For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్ట్ ట్యూబ్ బేబీలు, లైవ్ టెలికాస్ట్, టైమ్ మిషన్ ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి,వారు అప్పుడే ఉపయోగించారు

తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో నేర్చుకున్నాడు అభిమన్యుడు. మొదట్లో ఇలాంటి విషయాలను జనాలు నమ్మేవారు కాదు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ చాలా విషయాలను అర్థం చేసుకోగలదని బయట

|

టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ప్రక్రియ ఇప్పడే కాదు మన పురాణాల్లోనూ ఉందంటూ ఈ మధ్య ఒక పెద్దాయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది. అలాగే పురాణాల్లో ఇప్పుడు మనం ఉపయోగించే టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీల దగ్గర నుంచి న్యూక్లియర్ వెపన్స్ వరకు అన్నీ ఉపయోగించారు వారు.

విమానాలు

విమానాలు

ఇప్పట్లో మనకు ఎలా అయితే విమనాలున్నాయో అప్పట్లో కూడా విమనాలాంటివి ఉన్నాయి. గరుత్మంతుడు మహావిష్ణువు విమానం మాదిరిగానే ఉండేవాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి గాల్లో తీసుకెళ్లేవాడు. కావాల్సిన గ్రహంపై క్షణాల్లో విష్ణువును తీసుకెళ్లేవాడు.

విమానాలు

విమానాలు

ఇప్పట్లో మనకు ఎలా అయితే విమనాలున్నాయో అప్పట్లో కూడా విమనాలాంటివి ఉన్నాయి. గరుత్మంతుడు మహావిష్ణువు విమానం మాదిరిగానే ఉండేవాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి గాల్లో తీసుకెళ్లేవాడు. కావాల్సిన గ్రహంపై క్షణాల్లో విష్ణువును తీసుకెళ్లేవాడు.

క్లోనింగ్

క్లోనింగ్

సీతమ్మ మట్టి కుండలో జన్మించిందని మనం పురాణాల్లో చదివాం మరి. ఇక జనకుడు చనిపోయిన తన తండ్రి నిమి శరీరం నుంచి ఏర్పడతాడు. అంటే అప్పట్లోనే క్లోనింగ్ అనే వ్యవస్థ ఉండేదని అర్థం చేసుకోవొచ్చు.

100మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే

100మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే

ఇక మహాభారతంలో కౌరవుల పుట్టుక ప్రత్యేకం. కౌరవుల తల్లి అయిన గాంధారి వంద అండాల్ని 100 కుండల్లో ఉంచి ఫలదీకరింపచేయడంతో 100మంది కౌరవులు పుట్టారు. అలా మహాభారతంలోనే 100 మంది టెస్ట్‌ట్యూబ్‌ బేబీస్ పుట్టారు. అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఉంది మరి.

Most Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథMost Read :మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, జయవిజయల కథ

అణ్వాయుధాలు

అణ్వాయుధాలు

మనకు హిరోషిమా-నగసాకి అణు బాంబు విధ్వసం గురించి తెలుసు. అయితే మహాభారతంలో కూడా ఇలాంటి యుద్ధాలు మనకు చాలానే కనిపిస్తాయి. అప్పట్లో యుద్ధాల్లో చాలా భూభాగాలు సర్వ నాశనం అయ్యాయి. అప్పట్లో కూడా అణ్వయుధాలాంటివి ఉపయోగించారు.

అవయవ మార్పిడి

అవయవ మార్పిడి

మనం ఇప్పుడు వైద్యంలో వస్తున్న సాంకేతిక మార్పుల వల్ల అవయవ మార్పిడి చేస్తున్నాం. అయితే పురణాల్లో ఇలాంటి అవయవాల మార్పిడి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శివుడు వినాయకుడి తలను నరికినప్పుడు దాని స్థానంలో ఏనుగు తలను ఉంచుతారు. అంటే అప్పట్లో కూడా అవయవమార్పిడి టెక్నాలజీ ఉందని అర్థం చేసుకోవొచ్చు. ఇలాంటి సంఘటనలు పురాణాల్లో చాలా ఉన్నాయి.

రామసేతు బ్రిడ్జి

రామసేతు బ్రిడ్జి

రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య ఉంది. రామాయణ కాలం లో నిర్మించిన ఈ వంతెన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. అప్పట్లో సీతమ్మను రక్షించుకునేందుకు శ్రీలంకకు రాములవారు వానరసేనతో కలిసి ఫ్లోటింగ్ రాళ్ల భారీ వంతెన నిర్మించారు. ఇప్పటికీ గూగుల్ శాటిలైట్ లో ఈ బ్రిడ్జి మ్యాప్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఉపయోగించే టెక్నాలజీనీ అప్పట్లోనే వారు ఉపయోగించారని అర్థం చేసుకోవొచ్చు.

లైవ్ టెలికాస్ట్

లైవ్ టెలికాస్ట్

ప్రత్యక్ష ప్రసారం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ మహాభారతంలో అంధుడైన ధ్రితరాష్టుడు కురుక్షేత్ర యుద్ధం గురించి చూడకుండానే ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ తెలుసుకున్నాడు.

యుద్ధంలో జరిగే విషయాలపై ధృత రాష్ట్రుడుకి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలిపేందుకు శ్రీ కృష్ణుడు అతనికి సంరక్షకుడికి రాజభవనంలో సంజయ్ అనే అతన్ని నియమించాడు. అతడు యుద్ధ విషయాలు వెంటవెంటనే తెలుసుకుని ధృత రాష్ట్రుడుకి చెప్పేవాడు.

Most Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడుMost Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడు

తల్లి గర్భంలో ఉన్నప్పుడే

తల్లి గర్భంలో ఉన్నప్పుడే

తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో నేర్చుకున్నాడు అభిమన్యుడు. మొదట్లో ఇలాంటి విషయాలను జనాలు నమ్మేవారు కాదు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ చాలా విషయాలను అర్థం చేసుకోగలదని బయట మాట్లాడే ప్రతి విషయాలను వినగలదని ప్రస్తుతం సైన్స్ కూడా ప్రూవ్ చేసింది.

టైమ్ మిషన్

టైమ్ మిషన్

అప్పట్లో చాలా మంది టైమ్ మిషన్స్ లో ప్రయాణించారు. బ్రహ్మను కలుసుకునేందుకు రాజు రైవాటా కాకుడిమీ కథనే ఇందుకు ఉదాహరణ. ఆయన బ్రహ్మను కలిసి మళ్లీ భూమికి తిరిగి వచ్చేసరికి 108 యుగాలు గడిచిపోయాయి. ప్రతి యుగంలో 4 మిలియన్ సంవత్సరాలుంటాయి.

అప్పుడు బ్రహ్మ అతనికి ఆ యుగాల గురించి వివరిస్తారు. దేవలోకంలో యుగానికి ఒక సమయం, భూలోకంలో యుగానికి మరో సమయం ఉంటుందని వివరిస్తారు. ఇక నారదుడు అప్పట్లో ఇప్పడు గూగుల్ మాదిరిగా అన్ని విషయాలు అందరికీ చెప్పేవాడు.

ఇలా అప్పట్లోనే ఇప్పటి టెక్నాలజీ మొత్తం ఉందనడానికి మన పురణాలే నిదర్శనం.

గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలుగరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలు

English summary

From Test Tube Babies To Nuclear Weapons our ancestors were far more advanced

From Test Tube Babies To Nuclear Weapons our ancestors were far more advanced
Story first published:Thursday, January 17, 2019, 10:49 [IST]
Desktop Bottom Promotion