Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.!
శివపార్వతుల ముద్దుల తనయుడు, చిట్టి గణనాథుడికి ఎన్నో రూపాలు, వాటికి తగిన పేర్లు. భక్తులు ప్రేమగా ఆయనను ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు. వక్రతుండాయ, ఏకాదంతాయ, మహోదర, గజానన, లంబోదర, వికట రూప, విఘ్న రాజ, ధూమ్ర వర్ణ. ఇలా ఆయనను వివిధ అవతారాల్లో కొలుస్తూ పూజిస్తాం. మరి ఇన్ని అవతారాలు గణపతికి ఎందుకు వచ్చాయి. దాని వెనుక కథేంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం.

వక్రతుండాయ అవతారం
గణనాథుడి ఎనిమిది అవతారాల్లో వక్రతుండ అవతారం మొదటిది. వక్రతుండం అంటే వంగిన తొండంతో ఉండే గణేశుడు అని అర్థం. మత్సరసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సుతో శక్తి సామర్థ్యాలు పొందగా.. అతనిలో అసూయ, ఆత్మన్యూనత పెరిగి దేవతలను వేధించేవాడు. దేవతల ప్రార్థన మేరకు ఆయన వక్రతుండ రూపాన్ని ధరించి మత్సరసురుని అంతమొందించి విముక్తి కలిగించాడు. అందుకే వక్రతుండాయగా గణపతిని ఆరాధిస్తారు.

ఏకదంతాయ అవతారం
రెండో అవతారమైన ఏకదంతాయ రూపం వెనుక కథేంటంటే.. అధికార గర్వం, బలం, శక్తితో మాదాసురుడు దేవతలతో పాటు ఇతర లోకాలను వేధించడం, ఇబ్బందులు కలిగించడం చేసేవాడు. గణనాథుడు ఏకదంత రూపంలో ఆ దుష్ట శక్తిని ఎదుర్కొని అహంకారానికి ముగింపు పలికాడు. ఏకదంతాయగా దేవతల, భక్తుల పూజలందుకుంటున్నాడు.
మహోదర అవతారం
విఘ్నేశ్వరుడి మహోదర అవతారం వెనుక ఉన్న ఇతిహాస కథనం ప్రకారం.. మోహాసురుడు అనే రాక్షసుడు మంచీచెడుల వ్యత్యాసం మరిచి దేవతలను, ఇతర జీవులను సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాడు. వారి విన్నపం మేరకు మహోదర రూపం ధరించి మోహాసురుడిని ఓడించాడు. మహోదర అంటే విశాలమైన పొట్ట కలిగి ఉన్న గణేశుడు అని అర్థం.

గజానన అవతారం
దురాశతో మొత్తం తనకే కావాలనే వాంఛతో ఉన్న లోభాసురుడి చేష్టలతో దేవతలను, ప్రజలను పీడించేవాడు. అతడి నుంచి ప్రజలను రక్షించేందుకు గజానన రూపం ధరించిన గణేశుడు లోభాసురుడిని ఎదుర్కొని దుష్ట పీడను అంతమొందించాడు. గజానన అంటే ఏనుగు ముఖం కలిగిన గణేశుడు అని అర్థం.
లంబోదర అవతారం
దురాగతాలుతో దేవతలు, ప్రజలను పీడిస్తున్నన క్రోధాసురుడిని అంతమొందించేందుకు వినాయకుడు ఎత్తిన అవతారమే లంబోదర అవతారం. కోపం మనకు ఎంత చేటు అనేది క్రోధాసుర సంహారంతో మనకు సందేశం ఇస్తాడు బొజ్జ గణపయ్య. లంబోదర అంటే విశాలమైన పొట్ట ఉన్న గణపతి అని అర్థం.

వికట రూప అవతారం
అదుపులేని కోరికలు, వాంఛలతో మనస్సాక్షి అనేది లేకుండా మంచీచెడులు పట్టించుకోకుండా ప్రజలను పీడిస్తున్న కామసురుడిని అంతం చేసేందుకు పుట్టుకొచ్చిన అవతారమే వికట రూప అవతారం. ఈ అవతారంలో కామసురుడిని ఎదుర్కొని ప్రజలకు విముక్తి కలిగించాడు.
విఘ్నరాజ అవతారం
మమకారం, వ్యామోహం, మితిమీరిన స్వాధీనం మనిషి జీవితానికి ఎంత చేటు అనేది విఘ్నరాజ అవతారం వెనుక కథ తెలియజేస్తుంది. పదవి, వస్తువులపైన మితిమీరిన వ్యామోహం కలిగిన మామసురుడిని విఘ్నరాజ రూపంలో గణనాథుడు ఎదుర్కొన్నాడు. ఏదైనా పరిమితులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ అవతారం తెలియజేస్తుంది.
ధూమ్రవర్ణ అవతారం
గణేశుడి ఎనిమిదో అవతారం ధూమ్రవర్ణం. అహంకారసురుని సంహారం కోసం పుట్టుకొచ్చిందే ఈ అవతారం. ధూమ్రవర్ణం అంటే పొగ వంటి ఛాయ. అహంకారం, తానే గొప్ప అనే భావనతో ఉన్న అహంకాసురుడు ఇతరుల సలహాలను, సూచనలను విస్మరిస్తాడు. అప్పుడు వినాయకుడు ఈ రూపం ధరించి అహంకాసురుడిని ఎదుర్కొని మనిషికి ఇలాంటి లక్షణాలు ఉండటం ఎంత ప్రమాదమో తెలియజేస్తాడు.



Click it and Unblock the Notifications
