Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కార్తీకమాసంలో మాసం తినడం ఇంత ప్రమాదమా?.. తెలియకుండా తినేస్తే ఏమవుతుందో తెలుసా?
హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. పెళ్ళైన స్త్రీలు, మహిళలు, పురుషులు ఈ నెల అంతా భక్తిలో మునిగి తేలుతారు. శివుడి, విష్ణువు ఆలయాల్లో ఈ నెల అంతా పూజలు చేస్తుంటారు. అలాగే ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించి దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నెల అంతా భక్తిలోనే ఉండడంతో చాలా మంది మాంసాహారం తినరు.
కార్తీకమాసంలో మాంసం తినడం పాపమని, శరీరానికి లేదా కుటుంబానికి ఎంతో హానికరమని చెప్తుంటారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ చాలా మంది భక్తుల విశ్వాసం. అయితే కార్తీక మాసంలో మాంసం ఎందుకు తినకూడదు? తింటే నిజంగానే ప్రమాదకరమా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కార్తీక మాసంలో మాంసం ఎందుకు తినకూడదని అంటారు?
కార్తీకమాసంలో మాంసం తినకూడదని చెప్పడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసం సరిగ్గా శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో వస్తుంది. ఈ సమయంలో చెరువులు, నదుల్లోని నీళ్లు అన్నీ కలుషితమై ఉంటాయట. అందుకే చెరువుల్లోని చేపలు, అలాగే ఆ నీళ్లు తాగే జీవ చరాలు సైతం కలుషితమై ఉంటాయని, వాటిని తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండడంతో తినకూడదని పూర్వం చెప్పేవారట.
అందుకే ఈ నెల రోజులు అంతా మాంసాహారానికి దూరంగా ఉంటూ.. భక్తిలో ఉండాలని నమ్మేవారట. దేవుళ్ళకు పూజలు చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుందనే నమ్మకంతో కార్తీకమాసంలో మాంసాహారానికి, హింసచరానికి దూరంగా ఉండేవారు అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో గొర్రెలు, మేకలకు సంతానోత్పత్తి కాలం. ఈ కాలంలో వాటిని హింసిస్తే పాపం చుట్టుకుంటుందని నమ్ముతారు. అందుకే వాటిని హింసించకూడదని మాంసాహారం తినకుండా ఉంటారు.
కార్తీక మాసంలో మాసం తినొచ్చా? తినకూడదా?
కార్తీక మాసంలో మాంసం తినకూడదు అని అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. మాంసం తినకపోవడం అనేది పూర్తిగా ఒక సంప్రదాయం మాత్రమే. ఈ సంప్రదాయాన్ని పాటించడం పాటించకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధాపడి ఉంటుంది. కార్తీక మాసంలో ఇప్పటికీ మాంసం తినే వాళ్ళు ఉంటారు. అందుకే కార్తీకమాసంలో మాంసం తినడం వల్ల ఎలాంటి హాని జరగదు. ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో మాంసం తినొచ్చు.
నిజానికి మాంసం తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదు. మాంసంలో పుష్కలంగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే కార్తీక మాసం చలికాలంలో వస్తుంది. ఈ చలికాలంలో మనుషులు ఎవరైనా సులభంగా రోగాల బారిన పడతారు. దగ్గు, జలుబు, విరేచనాలు వంటి ఆనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే మనం తినే మాంసం సరిగ్గా ఉడకబెట్టుకొని తినాలి. ఎంచుకున్న మాంసం కూడా ఎలాంటి రోగాలు లేకుండా ఉన్నది ఎంచుకోవాలి. అలాంటి సందర్భంలో మాంసం తింటే ఎలాంటి ప్రమాదానికి గురవకుండా ఉంటాము.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications