  వివాహానికి సంబంధించిన కలలు

  ఇక శుభాలకి సంబంధించిన కలలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు అంటున్నారు. వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని శుభాలతో కూడిన కలలు వస్తే త్వరలో వారి వివాహం జరగనుందట. మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా, తమ ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా కల వస్తే ఆ ఇంటి పెళ్ళి భాజాలు మోగడం తప్పనిసరి అని పంచాంగ నిపుణులు అంటున్నారు.

  త్వరలోనే వారి వివాహమవుతుంది

  త్వరలోనే వారి వివాహమవుతుంది

  తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నట్టుగా, తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా, బంగారు ఆభరణాలు ధరించినట్టుగా, చేతి నిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా, ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా యువతులకు కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహమవుతుంది.

  కలలో పిల్లలు కనిపిస్తే

  కలలో పిల్లలు కనిపిస్తే

  ఇక కొందరికి కలలో పిల్లలు కనిపిస్తారు. చిన్నపిల్లలు కలలో కనిపించడం అనేది... మీ స్వచ్ఛమైన హృదయాన్ని ప్రతిబింబించడం లాంటిది. ‘పిల్లలు' స్వచ్ఛత, అమాయకత్వం, మంచితనం... తదితర లక్షణాలకు ప్రతీక. కలలో... చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే...మీరు మది నిండా సంతోషంగా ఉన్నారని అర్థం. కలలో పిల్లలు కనిపించడం అనేది, మీలో మీకు కనిపించని శక్తులు...మిమ్మల్ని పలకరించడం కూడా. ఇక పిల్లలు కలలో కనిపించడం అనేది... ఒక కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.

  క్షవరం చేయించుకొన్నట్టు

  క్షవరం చేయించుకొన్నట్టు

  కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

  చితిపైకి ఎక్కటం

  చితిపైకి ఎక్కటం

  అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం కూడా మంచిదికాదు.

  సముద్రం కనిపిస్తే కష్టాలు

  సముద్రం కనిపిస్తే కష్టాలు

  కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది. పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది.

  సూర్యోదయ సమయంలో కల వస్తే

  సూర్యోదయ సమయంలో కల వస్తే

  రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జ‌రుగుతుందని... రెండో జాములో కల వస్తే 6 నెల‌ల లోపున, మూడో జాములో వస్తే 3 నెల‌ల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రం చెబుతోంది . సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజులలోపే జరుగుతుందని అంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని... రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిది కాదు.

  నిజజీవితంలో మంచి జరగదట

  నిజజీవితంలో మంచి జరగదట

  ఆకాశంలో మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. ఇక జంతువులు క‌ల‌లో వ‌స్తే... కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షి గుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు కలలు వచ్చినా నిజజీవితంలో మంచి జరగదట.

  తిల హోమం

  తిల హోమం

  ఇలా మంచి క‌ల‌ల‌ గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం చెబుతోంది. మంచి క‌ల‌ల వరుసను కూడా ఈ సందర్భంలోనే తెలిపింది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిద‌ని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ. చెడు క‌ల‌లు దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చేయ‌డం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుష సూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి.

  తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే

  తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే

  నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి స్వ‌ప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట‌. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు.. తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయి.

  మరణించిన వారు కలలో కనపడితే

  మరణించిన వారు కలలో కనపడితే

  ఇక మరణించిన వారు కలలో కనపడితే ఏమవుతుందో తెలుసా?ఇందుకు ఆధ్యాత్మికంగా రెండు కారణాలు ఉన్నాయి. మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారట. కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట. ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం 65 శాతం మంది సహాయపడితే, కేవలం 30 శాతం మంది మాత్రమే పగసాధిస్తారు. మిగతా 5 శాతం మాత్రం కలల ద్వారా వారి వారసులకు సందేశం ఇస్తారట.

  English summary

  33 common dreams and their mysterious meanings

  33 common dreams and their mysterious meanings..Imagine if the dream you had last night, contained the answer that you had been looking for! The fact is that we can actually look at our dreams as a roadmap to our anxieties, hopes and fears…it is like getting secret messages from our subconscious. Knowing the meaning of a dream can be life-changing. Read on to identify the important symbols in your dreams…
  Story first published: Wednesday, June 20, 2018, 11:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more