అక్షయతృతీయ నాడు మీ ప్రణాళికలు అమలు పరచడం ద్వారా ఖచ్చితమైన విజయాలను పొందండి

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

అక్షయతృతీయ నాడు మీ ప్రణాళికలు అమలు పరచడం ద్వారా ఖచ్చితమైన విజయాలను పొందండి.దేశంలోని జైనులు మరియు హిందువులందరూ ఎంతగానో ఎదురుచూసే అక్షయ తృతీయ రానే వచ్చింది. అక్షయ తృతీయ అంటేనే బంగారం గుర్తొస్తుంది. కానీ ఇతరములైన విషయాలు కూడా ఉన్నాయని అనేకమందికి తెలీదు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత : మహావిష్ణువు 6 వ రూపం అయిన పరశురామావతారo సందర్భంగా లేదా పరశురామ జయంతిని పురస్కరించుకుని అక్షయ తృతీయను జరుపుకోవడం హిందువుల ఆనవాయితీ. వైష్ణవులకు పరశురాముడు ఆరాధ్యదైవంగా చెప్పబడుతారు.

Execute Your Plans This Akshay Tritiya For Assured Success

2018 అక్షయ తృతీయ

ఈరోజు అనేకమంది మహావిష్ణువు అవతారం అయిన వాసుదేవుని కూడా పూజిస్తారు. వినాయకుడు, వేదవ్యాసుడు మహా భారతం రాయడo ఈరోజు నుండే ప్రారంభించారు. తద్వారా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజుగా ఈ అక్షయ తృతీయ ఉన్నది. మాతా మధురాదేవి , శివుని అవతారమైన సుందరేశుని పెళ్లిచేసుకున్న రోజు కూడా ఈరోజే. ఇక జైనుల ప్రకారం , జైన తీర్ధంకరుడైన రిషభ దేవుడు 3 నెలల కఠోర ఉపవాసాన్ని ఈరోజున ముగించాడు. తద్వారా ఈరోజు జైనులకు ముఖ్యమైన రోజుగా ఉన్నది.

అక్షయ తృతీయను అఖా తీజ్ లేదా ఆక్తి అని కూడా వ్యవహరిస్తారు. ఈ సారి ఏప్రిల్ 18 వ తేదీన రానున్నది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయని జరుపుకుంటారు. ఈ సంవత్సరం సర్వసిద్ది యోగo పూర్తిగా 24 గంటలు ఉండనుంది. ఇలాంటి యోగం 11 సంవత్సరాల క్రితం వచ్చింది. మరలా ఇన్ని సంవత్సరాలకు వచ్చినట్లుగా పండితులు చెప్తున్నారు.

Execute Your Plans This Akshay Tritiya For Assured Success

ఈరోజు హిందువులకు, జైనులకు ఎంత ముఖ్యమైనదో వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు అబూజ్ ముహూర్తం నడుస్తుంది, కావున ఏ పనినైనా మొదలుపెట్టడానికి ఈరోజు ఉత్తమమైనదిగా సూచించబడినది. ఎక్కువ మంది పెళ్లి చేసుకొనుటకు , బంగారం కొనుటకు లేదా స్థలం వ్యవహారాలకై సుముఖతను చూపుతుంటారు. ఈరోజు పెళ్లిళ్లు చేసుకునే వారికి జాతకాలు కూడా చూడవలసిన పనిలేదని చెప్తుంటారు. గ్రహాల ప్రతికూల ప్రభావాలు కూడా ఈరోజు తక్కువగా ఉంటాయని పండితులు చెప్తున్నారు.

ఈరోజు అనేకులు ఉపవాసం ఉండడం, వారి ఇష్ట దైవాలను పూజించుట ద్వారా కుటుంబానికి ఆర్ధిక, మానసిక సమస్యలు తొలగి ఆనందకర జీవనానికి సుగమం అవుతుందని విశ్వసిస్తారు. తద్వారా దేవాలయాలకు వెళ్ళడం, ఉపవాసాలు ఆచరించడం, పేదవారికి అన్నదానం చేయడం వంటి కార్యాలను చేయడానికి పూనుకుంటుంటారు.

ఈరోజు మహిళలు, తమకు రాబోయే భర్త మంచి గా ఉండాలని, లేదా తమ ప్రియమైన వారికోసం, భర్తల ఆయురారోగ్యాలకోసం ఉపవాసాలు చేస్తుంటారు. మరియు అనేకులు వారి ఇంట పరమపదించిన వారి ఆత్మశాంతికై శాంతి పూజలు లేదా కర్మ కతువులు చేస్తుంటారు.

Execute Your Plans This Akshay Tritiya For Assured Success

ఉపవాసం:

ఒకవేళ మీరు ఉపవాసానికి సంకల్పించినట్లయితే, చేయు విధానం గురించి పొందుపరచబడింది.

సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని బ్రహ్మ స్నానం అనికూడా అంటారు. పసుపు బట్టలు ధరించడం ఆనవాయితీ. తర్వాత మహా విష్ణువు విగ్రహానికి పూజా పునస్కారాలు చేయాల్సి వస్తుంది . గంగాజలం, తులసి, పసుపు పూలు, ధూప దీప నైవేధ్యాలు సమర్పించవలసి ఉంటుంది. తర్వాత ప్రసాదాన్ని మీ ప్రియమైన వారికి సమర్పించవలసి ఉంటుంది. సాయంత్రం చంద్రోదయo అయిన పిదప అతిధికి కానీ, పేదవానికి కానీ బ్రాహ్మణునికి కానీ భోజనాన్ని సమర్పించిన తర్వాతనే ఉపవాసం పూర్తవుతుంది. రోజులో పాలు పండ్లు పరిమితి మేర తీసుకొనవచ్చు.

English summary

Execute Your Plans This Akshay Tritiya For Assured Success

Akshay Tritiya, popularly known as Akha Teej is being celebrated on 18th April, 2018. It is after 11 years that there is the Aboojh Muhurat on this day. It means that the day is perfect to give your new ventures a nice start. The timings for Akshay Tritiya Puja would be from 6:17 AM to 12:55 PM.Details About The Akshay Tritiya
Story first published: Thursday, April 12, 2018, 16:00 [IST]