For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2020 : దుర్గాదేవిని పూజించే సమయంలో ఈ మంత్రాల గురించి తప్పక తెలుసుకోండి...!

|

దుర్గా మాత అత్యంత శక్తివంతమైన పరాశక్తి స్వరూపంగా కొలవబడుతుంది. ఈ లోకంలోని జీవకోటి రాశులందరికీ తల్లిగా.. ప్రతి ఒక్కరినీ ఆదరించి.. అందరికీ రక్షణగా నిలబడుతూ ప్రతి ఒక్కరి చేత కల్పతరువుగా కీర్తించబడుతోంది.

ఈ దుర్గా మాతకు మనలోని అజ్ణానాన్ని తొలగించి, మన ఆలోచనా స్థాయిలను పెంచగలిగే శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది. అంతేకాదు.. మానసిక చైతన్యాన్ని పెంపొందించడంలో కూడా దుర్గా దేవి ముఖ్యమైన పోషిస్తుందని పండితులు చెబుతారు.

భయం, అసూయ, ద్వేషం ఇతర దుష్ట శక్తుల ప్రతికూల ప్రభావాల నుండి తన భక్తులను రక్షిస్తున్న దుర్గా దేవి మహాకాళిగా కూడా పిలువబడుతుంది. ఆ మాతను ఆరాధించే పవిత్రమైన కాలంగా భావించే నవరాత్రి సమయంలో భక్తులందరూ ఆ దేవతని స్మరిస్తూ.. ఆమె ఆశీర్వాదాలను పొందడం కోసం ఈ మంత్రాలను తప్పకుండా జపిస్తారు. ఆ మంత్రాలేంటో.. వాటి అర్థాలేంటో మీరు కూడా చూసెయ్యండి...

Navratri 2020 : దుర్గాదేవిని 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుందట...!

సర్వదా మంగళ మంగళ..

సర్వదా మంగళ మంగళ..

నవరాత్రి సమయంలో జపించే అత్యంత శక్తివంతమైన దుర్గా మంత్రాలలో ఇది ఒకటి. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే.. పవిత్రమైన సమయంలో మంచి వారికి అన్ని రకాల లక్ష్యసాధనకు, ఆశ్రయం యొక్క మూలానికి, మూడు ప్రపంచాల తల్లికి, తనను తాను కాంతి కిరణం, స్ప్రుహను బహిర్గతం చేసే దేవతకు, మేము నమస్కరిస్తున్నాం..

దుర్గాస్తుతి..

దుర్గాస్తుతి..

దుర్గాస్తుతి యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేన సమష్ట సమస్తస్యాయ్ సమస్తస్యాయ్ సమస్తస్యాయ్ నమో నమః ఈ మంత్రాన్ని కూడా నవరాత్రుల సమయంలో విశేషంగా జపిస్తారు. దీని అర్థం ఏమిటంటే.. ఓ దేవత అన్ని జీవులలో ప్రతిచోటా తెలివితేటలు మరియు అందంగా ఉండేలా చూడాలని పదే పదే నిన్ను నమస్కరిస్తున్నాను.

ఓ జగదాంబ..

ఓ జగదాంబ..

జగదాంబ విచిత్రామాత్ర కిమ్ పరిపూర్ణ కరుణస్తి చెన్మయి..

అపరాధ పరంపర పరమ్ నా హాయ్ మాతా సముపేక్షతే సుతం..

ఈ మంత్రాన్ని కూడా నవరాత్రి సమయంలో జపించడం చాలా మంచిది. దీని అర్థం ఏమిటంటే.. ఓ దేవత మీరు అందరి పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. మీరు నా పట్ల ప్రేమ, దయ చూపి.. మమ్మల్ని వదలకుండా.. మేమేమైనా పొరపాట్లు చేస్తే.. మేము సరిదిద్దుకునేలా చూడండి.

ద్యాన మంత్రం..

ద్యాన మంత్రం..

ఓం జటా జుట్ స్మాయుక్తమర్దేందుక్యత లక్షణం!

లోచన్యాత్ర స్నా యుక్తం పద్మేందు సాధ్య షాణయం !!

ఈ మంత్రాన్ని ద్యాన మంత్రం అని పిలుస్తారు. ఈ మంత్రం పూజా సమయంలో ఏకాగ్రత భగ్నం కాకుండా కాపాడుతుంది. దేవతని స్తుతిస్తూ, స్మరించడానికి మాత్రమే కాకుండా, అభ్యాస పఠనంలో ఏకాగ్రతను పెంపొందించుకోవటానికి విద్యార్థులకు దోహదపడే మంత్రంగా చెప్పబడింది.

Navratri 2020 : దుర్గా దేవి ఆయుధాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత... అవేంటో తెలుసా...

శాంతి మంత్రం..

శాంతి మంత్రం..

రిపవ: సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే!

నందతే చ కులం పుంసాం మహాత్మ్యం మమశ్రుణ్వతామ్!!

శాంతి కర్మాణి సర్వత్ర తథా దుఃస్వప్న దర్శనే!

గ్రహపీడాసు చోద్రాసు మహాత్మ్యం శ్రుణుయాన్మము!!

ఈ మంత్రం దుష్ట శక్తుల నుండి.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో.. శత్రువులను ఎదిరించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ లోకంలోని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో సంతోషాలను మెరుగుపరచడమే కాకుండా అసూయపరుల నుండి వచ్చే ప్రతికూల శక్తులను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.

ముక్తి మంత్రం..

ముక్తి మంత్రం..

సర్వ బద్ధ వినిర్ముక్తో ధనద్యాన శుతాన్వితః!

మనుష్యో మాత్ర్పసాదేన్ భవిష్యతి న సంశయః!!

ఈ దుర్గా దేవి మంత్రాన్ని సర్వ బద్ధ ముక్తి మంత్రంగా చెప్పబడింది. సమస్యల నుండి ప్రజలను విముక్తులను చేయడానికి, పిల్లలు లేని వారికి సంతాన యోగం కలిగేందుకు, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు, వ్రుత్తిపరమైన చికాకులు తొలగేందుకు మాత్రమే కాకుండా కుటుంబంలో శాంతిని నెలకొల్పడంలో కూడా ఈ మంత్రం సహాయపడుతుంది.

శాంతి కర్మాణి సర్వత్ర తధా దుఃస్వప్న దర్శనీ!

శాంతి కర్మాణి సర్వత్ర తధా దుఃస్వప్న దర్శనీ!

గ్రహ పిదాసు చోగ్రసు మహాత్మ్యాన్ శ్రుణయాన్మం!!

ఈ మంత్రం వల్ల పీడకలలు, భయం, చెడు వంటి విషయాలపై విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. జన్మ కుండలిలో గ్రహాలు ప్రతికూలంగా ఉంటే.. ఈ మంత్రం చదవడం వల్ల సానుకూల ఫలితాలొస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ మంత్రం భక్తులకు విశ్వాసాన్ని కలిగిస్తుంది.

నారాయణి నమోస్తుతే..

నారాయణి నమోస్తుతే..

ఓం శరణగత దీనార్థ పరిత్రానా పరాయనే..

సర్వ శీర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే..

ఇది మరో పవిత్రమైన మంత్రం. ఇది చాలా శక్తివంతమైనది. సమస్యల నుండి మనకు విముక్తి లభించడానికి ఈ మంత్రం చాలా బాగా పని చేస్తుందని ఎందరో హిందువులు నమ్ముతారు. నవరాత్రి వేళ ఈ దుర్గా మంత్రాలను జపించండి.. పండుగ యొక్క అత్యంత దైవిక అనుభూతిని పొందండి..

English summary

Durga Mantras To Chant During Navratri in telugu

Chanting Durga mantras during Navratri will make the occasion more sacred and blissful. Here are some of the most divine Durga mantras to chant during Navratri. Read more.