మే నెలలో అక్షయ తృతీయ, బుద్ధ పౌర్ణమితో పాటు ముఖ్యమైన పండుగలివే...

మన క్యాలెండర్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మే నెలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, రెండో నెల అయిన వైశాఖ మాసం ఈ నెలలోనే వస్తుంది.

Festivals and Vrats in the month of may 2021

ఈ నెలలో అక్షయ తృతీయ, పరశురామ జయంతి, బుద్ధ పౌర్ణమి వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకోనున్నారు. వీటితో పాటు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కూడా ఇదే నెలలో రానుంది.

Festivals and Vrats in the month of may 2021

ఈ నెలలో హిందువులు, ముస్లింలు చాలా రోజుల పాటు ఉపవాసాలు ఉండి భగవంతుడిని ప్రార్థిస్తారు. హిందువులు ఈ నెలలో వినాయక చతుర్థి, శని ప్రదోష్ వ్రతం, బుద్ధ పూర్ణిమ మరియు వైశాఖ పూర్ణిమ రోజునే ఉపవాసం ఉంటారు. ఈ సందర్భంగా 2021 మే మాసంలో ఏయే రోజుల్లో ఏయే పండుగలు ఏ రోజుల్లో రానున్నాయి.. ఏ వ్రతాలు ఏ రోజున చేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మే 7న వరూదిని ఏకాదశి

మే 7న వరూదిని ఏకాదశి

ఈ నెలలో ఆరో తేదీన అర్ధరాత్రి 2 గంటల నుండి వరుదిని ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. ఈరోజు ఉదయం నుండి ఉపవాసం ఉంటారు. ఈ ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణుని పాదాల వద్ద తెల్లని పువ్వులను ఉంచి పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని.. కోరికలు నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఈ ఏకాదశి 7వ తేదీ మధ్యాహ్నం రోజున ముగుస్తుంది.

మే 11న వైశాఖ అమావాస్య..

మే 11న వైశాఖ అమావాస్య..

పురాణాల ప్రకారం, ఈ నెలలోనే త్రేతా యుగం ప్రారంభమైంది. ఈ నెలలో ప్రతిరోజూ చాలా ధర్మంగా పరిగణించబడుతుంది. మే 11వ తేదీన వచ్చే వైశాఖ అమావాస్యకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున ప్రవహించే నీటిలో స్నానం చేయడం, పేదలకు విరాళం ఇవ్వడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది.

మే 10వ తేదీన రాత్రి 9:57 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది.

మే 12వ తేదీన అర్ధరాత్రి 12:31 గంటలకు ముగుస్తుంది.

మే 14న అక్షయ తృతీయ

మే 14న అక్షయ తృతీయ

హిందూ పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే అఖా తీజ్ అని కూడా అంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం, ఏదైనా విలువైన వస్తువులను దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడో తిథిలో ఈ పండుగ వస్తుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మే 14వ తేదీన ఈ పండుగ వస్తుంది. ఇదే రోజున పరశురాముని జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటారు. ఇదే రోజున ఉత్తరఖాండ్ లోని యమున, గంగోత్రి తలుపులు కూడా తెరచుకుంటాయి.

మే 21న సీతా నవమి..

మే 21న సీతా నవమి..

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నవమిని ‘జానకి నవమి' అని కూడా అంటారు. శ్రీరామ నవమి మాదిరిగానే సీతా నవమి కూడా చాలా ముఖ్యమైందని భక్తులు భావిస్తారు. ఈరోజున సీతాదేవిని పూజిస్తే.. శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

పూజా సమయం..

నవమి తేదీ ప్రారంభం : మే 20వ తేదీ మధ్యాహ్నం 12:25 గంటలకు

నవమి ముగింపు : మే 21వ తేదీ రాత్రి 11:10 గంటలకు

మే 22, మోహిని ఏకాదశి..

మే 22, మోహిని ఏకాదశి..

వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈరోజు చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. శ్రీవిష్ణుమూర్తిని పూజించి.. తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. తమకు కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు.

ఏకాదశి శుభ ముహుర్తం..

ప్రారంభ సమయం : మే 22 ఉదయం 9:15 గంటలకు..

ముగింపు సమయం : మే 23వ తేదీ ఉదయం 6:45 గంటలకు

మే 26న, బుద్ధ పూర్ణిమ

మే 26న, బుద్ధ పూర్ణిమ

హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసంలో అంటే మే 26వ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తుంది. ఈరోజే బుద్ధ జయంతి జరుపుకుంటారు. ఇది విష్ణువు యొక్క తొమ్మిదో అవతారమని చెబుతుంటారు.

పౌర్ణమి ముహుర్తం..

ప్రారంభ సమయం : మే 25 ఉదయం 8:22 గంటలకు

ముగింపు సమయం : మే 26న ఉదయం 4:42 గంటలకు

మరికొన్ని పండుగలు..

మరికొన్ని పండుగలు..

ఇదే నెలలో మరికొన్ని పండుగలు కూడా ఉన్నాయి.

మే 8వ తేదీన శనివారం, శని ప్రదోష్ వ్రతం

మే 9వ తేదీన ఆదివారం, నెలవారీ శివరాత్రి,

మే 15న వినాయక చవితి

మే 20న దుర్గాష్టమి, భాగల్ ముఖి జయంతి

మే 29న సంకష్ట చతుర్థి

Desktop Bottom Promotion